Monday, November 7, 2011

చిట్కా లిస్టు 4

1. బిస్కట్టులు నిలవ చేసే డబ్బాలో అడుగున ఒక blotting పేపరు వేస్తే, బిస్కట్టులు తాజాగా వుంటాయి.
2.      అరటిపండును చిదిమి కాలిన గాయాలకు రాస్తే కూలింగ్ ఎఫ్ఫెక్ట్ యిస్తుంది.
3.      1 pinch chewing tobacco , ఒక చుక్క నీళ్ళు కలిపి, తేనెటీగ కాని తేలు కాని కుట్టిన ప్రదేశం లో వెంటనే కనుక పెట్టి, బ్యాండ్ ఎయిడ్ తో కవర్ చేస్తే, నొప్పి కొద్ది నిమిషాలలో తగ్గిపోతుంది.
4.      Celery ని అల్యుమినియము ఫాయిలు లో చుట్టి ఫ్రిజ్జి లో పెడితే ఎక్కువ రోజులు వుంటుంది.
5.      వంటగది మూలలలోఇంకా బొద్దింకలు తిరిగే చోట కాస్త బోరిక్ పౌడరు చల్లితే వాటి బెడద తీరుతుంది.
      6.   Dry Fruits తేలికగా కోయాలి అంటే ఒక అర గంట పాటు వాటిని ఫ్రిజ్జి లో పెట్టి, తరువాత వేడి కత్తితో (వేడి నీళ్ళలో ముంచిన కత్తికోస్తే తేలికగా, వేగంగా కోయవచ్చు.
      7.   చపాతీ పీటకి పిండి అత్తుక్కుని తీయటానికి రాకుండా వుంటే కాసేపు ఫ్రిజ్జి లో పెట్టి తియ్యండి.

Thursday, September 29, 2011

ఫ్రైడ్ ఐస్క్రీం

అమ్మో ఏంటిది అనుకుంటున్నారా? Same feeling నాకు కూడా నేను మొదటి సారి విన్నప్పుడుకాని చూసాక భలే బాగా అనిపించింది ప్రయోగం నా సొంత ప్రయోగం కాదుపోయిన ఏడాది 'మాటీవీ లో 'మా వూరి వంటఅమెరికా స్పెషల్స్ లో ఒక ఆవిడా చేసారుజాగ్రత్తగా నోటు చేసి పెట్టుకున్నాను కాని  నేను మాత్రం  ప్రయోగం చేయలేదుయిది నాకు ఎందుకో కొంచం complicated గా అనిపించిందియింకా అంత శ్రమ కూడా నామటుకు నాకు అనవసరం అనిపించింది

Tuesday, September 20, 2011

ఎంబ్రాయిడరీ చీర

చిన్నప్పటి నుండి కుట్లు అన్నాఅల్లికలు అన్నా నాకు చాలా యిష్టంమా పైన యింటిలో కుమారి ఆంటీ అని ఒక ఆవిడ వుండేవారుఆవిడకి రాని కుట్లు అంటూ లేవేమో అని  నా అభిప్రాయంఎప్పుడు ఏదో ఒకటి కుడుతూనే వుండేవాళ్ళుఎక్కువగా ఆవిడ కచ్వర్క్ కుట్టేవాళ్ళునాకు అన్ని కుట్లు రావు కాని బేసిక్ కుట్లు కొన్ని వచ్చుకాని ఆవిడ కుడుతున్నవి అన్ని బాగా ఫాలో అయ్యి చూసేదాన్నిఆవిడకి కూడా తెలుసు నాకు వీటి మిద యిష్టం వుంది అని            చదువుకునే రోజులు కదండీ ఎక్కడ కుదురుతుంది మనకి చెప్పండి.... కాని వేసవి సెలవలకి ముందే ఆవిడకి చెప్పిపెట్టేదాన్ని 'ఆంటీ యిసారి డ్రెస్ మీద డిజైన్ వేద్దాము అనుకుంటున్నాను' అనో లేక 'చీర మిద వేయాలి' అనో చెప్పేదాన్ని. ఆవిడ కి నాకు  రంగులు యిష్టమో,  designs యిష్టమో అన్ని తెలుసుతేలిక అయిన చక్కటి కుట్లు నేర్పేవాళ్ళుయింక సమ్మర్ అంతా అలా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసేదాన్నికార్బన్ పేపర్ తో ముందుగా డిజైన్ను చీర మిద వేసుకుని తరువాత కుట్టు మొదలు పెట్టేదాన్ని.      సాధారణంగా కుట్లు నేర్చుకోవాలి అంటే ఎవరు అయిన నేర్పితే రావాలిపుస్తకం లో బొమ్మలు వేసి చూపినా అవి అంత క్లియర్ గా వుండవుఅర్ధము కాదుhttp://www.needlenthread.com/ అని ఒక వెబ్సైటు వుందిదానిలో వీడియో సెక్షన్ కు వెళ్లి చూడండిచాలా బాగా అన్ని కుట్లు ఎలా కుట్టాలో పొందుపరిచి ఉంచారుమనకు తెలీని చాలా కుట్లు అందులో వున్నాయిఒక dictionary లాగా వుంది అది నాకు.  కుట్ల పేర్లు మనకి తెలుగులో తెలుసు కాని వాటిని exact గా ఇంగ్లీష్ లో ఎలా అంటారో తెలిదు కాని వీడియోలు చూస్తే పేర్లు కూడా తెలుస్తాయి. నిజంగా కుట్లు, అల్లికలు, ఆర్ట్లు యిష్టం ఉన్నవాళ్ళకి  వెబ్సైటు చాలా ఉపయోగకరం. తప్పకుండా నచ్చితీరుతుంది.

Tuesday, August 9, 2011

కీ బోర్డ్ కీస్ తో సృజనాత్మకత

ఇంటర్నెట్టు లో చాటింగ్ అది చేస్తున్నప్పుడు emoticons (emotional icons)  ని సందర్భం బట్టి ఉపయోగించటం, ఎవరన్నా పంపినా వాటిని ఎంజాయ్ చెయ్యటం నాకు ఎందుకో చాలా యిష్టం. 
 యాహూ messenger లోని emoticons చాలా నచ్చుతాయి నాకు. ఎవరినన్నా ఏడిపిస్తూ మాట్లాడేటప్పుడు 'కన్నుకొట్టే ' icon , 'యిది రహస్యం' అని చెప్పటానికి ఒకటిఇలాగ మన emotions కి
Ganesh made with Keyboard keys

 

Monday, June 20, 2011

గోధుమ రవ్వ బిసిబెలబాత్

కావలసిన పదార్ధాలు:

గోధుమరవ్వ ఒక కప్పుకందిపప్పు అర కప్పు, కారెట్ ముక్కలు గుప్పెడు, బీట్ రూట్ ముక్కలు గుప్పెడుబటానీలు గుప్పెడు, బంగాళ దుంప ఒకటి, ఉల్లి పాయ ఒకటి, టొమాటో ఒకటి, పచ్చిమిర్చి రెండు, బీన్స్ గుప్పెడు, ఉప్పు, నూనె, బిసిబెలబాత్ పొడిచెంచాలు, కరివేపాకు ఒక రెబ్బ ,వెల్లుల్లి రెబ్బ ఒకటిఆవాలు 1 /4 స్పూను మినపప్పు 1 /4 స్పూను, నూనె రెండు స్పూనులు , పసుపు చిటికెడు, చింతపండు కొంచం, ఎండు మిర్చి రెండు.  

Tuesday, May 24, 2011

గోధుమరవ్వ పొంగలి

కావలసిన పదార్దములు: గోధుమ రవ్వ 1 కప్పుపెసరపప్పు 1 / 2 కప్పు, అల్లం చిన్న ముక్కకరివేపాకునూనెఉప్పుపాలుమిరియాలు 1 / 2 స్పూనుజీల కర్ర  1 / 2 స్పూను, ఆవాలు 1 / 2 స్పూను, పాల కూర 1 / 2 కట్ట లేదా 1 / 4 కట్ట
 

Tuesday, May 10, 2011

ఆరోగ్యం గా బరువు తగ్గటం ఎలా?

మధ్య రెండు మూడేళ్ళ క్రితం ఎందుకో డాక్టర్ దగ్గరికి వెళ్తే cholestrol (triglyceroids ) సంఖ్య చాలా ఎక్కువ వున్నట్లు చెప్పారు. అప్పటిదాకా అసలు cholestrol అంటే ఏమిటి, triglyceroids అంటే ఏంటి, అసలు వినటమే కాని వాటి గురించిన జ్ఞానం లేదు. 'నువ్వు బరువు తగ్గాలి, అన్నం తగ్గించాలి' లాంటివి చాలా చెప్పింది మా డాక్టర్. excercises వగయిరా లు చేయాలి అని కూడా చెప్పింది. అప్పటిదాకా excercises కాని dieting లు కాని చేసి ఎరుగను. అప్పుడు యిక కూర్చుని అసలు ఈ  cholestrol ఏంటి, వాకింగ్ ఏంటి, ఎలా తగ్గించాలి అని రకరకాలుగా గూగుల్ లో వెతికాను. చాలా ఇన్ఫర్మేషన్ దొరికిందిఅంతా కూడా excercises ,  వాకింగ్ చెయ్యమని చెప్పటమే. ' ఒక్కటి అడక్కు' టైపు నేను excercises విషయంలో. మా ఆయనకీ, నాకు ఎప్పుడు అక్కడే గొడవ. 'అస్సలు ఒంటిని కష్ట  పెట్టవు' అంటూ మొదలు పెడతారు. నాకేమో excercises అవి చేస్తుంటే తెగ టైము వేస్టు చేస్తున్న ఫీలింగు. బోలెడు పని పెట్టుకుని యివి చెయ్యటం కూడా రోజు కుదరదు  (కుదుర్చుకుంటే తప్పకుండా కుదురుతుంది).  సరే అలా ఆలోచిస్తూ వుంటే dieting చేస్తే ఎలా వుంటుంది అనిపించింది. కాని  విషయానికి వస్తే నేను వుపవాసలకు పూర్తి వ్యతిరేకిని. అసలు ఆగుదాము అన్నాఆగలేను ఆకలికి. Exercises చెయ్యక, dieting చెయ్యక, మరి ఏమిటి చెయ్యటం?   అప్పుడు తట్టింది నాకు.. తినే ఆహారం లో కాలోరీ కౌంటు తక్కువ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది కదా అని