Friday, December 10, 2010

పసి పిల్లలతో ఇండియా ప్రయాణం అయ్యేప్పుడు చూసుకోవాల్సిన చెక్కు లిస్టు

యీ బ్లాగ్ పసి పిల్లలతో ఇండియా వెళ్ళేవాళ్ళ కోసం రాసాను. ఒక 5 ఏళ్ళ క్రితం మా అమ్మాయి మొదటి ఏడాది పుట్టిన రోజు సందర్బముగా ఇండియా వెళ్ళాము. అప్పుడు నేను ఏమి తీసుకుని వెళ్లి నానో, వాటికి సంబందించిన లిస్టు రాయబోతున్నాను. యీ బ్లాగ్ చూసిన వాళ్ళకి యిది తప్పకుండా ఉపయోగపడుతుందని నా నమ్మకం. యివి కాక మీకు యింకా ఏమైనా తట్టినా, తప్పకుండా మీ కామెంటులు పోస్టు చేయవచ్చు. మేము ఒక 3 నెలల కు వెళ్ళాము. ఆ ప్రకారం రాసాను. యింకా మీరు, మీ వాడకాన్ని బట్టి మీరు అంచనా వేసుకుని తీసుకుని వెళ్ళండి.


1. Enfamil (మీరు వాడే బ్రాండు ఏదైతే అది) బేబీ ఫార్ముల
2. Diapers ఒక 5 పెద్ద బాక్సులు (మీ అవసరాన్ని బట్టి). ఇండియా వెళ్ళాక చాలా మంది వీటిని పెద్దగా వాడరు
3. బేబీ పాల బాటిల్స్, పాల పీకలు వాటికీ సంబందించినవి
4. బాటిల్ cleaning brush (యిది diaper బాగు లో పెట్టుకోండి. Frankfurt (మీ ట్రాన్సిట్ ఎక్కడ అయితే అక్కడ) airport లో రెస్టు రూములో కి వెళ్లి గబా గబా మీతో తెచ్చుకున్న cleaning liquid తో యీ brush వేసి 4 బాటిల్స్ కడిగి పెట్టుకున్నారంటే బాగుంటుంది. (విమానం లో అయినా కడుక్కోవచ్చు.)
5. ఒక చిన్న సీసా లాంటి దానిలో క్లీన్ చేసే సోపు పోసుకోండి (యిది జర్నీ లో, ట్రాన్సిట్ లో బాటిల్స్ కడుక్కోటానికి ఉపయోగపడుతుంది).
6. Nursery వాటర్ ( యిది ప్రయాణానికి మాత్రామే సరిపోయేటంత). ఇండియా వెళ్ళాక bislery వాటర్ వాడాను. యిది పాల పౌడర్ కలపటానికి
7. మీ బేబీ తినే వివిధ రకాల cereals (రైస్, wheat , బార్లీ , మిక్స్డ్ గ్రైన్ ). ఏడాది పిల్లలయితే మిక్స్డ్ గ్రైన్ ఎక్కువ తింటారు. (యిదీ మీ మీ వాడకాలని బట్టి)
8. Gerber foods వాళ్ళు తినేవి.
9. diaper బాగు
10. బేబీ wipes
11. బేబీ blankets
12. Pacifier వాడితే అది. (మేము అయితే మా యిద్దరి పిల్లలకీ వాడలేదు. కాని takeoff టైముకి వుంటే మంచిది అంటారు. పెట్టుకుంటే మంచిదే.)
13. Mosquito Repellent (మేము ఇండియా వెళ్ళినప్పుడు చికెన్ గినియా వుంది. అందుకు యిది తీసుకు వెళ్ళాం. వెళ్లేముందు డాక్టర్ ని సంప్రదించి మలేరియా vaccines అది తీసుకోవచ్చు). ఇండియా వెళ్ళాక దోమ తెరలు అవి వాడితే మంచిది.
14. Baby Tylenol (Fever Cold , cough ) (యిప్పుడు tylenol recall అయింది కాబట్టి, దానికి substitute ఏది అయినా.... ), Mylocon, Ocean Drops. యింకా మీ పిల్లల మందులు ఏమన్నా వుంటే అవి
15. Sweaters, సాక్సులు, Gloves (విమానం లో చల్లగా వుంటుంది. మేము ఇండియా వెళ్ళే టైము కి యిక్కడ ఎండలు. పెద్దగా వీటి గురించి ఆలోచించలా. ఏదయినా అనుభవంతో తెలుస్తుంది.) యింక blankets వాడాము.
16. షూస్
17. బిబ్ క్లాతులు
18. బేబీ టూత్ పేస్టూ, brush. (యిది పెద్దగా అవసరం కాకపోవచ్చు. ఎందుకు అంటే మేము ఇండియా వెళ్ళే టైము కి మా అమ్మాయికి పళ్ళు పెద్దగా రాలేదు)
19. Ghonsons Head To Toe (బాడీ వాషు, షాంపూ ). యివి అయితే పెద్ద బాటిల్ తో సహా samples చిన్నవి కూడా తీసుకుని వెళ్తే మంచిది. ఇండియా లో ప్రయాణాలలో పనికి వస్తాయి. రీఫిల్ చేసుకోవచ్చు కావాలంటే.
20. Johnsons Moisturizer (మీకు నచ్చిన బ్రాండు)
21. తల్లి పాలు యిస్తున్నట్లయితే పంపు, దానికి సంబందించినవి (పంపు వుపయోగించేవాళ్ళకి మాత్రమే)
22. Finger Foods ( యిది మీ లగేజి బరువు ని బట్టి. ఇండియా లో చిరు తిళ్ళు చాలానే వుంటాయి).
23. బేబీ స్పూనులు, కప్పులు (యిది అంత అవసరం కాదు. అక్కడ దొరుకుతాయి కదా....)
24. Sipper బాటిల్స్ ( ఏడాది నిండినాక యిది కావాలి)
25. పిల్లలకి యిష్టం అయిన బొమ్మలు అలాంటివి. మా అమ్మాయి అయితే దాని దుప్పటి మాత్రం దానితోనే వుండాలి అనేది. అది ఉంటేనే పడుకునేది. అలాంటివి ఏమన్నా వుంటే పెట్టుకోండి.
26 . బేబీ డ్రెస్సులు (యివి అయితే ఒక 5, 6 జతలన్నా పెట్టుకోవాలి. కొన్ని కారియానులో, కొన్ని diaper బాగు లో. నైట్ suites కూడా పెట్టుకుంటే మంచిది. అందరు పడుకున్నాక చక్కగా యిది వేస్తే వెచ్చగా పడుకుంటారు.
27. బేబీ stroller (యిది జర్నీ లో చాలా ఉపయోగపడుతుంది.) చిన్న stroller అయితే సుఖం. బరువు వుండదు, దాన్ని మూసి తెరవటమూ తేలిక. (నేనైతే యిది తీసుకు వెళ్ళలేదు.). యీసారి తప్పకుండా గుర్తు పెట్టుకుని మరీ తీసుకుని వెళ్ళాల్సిన వస్తువు యిది.
28. బాటిల్ sanitizer ( ఇండియా లో మీ యింట్లో మైక్రో వేవు వోవేను వుంటే యిది ఉపయోగం. లేదా లగేజి ఎక్కువ అనుకుంటే యిది తీసి వేయ వచ్చు.)

2 comments:

  1. but almost ippudu india lo dorukuthunnayi. if at all you forget some thing that is fine.

    ReplyDelete
  2. I know.... kani akkada brands avi veruga vuntayi and also yekkada dorukuthayo research cheyyali. so intial ga konni thisuku velthe tharuvatha akkada konacchu. Memu Lasya tho first time vellinappudu I think India lo anni dorikevi kavemo.

    ReplyDelete