Saturday, November 30, 2013

American English

మనం రోజు వారి వాడే ఆంగ్ల పదాలే, అమెరికన్లు వేరే విధంగా వాడటం విని, చూసి నేను అమెరికా వచ్చిన కొత్తలో చాలా కొత్తగా అనిపించేది. భలే తమాషా గా అనిపించేది.  ఇంకా కొత్తగా ఎమి ఉంటాయో  అని తెలుసుకోవాలి అనిపించేది.

ఉదాహరణకి మనం 'పెరుగు' ని ఆంగ్లం లో 'curd ' అంటాము. కాని ఇక్కడ వీళ్ళు 'yogurt ' అంటారు. అలాంటివి అనమాట. ఇక్కడే కొంతకాలం ఉండే పాటికి మనకి ఆ పదాలు వాడటం అలవాటు అయిపోయి, అసలు మనం వాడే పదాలే మరచిపోతాము. అలా సరదాగా నాకు గుర్తు ఉన్నవి నా పోస్టులో వ్రాస్తున్నాను.       ఈ బ్లాగ్ చదివిన వారెవరికయినా నేను మిస్ అయినవి చెప్పాలి అనుకుంటే తప్పకుండా కామెంట్స్ లో పోస్టు చెయ్యచ్చు.

  అమెరికన్లు FPS  conversion, మనము MKS conversion వాడటం మూలాన కూడా మనకు కొన్ని తేడాలు కనపడతాయి. ఉదాహరణకి 'ఫలానా డల్లాస్ నుండి అట్లాంటా ఎంత దూరం అండి' అంటే మనమయితే ఇన్ని కిలోమీటర్లు అని చెప్తాము. అదే ఇక్కడ అయితే ఇన్ని miles అని చెప్తారు. అలానే ధ్రవాపదార్దాలను గాలన్ల లోను (మనమయితే లీటర్లలో ) ఇంకా బరువును పౌండ్ లలోను (మనము కిలోగ్రాములలోను ) కొలుస్తాము.
     ఇంక మొదలుపెడదామా ....