Friday, September 7, 2012

Beware of these people and Be away to these people



 ఎప్పుడూ మంచి వ్యక్తుల గురించే కాకుండా అప్పుడప్పుడూ మన చుట్టూ వుండే యితర వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోకపోతే మనం లోకం పోకడ తెలియక, ఒకవేళ అలాంటి అనుభవం ఏమన్నా వచ్చినప్పుడు ఏమి సమాధానాలు చెప్పాలో తెలియక బాధ పడేకంటే ముందుగానే prepared గా ఉండమని చెప్పటానికి నా అనుభవం లో జరిగినవి కొన్ని మీ ముందు ఉంచుదామని నా ప్రయత్నం.

Thursday, July 26, 2012

Thai Vegetable Basil Fried Rice

Authentic food లో ఇండియన్, mexican తరువాత నేను వేసే ఓటు Thai ఫుడ్ కే. తరువాతే chineese అయినా, అమెరికన్ అయినా లేక ఇటాలియన్ అయినా. Vegetarians కి అక్కడ పెద్ద choice  అంటూ ఏమి వుండదునా మటుకు నాకు ఉన్న ఒకే ఛాయస్.... Thai Vegetable Basil Fried Rice . సాధారణం గా

Thursday, April 26, 2012

క్యాబేజీ పచ్చడి ; దొండకాయ పచ్చడి


రోటి పచ్చడి గురించి గూగుల్ లో వెతికినా అన్నిటికి దాదాపు రెండే పద్దతులు కొద్దిగా అటు యిటు తేడా తో. ఒకటి.... కూరగాయ అయితే చేద్దాము అనుకుంటున్నామో దాన్ని పచ్చిమిర్చి తో మగ్గపెట్టి, కాస్త చింతపండు, జీలకర్ర, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సి కొట్టి పోపు పెట్టటం. రెండు.... పోపుసామానులు సెనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు ఎండుమిర్చి వేయించి, మగ్గినముక్కలతో మిక్సి కొట్టి కొత్తిమీర వెయ్యటం రెండు రకాలు అన్ని కూరలతో చేయటం మాములుగా అందరు చేస్తూనే వుంటారు.
 

Friday, February 24, 2012

షాట్ గ్లాస్ కలెక్షను


కాదేది కవిత కి అనర్హం అన్నట్లు నా దృష్టిలో కాదేది కలెక్షను కు అనర్దం. మనము ఏది కల్లెక్టు చేస్తే అదే ఒక హాబీ. మొదలు పెట్టేటప్పుడు యిది అని అనుకుని మొదలు పెట్టలేదు కాని అదే ఒక పెద్ద హాబీ అయి కూర్చుంది నాకు. నాకు స్టాంపు కలెక్షను హాబీ, నా దగ్గర వివిధ దేశాల కరెన్సీ బిల్లులు వున్నాయి అని జనాలు అనటం మీరు వినే వుంటారు.  అది ఒకప్పటి సంగతి. యిప్పటి నా సంగతి చదవండి....
 

Tuesday, February 14, 2012

చంకి వర్కు చీర

 
 
 మధ్య మూడు ఏళ్ళ క్రితం మా స్నేహితురాలితో మంచి రంగు ఉన్నచీర ఒకటి తీసుకోమని చెప్పానుఅలాగే నాకు కుట్లు యిష్టం కాబట్టికాడ కుట్టు లేదా గొలుసు కుట్ట్లతో కూడిన ఒక మంచి డిజైన్ ను దానిమీద వేయించమని అడిగానుతను అలానే గొలుసు కుట్టు, కాడ కుట్ల తో కూడిన పూల కొమ్మల డిజైన్ ను వేయించింది చీర మీదమొత్తం పదకొండు కొమ్మలు వచ్చాయి చీరమీదగొలుసుకుట్టు తోనే అందులో చమ్కీలురాళ్ళుపూసలు కుట్టేలాగా వుంది  డిజైన్రంగు కూడా నాకు లేని రంగు తీసుకుంది. మంచి సంపెంగ పూవు రంగు అది. మా అమ్మా వాళ్ళు అమెరికా వచ్చేటప్పుడు తీసుకుని వచ్చారు. అది చూడగానే నాకు భలే నచ్చేసింది. మా అమ్మాయి, మా ఆయన అప్పుడే ఒక నెల రోజుల కోసం ఇండియా వెళ్ళటం జరిగింది. అదే అదను అనుకుని యిక యుద్ద ప్రాతిపదికన కుట్టటం ప్రారంభించానుఎట్టకేలకు ఒక కొమ్మ మాత్రం కుట్టగలిగాను. అంతే వాళ్ళు తిరిగి రావటం, దాన్ని మూల పెట్టటం జరిగిపోయాయి. మరలా మా అమ్మా వాళ్ళు ఒక రెండు ఏళ్ళకి అమెరికా వచ్చారు. యింకా చీర అలాగే వుండటం చూసి, నాకు చెప్పను కూడా చెప్పకుండా తన suitcase లో పెట్టేసుకుంది మా అమ్మ. నేను ఇండియా వెళ్ళాక అప్పుడు చెప్పింది 'నీకు ఎలాగూ కుట్టటం అవ్వదు అని నేనే తెచ్చేశాను ' అని. ఎవరో ఒకావిడ చేత పన్నెండు వందలకి మొత్తం కుట్టిచ్చేసింది. కుట్టటానికి ఒక్క కొమ్మే కుట్టినా ఎందుకో చీర మొత్తం నేనే కుట్టిన ఫీలింగ్  నాకు.