Thursday, September 29, 2011

ఫ్రైడ్ ఐస్క్రీం

అమ్మో ఏంటిది అనుకుంటున్నారా? Same feeling నాకు కూడా నేను మొదటి సారి విన్నప్పుడుకాని చూసాక భలే బాగా అనిపించింది ప్రయోగం నా సొంత ప్రయోగం కాదుపోయిన ఏడాది 'మాటీవీ లో 'మా వూరి వంటఅమెరికా స్పెషల్స్ లో ఒక ఆవిడా చేసారుజాగ్రత్తగా నోటు చేసి పెట్టుకున్నాను కాని  నేను మాత్రం  ప్రయోగం చేయలేదుయిది నాకు ఎందుకో కొంచం complicated గా అనిపించిందియింకా అంత శ్రమ కూడా నామటుకు నాకు అనవసరం అనిపించింది

Tuesday, September 20, 2011

ఎంబ్రాయిడరీ చీర

చిన్నప్పటి నుండి కుట్లు అన్నాఅల్లికలు అన్నా నాకు చాలా యిష్టంమా పైన యింటిలో కుమారి ఆంటీ అని ఒక ఆవిడ వుండేవారుఆవిడకి రాని కుట్లు అంటూ లేవేమో అని  నా అభిప్రాయంఎప్పుడు ఏదో ఒకటి కుడుతూనే వుండేవాళ్ళుఎక్కువగా ఆవిడ కచ్వర్క్ కుట్టేవాళ్ళునాకు అన్ని కుట్లు రావు కాని బేసిక్ కుట్లు కొన్ని వచ్చుకాని ఆవిడ కుడుతున్నవి అన్ని బాగా ఫాలో అయ్యి చూసేదాన్నిఆవిడకి కూడా తెలుసు నాకు వీటి మిద యిష్టం వుంది అని            చదువుకునే రోజులు కదండీ ఎక్కడ కుదురుతుంది మనకి చెప్పండి.... కాని వేసవి సెలవలకి ముందే ఆవిడకి చెప్పిపెట్టేదాన్ని 'ఆంటీ యిసారి డ్రెస్ మీద డిజైన్ వేద్దాము అనుకుంటున్నాను' అనో లేక 'చీర మిద వేయాలి' అనో చెప్పేదాన్ని. ఆవిడ కి నాకు  రంగులు యిష్టమో,  designs యిష్టమో అన్ని తెలుసుతేలిక అయిన చక్కటి కుట్లు నేర్పేవాళ్ళుయింక సమ్మర్ అంతా అలా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసేదాన్నికార్బన్ పేపర్ తో ముందుగా డిజైన్ను చీర మిద వేసుకుని తరువాత కుట్టు మొదలు పెట్టేదాన్ని.      సాధారణంగా కుట్లు నేర్చుకోవాలి అంటే ఎవరు అయిన నేర్పితే రావాలిపుస్తకం లో బొమ్మలు వేసి చూపినా అవి అంత క్లియర్ గా వుండవుఅర్ధము కాదుhttp://www.needlenthread.com/ అని ఒక వెబ్సైటు వుందిదానిలో వీడియో సెక్షన్ కు వెళ్లి చూడండిచాలా బాగా అన్ని కుట్లు ఎలా కుట్టాలో పొందుపరిచి ఉంచారుమనకు తెలీని చాలా కుట్లు అందులో వున్నాయిఒక dictionary లాగా వుంది అది నాకు.  కుట్ల పేర్లు మనకి తెలుగులో తెలుసు కాని వాటిని exact గా ఇంగ్లీష్ లో ఎలా అంటారో తెలిదు కాని వీడియోలు చూస్తే పేర్లు కూడా తెలుస్తాయి. నిజంగా కుట్లు, అల్లికలు, ఆర్ట్లు యిష్టం ఉన్నవాళ్ళకి  వెబ్సైటు చాలా ఉపయోగకరం. తప్పకుండా నచ్చితీరుతుంది.