Saturday, July 26, 2014

ఇండియా లో ఫేమస్ బిల్డింగ్స్, గుడులు, మసీదులు etc., - కీబోర్డ్ స్కెచెస్

                                                                       INDIA GATE
                            ______________________________________________________

Monday, February 24, 2014

Plastic Canvas Box Pattern


ప్లాస్టిక్ కాన్వాస్ తో వస్తువులు చేయటం గురించి చాలా కాలం నుండే నాకు ఐడియా ఉన్నది కాని ఎప్పుడు ప్రయత్నించే సమయం రాలేదు ఎప్పుడు చేయను లెదు. Cross Stich  తో పువ్వులు అవి కుట్టటమే  కానీ ప్రయత్నం ఎప్పుడు చెయ్యలెదు. అలా Cross Stitch designs ఎన్నో కుట్టి వాటిని ఫ్రేములకి కట్టించటం , గోడకి తగిలించటం, తీయటం అన్ని అయ్యాయి. ఈసారి ఇంటికి ఉపయోగపడేది ఏమయినా చేయాలి అనిపించింది. అలానే త్వరగా కూడా అవ్వాలి అని అనిపించటం తో ఇక ప్లాస్టిక్ కాన్వాస్ ప్రాజెక్ట్స్ అని మన గూగులమ్మ ని అడిగితే చాలానే చెప్పింది. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రాజెక్ట్ చేయటం జరిగినది.
మా అమ్మాయి హస్తం కుడా ఉందండోయ్ ఈ ప్రిపరేషన్లో . అసలు దానికి ఇంట్రెస్ట్ కలిగించే ప్రయత్నం లో నే మొదలు పెట్టటం జరిగింది.  థాంక్స్ to  మై daughter Lasya :)

Saturday, November 30, 2013

American English

మనం రోజు వారి వాడే ఆంగ్ల పదాలే, అమెరికన్లు వేరే విధంగా వాడటం విని, చూసి నేను అమెరికా వచ్చిన కొత్తలో చాలా కొత్తగా అనిపించేది. భలే తమాషా గా అనిపించేది.  ఇంకా కొత్తగా ఎమి ఉంటాయో  అని తెలుసుకోవాలి అనిపించేది.

ఉదాహరణకి మనం 'పెరుగు' ని ఆంగ్లం లో 'curd ' అంటాము. కాని ఇక్కడ వీళ్ళు 'yogurt ' అంటారు. అలాంటివి అనమాట. ఇక్కడే కొంతకాలం ఉండే పాటికి మనకి ఆ పదాలు వాడటం అలవాటు అయిపోయి, అసలు మనం వాడే పదాలే మరచిపోతాము. అలా సరదాగా నాకు గుర్తు ఉన్నవి నా పోస్టులో వ్రాస్తున్నాను.       ఈ బ్లాగ్ చదివిన వారెవరికయినా నేను మిస్ అయినవి చెప్పాలి అనుకుంటే తప్పకుండా కామెంట్స్ లో పోస్టు చెయ్యచ్చు.

  అమెరికన్లు FPS  conversion, మనము MKS conversion వాడటం మూలాన కూడా మనకు కొన్ని తేడాలు కనపడతాయి. ఉదాహరణకి 'ఫలానా డల్లాస్ నుండి అట్లాంటా ఎంత దూరం అండి' అంటే మనమయితే ఇన్ని కిలోమీటర్లు అని చెప్తాము. అదే ఇక్కడ అయితే ఇన్ని miles అని చెప్తారు. అలానే ధ్రవాపదార్దాలను గాలన్ల లోను (మనమయితే లీటర్లలో ) ఇంకా బరువును పౌండ్ లలోను (మనము కిలోగ్రాములలోను ) కొలుస్తాము.
     ఇంక మొదలుపెడదామా ....



Saturday, April 20, 2013

కీ బోర్డ్ కీస్ తో సృజనాత్మకత 2

 
 
కీ బోర్డు కీస్ తో ఈ సారి అచ్చంగా దేవతా మూర్తులను వేయటానికి ప్రయత్నించాను .... చూసి ఎలాగ ఉన్నాయో మీ కామెంట్స్ పోస్టు చేయగలరు

 
 
 
                                                                     లక్ష్మీ దేవి
 


Tuesday, March 5, 2013

అమెరికా లో పనసపొట్టు కూర

 
 
పనస పొట్టు ఆవ పెట్టిన కూర ని నేను ప్రత్యేకం గా నా బ్లాగు లో చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటె అది ఏమి నా ప్రయోగమూ కాదు, కొత్త వంట అంత కన్నా కాదు. ఇది చాలా పాత కాలపు వంట. గోదావరి జిల్లాల వారికి ఇది చాలా ప్రత్యేకం కూడా. పోస్టు వ్రాయటానికి కల ముఖ్య ఉద్దేశము....అమెరికా లో పనసపొట్టు ఎక్కడ, ఎలా దొరుకుతుందో.....దాన్ని ఎలా వండుకోవాలో తెలియ పరచటం ....