Wednesday, March 30, 2011

చిట్కా లిస్టు 3

1. పెరుగు గిన్నెలో చిన్న కొబ్బరి ముక్క వేసి ఉంచితే పెరుగు పులవదు.

2. కూరలలో ఉప్పు ఎక్కువ అయితే రెండు చెంచాల పాల మీగడ వేసి కలిపితే చాలా రుచిగా వుంటుంది.

3. ఒక ప్లేటు లో బొగ్గులు వేసి ఫ్రిజ్జి లో ఉంచితే ఆ బొగ్గులు దుర్వాసనను పీల్చి ఫ్రిజ్జి ని తాజాగా ఉంచుతాయి.

4. ఫ్రిజ్జి లో గుడ్లు నిలవ చేసేటప్పుడు, సన్న భాగం కిందకు, వెడల్పు భాగం పైకి ఉండేలా నిలవ చేస్తే గుడ్లు తాజాగా వుంటాయి.

5. ఫ్రిజ్జి లో పెట్టె ice trays కి కాస్త నూనె రాసి, నీళ్లు పోసినట్లు అయితే, ice cubes తేలికగా తీయవచ్చును.

6. Dining Table మధ్యలో పుదినా ఆకులు ఉంచితే ఆ వాసనకు దోమలు, యీగలు దరిచేరవు.

7. Dining Table ను రసం పిండేసిన నిమ్మ డిప్పలతో తుడిస్తే టేబుల్ మీద ఉన్నజిడ్డు పోతుంది.

8. ఉల్లి పాయ తిన్న తరువాత ఒక యాలక్కాయ నమిలితే నోటి నుండి ఉల్లి వాసన రాకుండా అరికట్టవచ్చు.

Monday, March 21, 2011

చిట్కా లిస్టు 2

రెండో లిస్టు ని తిలకించండి....

1. Noodles ఉడికాక ఉడికించిన నీరు పారపోసి, చల్లని నీరు పోస్తే, విడివిడిగా వస్తాయి.

2. పాలకూర, యితర ఆకుకూరలు వుడుకుతున్నప్పుడు కాస్త చక్కర వేసి ఉడికిస్తే రంగు మారకుండా వుంటుంది.

3. Bay Leaf ను పిండి వున్న డబ్బాలో వేస్తే, పిండిలో తేమ చేరకుండా వుంటుంది.

4. అల్యూమినియం పాత్రలలో పుట్ట గొడుగులు వండితే, పుట్ట గొడుగులు డార్కు గా అవుతాయి. అందుకు అవి వేరే ఏది అయిన పాత్రలో వండాలి.

5. అరటి పండు త్వరగా పండాలి అంటేనే ఆపిలు పండు దగ్గర పెట్టాలి.

Friday, March 18, 2011

చిట్కా లిస్టు 1

నాకు తెలిసిన వంటయింటి చిట్కాలు ఒక చోట సమకూర్చి అందరికి అందుబాటులో ఉంచటమే నా ఉద్దేశం. వీటిలో కొన్ని నాకు తెలిసినవి, కొన్ని సైటులలో చూసి సేకరించినవి. వంట ఇంటి చిట్కాలు అని ఎక్కడ చూసిన వాటిని రాసి పెట్టుకునేదాన్ని. అలా కొన్ని టీవీ లో చూసినవి కూడా వున్నాయి. యీ చిట్కాలకి అంతు అంటూ వుండదు కాబట్టి అన్నిటిని ఒకే చోట పొందుపరిస్తే వీలుగా వుండదు కనుక ఒక్కో పోస్టులో 50 చొప్పున పెడుతున్నాను. తప్పకుండా వీటిని చదివి, మీ రోజు వారి జీవితం లో వుపయోగిన్చుకోటానికి ప్రయత్నించండి.

1. పచ్చి మిర్చి నమిలినప్పుడు, రెండు చుక్కల మజ్జిగ లేదా చెంచా పెరుగు, పిల్లలు అయితే అర గ్లాసు పాలు లేదా ఒక బ్రెడ్డు ముక్క తింటే ఆ మంట తగ్గుతుంది.

2. పిల్లల దుస్తుల మీద సాస్ పడితే ఆ ప్రాంతం లో గ్లిసరిన్ రాసి, సబ్బుతో రుద్దాలి.

3. బెండ కాయ కూర చేయటానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు వుండదు.

4. ప్లాస్టిక్కు వాటర్ బాటిల్స్ కడిగే ముందు చిటికెడు తినే సోడా అంతే సిట్రిక్ ఆసిడ్ వేసి కాస్త నీళ్ళు పోసి రెండు నిముషాలు వుంచి కడగండి. అడుగున ఉన్నమురికి పోతుంది.

5. సాంబారు లో ఉప్పు ఎక్కువ అయితే ఉడికించిన బంగాళ దుంపలు వేయండి.