Friday, November 6, 2015
Thursday, April 16, 2015
దివాలి కేకు
ఈ కేకు కి కూడా మార్జిపాన్ ని వాడను దీపావళి Fireworks కోసం. చిచ్చుబుడ్డి, భూచక్రం, కాకరపువ్వొత్తి, దీపాలు, తారాజువ్వలు అన్ని మార్జిపాన్తో చేసినవే. కాకరపువ్వొత్తి కాడ కోసం లాలిపాప్ స్టిక్స్ వాడాను. సీమటపాకాయల క్యాండీ స్త్రింగ్స్ అని దొరుకుతాయి. అవి తెచ్చి కట్ చేసి వాడాను. ఇంకా బోర్డర్స్ లో దివాలి లైట్స్ వైరింగ్ కి కూడా ఆ క్యాండీ స్త్రింగ్స్ వాడాను. బల్బ్స్ కోసం జెల్లీ బీన్స్ వాడాను. అలానే బ్లూ షుగర్ crystals వాడాను పైన కేకు decoration కోసం.
మార్జిపాన్ తో చేసిన కాకరపువ్వొత్తులు
క్యాండీ
స్త్రింగ్స్ తో చేసిన సీమటపాకాయలు
Halloween Trick or Treat Bag Cake
ఇది చాలా సింపుల్
కేకు అండి. ఒక స్క్వేర్ కేకు చేయాలి ముందు. దానికి ఆరంజ్ రంగు ఐసింగ్ పూయాలి. ఐసింగ్
లో బ్రౌన్ కలర్ వేసి కళ్ళు, ముక్కు, మూతి పెట్టాలి. బాగ్ కి బోర్డర్స్ కోసం Candy
Corns (store bought) వాడాను. బాగ్ Handles కోసం black twizzlers వాడాను. సంచి లో నుండి
candies పడిపోతున్నట్లు candies అన్ని ఆ బాగ్ ముందు భాగం లో అతికించటం అంతే. కొన్ని
కింద ప్లేట్ లో కూడా పోసి పెట్టాలి, అంటే బాగ్ లోనుండి కిందకి పడుతున్నట్లుగా.
గార్డెన్ కేకు
ఇది నేను పవన్
పుట్టినరోజున చేసిన కేకు. మొదట ఐడియాస్ రాక, అసలు మగవాళ్ళకి నచ్చే విధం గా ఏమి చేయాలో
తెలీక చాలానే ఇబ్బంది పడ్డాను. తరువాత తన హాబీస్ కి తగినట్లు ఏమయినా చేయాలి అనిపించి
ఆ కోవలో ఆలోచించటం మొదలు పెట్టాను. తను టెన్నిస్
ఎక్కువ ఆడతారు, దానికి సంబందించినవి, ఇంకా ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం (అందరు మగవాల్లలాగానే)
దానికి సంబందించినవి, సరే రీసెంట్ గా దేని మీద ఎక్కువ మనసు పెట్టారో దాని మీద ద్రిష్టి
పెడితే కాంటెంపరరీ గా ఉంటుంది అనిపించి, ఈ గార్డెన్ కేకు ని ఎంచుకోటం జరిగినది.
Monday, April 13, 2015
Princess Elsa Cake
ఫ్రోజెన్
ప్రిన్సెస్ ఎల్సాCake:
కేకులు
తినటమే కాని ఎప్పుడు బేకింగ్
మీదకి నా మనసు వెళ్ళనే
లేదు. కానీ గత రెండు,
మూడు ఏళ్ళుగా ఇంట్లోనే నాకు తెలిసిన ఒక
సింపుల్ రెసిపీ తో కేకు చేయటం
మొదలు పెట్టాను. అది ఎప్పుడు అందరికి
బాగా నచ్చుతుంది. మా అమ్మాయి నేను
ఎప్పుడు కేకు చేసినా ఐసింగ్
చెయ్యి అంటూ ఉండేది. అంతకంటే
టైం వేస్ట్ పని వేరొకటి లేదు
అనుకునేదాన్నికాని గత ఏడాదిగా అదే
పెద్ద హాబీ అయి కూర్చుంది
నాకు ఇప్పుడు. అంటే నా ఉద్దేశం
లో ఐసింగ్ ఎలాగు మనము తినని
దానికి దాని గురించి ఆలోచించటం
ఎందుకు అని.
Saturday, July 26, 2014
ఇండియా లో ఫేమస్ బిల్డింగ్స్, గుడులు, మసీదులు etc., - కీబోర్డ్ స్కెచెస్
Monday, February 24, 2014
Plastic Canvas Box Pattern
ప్లాస్టిక్
కాన్వాస్ తో వస్తువులు చేయటం
గురించి చాలా కాలం నుండే
నాకు ఐడియా ఉన్నది కాని
ఎప్పుడు ప్రయత్నించే సమయం రాలేదు ఎప్పుడు
చేయను లెదు. Cross Stich తో
పువ్వులు అవి కుట్టటమే కానీ ఈ ప్రయత్నం
ఎప్పుడు చెయ్యలెదు. అలా Cross Stitch designs ఎన్నో కుట్టి వాటిని
ఫ్రేములకి కట్టించటం , గోడకి తగిలించటం, తీయటం
అన్ని అయ్యాయి. ఈసారి ఇంటికి ఉపయోగపడేది
ఏమయినా చేయాలి అనిపించింది. అలానే త్వరగా కూడా
అవ్వాలి అని అనిపించటం తో
ఇక ప్లాస్టిక్ కాన్వాస్ ప్రాజెక్ట్స్ అని మన గూగులమ్మ
ని అడిగితే చాలానే చెప్పింది. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ
ప్రాజెక్ట్ చేయటం జరిగినది.
మా అమ్మాయి హస్తం కుడా ఉందండోయ్ ఈ ప్రిపరేషన్లో . అసలు దానికి ఇంట్రెస్ట్ కలిగించే ప్రయత్నం లో నే మొదలు పెట్టటం జరిగింది. థాంక్స్ to మై daughter Lasya :)
మా అమ్మాయి హస్తం కుడా ఉందండోయ్ ఈ ప్రిపరేషన్లో . అసలు దానికి ఇంట్రెస్ట్ కలిగించే ప్రయత్నం లో నే మొదలు పెట్టటం జరిగింది. థాంక్స్ to మై daughter Lasya :)
Saturday, November 30, 2013
American English
మనం రోజు వారి వాడే ఆంగ్ల పదాలే, అమెరికన్లు వేరే విధంగా వాడటం విని, చూసి నేను అమెరికా వచ్చిన కొత్తలో చాలా కొత్తగా అనిపించేది. భలే తమాషా గా అనిపించేది. ఇంకా కొత్తగా ఎమి ఉంటాయో అని తెలుసుకోవాలి అనిపించేది.
ఉదాహరణకి మనం 'పెరుగు' ని ఆంగ్లం లో 'curd ' అంటాము. కాని ఇక్కడ వీళ్ళు 'yogurt ' అంటారు. అలాంటివి అనమాట. ఇక్కడే కొంతకాలం ఉండే పాటికి మనకి ఆ పదాలు వాడటం అలవాటు అయిపోయి, అసలు మనం వాడే పదాలే మరచిపోతాము. అలా సరదాగా నాకు గుర్తు ఉన్నవి నా పోస్టులో వ్రాస్తున్నాను. ఈ బ్లాగ్ చదివిన వారెవరికయినా నేను మిస్ అయినవి చెప్పాలి అనుకుంటే తప్పకుండా కామెంట్స్ లో పోస్టు చెయ్యచ్చు.
అమెరికన్లు FPS conversion, మనము MKS conversion వాడటం మూలాన కూడా మనకు కొన్ని తేడాలు కనపడతాయి. ఉదాహరణకి 'ఫలానా డల్లాస్ నుండి అట్లాంటా ఎంత దూరం అండి' అంటే మనమయితే ఇన్ని కిలోమీటర్లు అని చెప్తాము. అదే ఇక్కడ అయితే ఇన్ని miles అని చెప్తారు. అలానే ధ్రవాపదార్దాలను గాలన్ల లోను (మనమయితే లీటర్లలో ) ఇంకా బరువును పౌండ్ లలోను (మనము కిలోగ్రాములలోను ) కొలుస్తాము.
ఇంక మొదలుపెడదామా ....
ఉదాహరణకి మనం 'పెరుగు' ని ఆంగ్లం లో 'curd ' అంటాము. కాని ఇక్కడ వీళ్ళు 'yogurt ' అంటారు. అలాంటివి అనమాట. ఇక్కడే కొంతకాలం ఉండే పాటికి మనకి ఆ పదాలు వాడటం అలవాటు అయిపోయి, అసలు మనం వాడే పదాలే మరచిపోతాము. అలా సరదాగా నాకు గుర్తు ఉన్నవి నా పోస్టులో వ్రాస్తున్నాను. ఈ బ్లాగ్ చదివిన వారెవరికయినా నేను మిస్ అయినవి చెప్పాలి అనుకుంటే తప్పకుండా కామెంట్స్ లో పోస్టు చెయ్యచ్చు.
అమెరికన్లు FPS conversion, మనము MKS conversion వాడటం మూలాన కూడా మనకు కొన్ని తేడాలు కనపడతాయి. ఉదాహరణకి 'ఫలానా డల్లాస్ నుండి అట్లాంటా ఎంత దూరం అండి' అంటే మనమయితే ఇన్ని కిలోమీటర్లు అని చెప్తాము. అదే ఇక్కడ అయితే ఇన్ని miles అని చెప్తారు. అలానే ధ్రవాపదార్దాలను గాలన్ల లోను (మనమయితే లీటర్లలో ) ఇంకా బరువును పౌండ్ లలోను (మనము కిలోగ్రాములలోను ) కొలుస్తాము.
ఇంక మొదలుపెడదామా ....
Saturday, April 20, 2013
Tuesday, March 5, 2013
అమెరికా లో పనసపొట్టు కూర
పనస పొట్టు ఆవ పెట్టిన కూర ని నేను ప్రత్యేకం గా నా బ్లాగు లో చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటె అది ఏమి నా ప్రయోగమూ కాదు, కొత్త వంట అంత కన్నా కాదు. ఇది చాలా పాత కాలపు వంట. గోదావరి జిల్లాల వారికి ఇది చాలా ప్రత్యేకం కూడా. ఈ పోస్టు వ్రాయటానికి కల ముఖ్య ఉద్దేశము....అమెరికా లో పనసపొట్టు ఎక్కడ, ఎలా దొరుకుతుందో.....దాన్ని ఎలా వండుకోవాలో తెలియ పరచటం ....
Wednesday, February 6, 2013
Friday, September 7, 2012
Beware of these people and Be away to these people
ఎప్పుడూ మంచి వ్యక్తుల గురించే కాకుండా అప్పుడప్పుడూ మన చుట్టూ వుండే యితర వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోకపోతే మనం లోకం పోకడ తెలియక, ఒకవేళ అలాంటి అనుభవం ఏమన్నా వచ్చినప్పుడు ఏమి సమాధానాలు చెప్పాలో తెలియక బాధ పడేకంటే
ముందుగానే prepared గా ఉండమని చెప్పటానికి నా అనుభవం లో జరిగినవి కొన్ని మీ ముందు
ఉంచుదామని నా ప్రయత్నం.
Thursday, July 26, 2012
Thursday, April 26, 2012
క్యాబేజీ పచ్చడి ; దొండకాయ పచ్చడి
ఏ రోటి పచ్చడి గురించి గూగుల్ లో వెతికినా అన్నిటికి దాదాపు రెండే పద్దతులు కొద్దిగా అటు యిటు తేడా తో. ఒకటి....ఏ కూరగాయ అయితే చేద్దాము అనుకుంటున్నామో దాన్ని పచ్చిమిర్చి తో మగ్గపెట్టి, కాస్త చింతపండు, జీలకర్ర, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సి కొట్టి పోపు పెట్టటం. రెండు.... పోపుసామానులు సెనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు ఎండుమిర్చి వేయించి, మగ్గినముక్కలతో మిక్సి కొట్టి కొత్తిమీర వెయ్యటం. ఈ రెండు రకాలు అన్ని కూరలతో చేయటం మాములుగా అందరు చేస్తూనే వుంటారు.
Friday, February 24, 2012
షాట్ గ్లాస్ కలెక్షను
కాదేది కవిత కి అనర్హం అన్నట్లు నా దృష్టిలో కాదేది కలెక్షను కు అనర్దం. మనము ఏది కల్లెక్టు చేస్తే అదే ఒక హాబీ. మొదలు పెట్టేటప్పుడు యిది అని అనుకుని మొదలు పెట్టలేదు కాని అదే ఒక పెద్ద హాబీ అయి కూర్చుంది నాకు. ‘నాకు స్టాంపు కలెక్షను హాబీ, నా దగ్గర వివిధ దేశాల కరెన్సీ బిల్లులు వున్నాయి’ అని జనాలు అనటం మీరు వినే వుంటారు. అది ఒకప్పటి సంగతి. యిప్పటి నా సంగతి చదవండి....
Tuesday, February 14, 2012
చంకి వర్కు చీర
ఆ మధ్య మూడు ఏళ్ళ క్రితం మా స్నేహితురాలితో మంచి రంగు ఉన్నచీర ఒకటి తీసుకోమని చెప్పాను. అలాగే నాకు కుట్లు యిష్టం కాబట్టి, కాడ కుట్టు లేదా గొలుసు కుట్ట్లతో కూడిన ఒక మంచి డిజైన్ ను దానిమీద వేయించమని అడిగాను. తను అలానే గొలుసు కుట్టు, కాడ కుట్ల తో కూడిన పూల కొమ్మల డిజైన్ ను వేయించింది చీర మీద. మొత్తం పదకొండు కొమ్మలు వచ్చాయి చీరమీద. గొలుసుకుట్టు తోనే అందులో చమ్కీలు, రాళ్ళు, పూసలు కుట్టేలాగా వుంది ఆ డిజైన్. రంగు కూడా నాకు లేని రంగు తీసుకుంది. మంచి సంపెంగ పూవు రంగు అది. మా అమ్మా వాళ్ళు అమెరికా వచ్చేటప్పుడు తీసుకుని వచ్చారు. అది చూడగానే నాకు భలే నచ్చేసింది. మా అమ్మాయి, మా ఆయన అప్పుడే ఒక నెల రోజుల కోసం ఇండియా వెళ్ళటం జరిగింది. అదే అదను అనుకుని యిక యుద్ద ప్రాతిపదికన కుట్టటం ప్రారంభించాను. ఎట్టకేలకు ఒక కొమ్మ మాత్రం కుట్టగలిగాను. అంతే వాళ్ళు తిరిగి రావటం, దాన్ని మూల పెట్టటం జరిగిపోయాయి. మరలా మా అమ్మా వాళ్ళు ఒక రెండు ఏళ్ళకి అమెరికా వచ్చారు. యింకా ఆ చీర అలాగే వుండటం చూసి, నాకు చెప్పను కూడా చెప్పకుండా తన suitcase లో పెట్టేసుకుంది మా అమ్మ. నేను ఇండియా వెళ్ళాక అప్పుడు చెప్పింది 'నీకు ఎలాగూ కుట్టటం అవ్వదు అని నేనే తెచ్చేశాను ' అని. ఎవరో ఒకావిడ చేత పన్నెండు వందలకి మొత్తం కుట్టిచ్చేసింది. కుట్టటానికి ఒక్క కొమ్మే కుట్టినా ఎందుకో ఆ చీర మొత్తం నేనే కుట్టిన ఫీలింగ్ నాకు.
Subscribe to:
Posts (Atom)
