Tuesday, December 14, 2010

చిల్లీ మీల్ మేకర్ (సోయా చంక్స్)

ఏమిటి పేరు వినగానే చిల్లీ చికెను లాగా యీ చిల్లీ మీల్ మేకర్ అనుకుంటున్నారా? యిది చూపులకి, అచ్చం అలాగే వుంటుంది. తినటానికి కూడా అలాగే వున్నది అని తిన్న వాళ్ళు చెప్పారు (నాకు నాన్-వెజ్) రుచి తెలియదు కాబట్టి. ఏది ఏమి అయిన యిది వేజిటేరియను, నాన్-వెజ్ తినేవాళ్ళకి చక్కటి స్నాకు అయిటము అవుతుంది.
ఒక సారి మా collegue ఒక ఆమె నేను vegetarian అని, రుచి చూడమని యిచ్చింది. నేను దాన్ని తినటము, నాకు నచ్చటము, వెంటనే రెసిపి అడిగి తెలుసుకుని నోటు చీసుకోవటం అన్ని వరుసగా అయిపోయాయి. రెసిపి తెలుసు కోవటం అయితే తెలుసుకున్నాను కాని దాన్ని యింటిలో ట్రై చెయ్యటం మాత్రం మొన్నే చేసాను. మాకు తెలిసిన

Monday, December 13, 2010

అన్నప్రాసన అయ్యాక పసి పిల్లలకు పెట్టే ఉగ్గు తయారి విధానము

అన్నప్రాసన అయిన తరువాత నుండి నెమ్మదిగా దీన్నిపెట్ట వచ్చు. యిది శుభ్రం గా యింటి లోనే తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థములు:
1 కప్పు బియ్యము, 1 / 2 కప్పు కంది పప్పు, 1 / 2 కప్పు మినప పప్పు, 1 / 2 కప్పు సెనగ పప్పు, 1 / 4 కప్పు పెసర పప్పు. పెసర పప్పు ఎక్కువ వాడితే గాసు వస్తుంది అని అంటారు. అందుకు అది ఒక పావు కప్పు చాలు.

Friday, December 10, 2010

పసి పిల్లలతో ఇండియా ప్రయాణం అయ్యేప్పుడు చూసుకోవాల్సిన చెక్కు లిస్టు

యీ బ్లాగ్ పసి పిల్లలతో ఇండియా వెళ్ళేవాళ్ళ కోసం రాసాను. ఒక 5 ఏళ్ళ క్రితం మా అమ్మాయి మొదటి ఏడాది పుట్టిన రోజు సందర్బముగా ఇండియా వెళ్ళాము. అప్పుడు నేను ఏమి తీసుకుని వెళ్లి నానో, వాటికి సంబందించిన లిస్టు రాయబోతున్నాను. యీ బ్లాగ్ చూసిన వాళ్ళకి యిది తప్పకుండా ఉపయోగపడుతుందని నా నమ్మకం. యివి కాక మీకు యింకా ఏమైనా తట్టినా, తప్పకుండా మీ కామెంటులు పోస్టు చేయవచ్చు. మేము ఒక 3 నెలల కు వెళ్ళాము. ఆ ప్రకారం రాసాను. యింకా మీరు, మీ వాడకాన్ని బట్టి మీరు అంచనా వేసుకుని తీసుకుని వెళ్ళండి.