Thursday, November 18, 2010

నా గురించి

నా పేరు వందన. నేను చాలా రోజులనుండి నా పేరు మీద ఒక బ్లాగ్ ను మొదలు పెడదామని అనుకున్నాను. యిప్పటికి కుదిరింది. యిప్పుడు యిందులో, నాకు నచ్చినవి , యిష్టం అయినవి , తెలిసినవి రాసి, మీ అందరితో పంచుకోదలచుకున్నాను. నాకు ముక్యం గా వంటలు, ఏదైనా ఆర్ట్స్ కి సంబందించినవి అంటే చాలా యిష్టం. చిన్నప్పుడు వేసవి సెలవల్లో, డ్రెస్ మీద కాని చీర మీద కానీ embroidery designs కుట్టేదాన్ని. అలాగే కొన్ని క్రాస్ స్టిచ్ లు కూడా కుట్టాను. wool తో చిన్న చిన్న పరుసులు, పూసల తో చిన్న బొమ్మలు అలా అనమాట. అలా అని దేనిలోనూ పెద్ద ప్రావిణ్యం లేదు. అంత సమయం కూడా వుండేది కాదులే ఆ చదువుకునే రోజుల్లో. మా పైన floor లో వుండే ఆంటీ కి యివ్వచు ఆ క్రెడిట్ అంతా. ఆవిడా నా taste కు తగ్గట్లు, నాకు నచ్చిన డిజైన్ లు ముందే చూసి పెట్టి ఉంచేవారు. నేను పరిక్షలు అవ్వగానే వాటిని trace పేపర్ తో డిజైన్ లు వేసుకుని కుట్టేదాన్ని. తరవాత పెళ్లి అయ్యి అమెరికా వచ్చిన కొత్త లో 2 , 3 ఏళ్ళు యింట్లోనే వున్నప్పుడు కొన్ని క్రాస్ stitch లు కుట్టాను. దాదాపు ఒక 10 నుండి 12 వరకు చేశాను. యిప్పుడు యిద్దరు పిల్లలు, ఆఫీసు తో అసలు ఆ ఆలోచనలకు కూడా సమయం చాలట్లేదు. ఎప్పుడైనా తీరిక దొరికితే ఇలా బ్లాగ్ లు చూసి ఆనందిస్తూ వుంటా. ఎందుకో నాకు యీ మధ్య ఒక బ్లాగ్ ఓపెన్ చేస్తే ఎలా వుంటుందా అనిపించింది. యింకా నాకు వంటలన్న, ఏదన్నా మంచి సబ్జక్ట్స్ గురించి మాట్లాడటం అన్నా చాల యిష్టం. నా అనుభవాలు, ఇష్టాలు, నా ఆర్ట్ వర్కులు, వంటలతో యీ బ్లాగ్ నడిపిస్తాను. మీ అభిప్రాయాలూ తప్పకుండ మొహమాటం లేకుండా పోస్ట్ చేయండి.

2 comments: