Wednesday, February 23, 2011

అపార్టుమెంటులో ఆకు కూరల తోట

నాకు గార్డెనింగ్ అంటే ప్రాణం అని చెప్పను కాని, కాస్తోకూస్తో యిష్టం వుంది అని మాత్రం చెప్పగలను. అమెరికా లో ఇల్లు ఉన్నవాళ్ళకి దాదాపు ప్రతి ఏడాది వేసవి కాలం లో యిది ఒక వ్యాపకం. అలా స్నేహితుల యిళ్ళకు కాలక్షేపానికి వెళ్ళినప్పుడల్లా అనుకుంటూ వుండేదాన్ని'మనము మొదలు పెట్టవచ్చు కదా!' అని. కాని మాది అపార్టుమెంటు అవటం మూలాన దాని మీద నా ద్రుష్టి ని అంతలా పెట్టలేదు. కాని రెండేళ్ళ క్రితం 'యిలా కాదు,

ఏమి మనము patio లో పెట్టి ప్రయత్నించ వచ్చు కదా' అని అనిపించటం ఆలస్యం సమ్మరు రాగానే వాటికి సంబందించిన షాపింగ్ లో భాగం గా ఒక రెండు బస్తాల మట్టి, కుండీలు కొన్నాను. ఒక 5 ,6 గంటలు పట్టింది మొత్తం మట్టిని కుండీలలో నింపటానికి. ( ఒక్క సారి తో అయ్యే పని కాదండి యిది, మొత్తం సీజను అంత మట్టి కొనటం, దానికి కావలసిన మందులు కొట్టటం etc అలా నడుస్తూనే వుంది) యింక తరవాత విత్తనాలు, మొక్కలు నాటుట. మాది అపార్టుమెంటు కావటం మూలాన నేను ఆకు కూరలే ఎక్కువ ఎంచుకున్నాను. యింకా టొమాటో, మిర్చి కూడా పెట్టాను అనుకోండి.
ఆకు కూరలలో మొత్తం దాదాపు మనకు ఎన్ని వున్నాయో అన్ని పెట్టాను. గోంగూర, తోటకూర, మెంతి కూర, చుక్క కూర, బచ్చలి కూర, తీగ బచ్చలి, పాల కూర, పుదినా. ముందు విడిగా విత్తనాలు నాటి, మొలకలు వచ్చాక వాటిని కుండీలలో నాటాను. పొడవాటి కుండీలు అయితే ఒక ఆరు మొక్కలు వరకు నాట వచ్చు. (ఫోటో లో కుండీ పొడవు చూడచ్చు)


మెంతి కూరకి ఒక గుప్పెడు మెంతులు నా పోపు డబ్బాలోనుండి తీసుకుని అలా కుండీ లో చల్లాను ఒక రెండు రోజుల్లో మొలకలు వచ్చాయి. నాకు గుర్తు వుండి బచ్చలి మాత్రం ఒక పది రోజులు తీసుకుంది మొక్క రావటానికి. ఆకు కూరలలో ఒకటి అని చెప్పను కాని నాకు గోంగూర, చుక్క కూర, బచ్చలి అంటే తెగ యిష్టము. బచ్చలి విత్తనం నాకు దొరకలేదు, మా స్నేహితులు ఒకళ్ళు వున్నారు వాళ్ళు నా ఉత్సాహం చూసి 2,3 మొక్కలు యిచ్చారు. దానినే జాగ్రత్తగా కాపాడి పెంచాను. ఒక మూడు, నాలుగు సార్లు పులుసు కి వచ్చింది. తీగ బచ్చలి ని పెంచితే సీతా కాలం లో యింట్లోనే పెట్టుకోవచ్చు అని ఎవరో చెప్పగా విని దాని గురించి దాదాపు రీసర్చి చేసాను అని చెప్పవచ్చు. ముందు గూగుల్ లో దాని ఆంగ్ల పదం వెతకటానికే నాకు చాలా సమయం పట్టింది. మొత్తానికి దాని పేరు పట్టాను 'Climbing Spinach or Malbar Spinach'. సరే యిప్పుడు దానిని ఎక్కడ వెతకాలి అనే ప్రశ్నకు సమాధానం ‘Siebenthaler’ అనే స్టోరు. ( See this http://www.siebenthaler.com/) యింక మా ఆయన్ని విసిగించి మరి ఆ విత్తనం కొన్నాను. (విసిగించి అని ఎందుకు అన్నాను అంటే అదేంటో రెండు సార్లు వెళ్ళాము, ఆ స్టోరు మూసేశారు, పైగా అది మా యింటికి చాలా దూరం కూడా). కాని నా శ్రమ మాత్రం ఫలించింది. యింట్లో పెట్టి నా కూడా బాగా బతికింది



యిక పోతే చుక్కకూర.... చుక్క కూర అసలు అమెరికా లో నేను చూడలేదు. అసలు దొరకదు అనే నా ధ్యాస. కాని ఒక స్నేహితురాలు వాళ్ళ అమ్మగారు ఇండియా నుండి వస్తు వుండటం తో నా కోసం ఆ విత్తనం తెప్పించి పెట్టింది. పాలకూర నాటాను కాని, చోటు చాలక తీసేసాను(మనకు బయట బాగానే దొరుకుతుందిగా మార్కెట్టు లో).
యిక టమేటా విషయానికి వస్తే రెండు మొక్కలు నాటాను. దీనికి పెద్ద కుండి కావాలి. పరవాలేదు సీజను కి ఒక పదిహేను నుండి ఇరవయి కాయలు కాసాయి అని చెప్పవచ్చు రెండు మొక్కలు కలిపి( కుండీ మంచి చోటు కాదు టొమాటో కి). మిర్చి గురించి ముందు తెలియక యింట్లో పోపు డబ్బాలో మిర్చి గింజలు కొన్ని కుండీలో వేసా. యిక దాని సంగతే మర్చి పోయా. ఎప్పుడో వచ్చాయి మొలకలు. అవి అంత సమయం తిసుకుంటాయని తెలియక మొక్కలు కొని నాటాను. తరువాత అవి యివి కలిపి బాగానే వచ్చాయి. మొత్తానికి నేను తెలుసుకున్నది ఏమిటి అంటే టొమాటో, మిర్చి మొక్కలు కొని నాటితేనే బెటరు అని.


నా యీ వ్యాపకం మొదట సరదాకే సాగినా, తరువాత ఒక నెలకే నాకు, మా వారికి, యింకా చుట్టు పక్కన వాళ్ళకి కూడా బాగా ఉత్సాహం రేపింది. ఎప్పుడు అయిన నేను నీరు పోయటానికి బద్దకిచ్చినప్పుడు మా ఆయన తనంతట తనే పోయటం చూసి తెలిసింది. యింక పక్కన విసిటింగ్ కోసం వచ్చిన ఆంటిలు నన్ను తెగ మెచ్చుకునేవాళ్ళు. ‘యివాళ ఏమి వండావు’ అని అందరు అడుగుతూ వుంటే 'మా తోటలో పండించిన ఆకు కూర పప్పు ఆంటీ' అని చెప్పి చాలా ఆనందపడేదాన్ని. మా చెల్లెలు వాళ్ళు డల్లాస్ లో ఏడాది క్రితం ఇల్లు కొన్నారు. పోయిన ఏడాది సమ్మరు లో ఆకు కూరలే కాదు కాయగూరలు కూడా పండించారు కాకర, సొర, బీర, చిక్కుళ్ళు, దోస, బెండ, ఆకు కూరలు, పూల మొక్కలు యిలా అనమాట. ఏది అయిన గార్డెనింగ్ అనేది ఒక ఆరోగ్య కరమయిన వ్యాపకం అని చెప్తాను. మన తోట లో పండించే కూరల వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి టైం పాస్, మనసుకి ఆహ్లాదం. సాయంత్రం ఆఫీసుల నుండి యింటికి రాగానే టీ పెట్టుకుని, చక్కగా తోటలో కూర్చుని మన మొక్కలను చూసుకుంటూ 'ఏవండి చూడండి మన బెండమొక్క కి పూత పూసింది, టొమాటో ఎంత పెద్దది అయిందో, యివాళ వంట మన తోట లోని చుక్కకూర పులుసు' అని అనటం లో ని ఆనందం ఎంతటిదో ఊహించండి!


మన ప్రాంతానికి సంబందించిన విత్తనాలు (ఇండియా నుండి తీసుకు రావడం కుదరదు కాబట్టి) మనం యిక్కడే కొనచ్చు. దానికి సంబందించిన సైటు (http://www.seedsofindia.com/shop/sitemap/) దీనిలో ఒక్కో కూరగాయ లో ఎన్ని రకాలు వున్నాయో అన్ని రకాల విత్తనాలు ఫోటోల తో సహా వున్నాయి. వాటి పేర్లు మాత్రం భలేగా వున్నాయి. పొట్లకాయ, మిరపకాయ పేర్లు మాత్రం భలే గా పెట్టారు తప్పకుండ మీకు యీ సైటు వుపయోగాపడుతుంది అనుకుంటున్నాను. యిది Home Page (http://www.seedsofindia.com/)

6 comments:

  1. మీ గార్డెనింగ్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది

    ReplyDelete
  2. చాలా మంచి హాబీ, వీలైనంత స్ప్రెడ్‌ చేయండి...

    ReplyDelete
  3. థాంక్స్ లత గారు, శ్రీనివాస్ గారు.

    ReplyDelete
  4. మీ గార్డెనింగ్ చాలా బాగుంది.. మీరు గార్డెనింగ్ మీద ఇంతగా శ్రద్ధ చూపుతున్నందులకు మీకు అభినందనలు.

    ReplyDelete
  5. chala baga chepparu. naku kuda gardening ante chala ishtam kakapothe opika konchem takkuve. kastapadi ma ayanni bathimaali oka chinna 3 plants techukunna :)

    nenu kuda anni kundillone naatlai mari :(

    gongura mokka ela vesaru?
    menthi, mirchi miru cheppinatte try chesta ika :)
    mundu matti, kundilu techukodaniki try cheyali.

    Thanks for sharing.

    ReplyDelete
  6. chala thanks Raj garu.
    swapnagaaru....miku kuda chala thanks. gongura vithanam maa thelisina vaallu yicharu naku. miku kavali ante seedsofindia ani oka site cheppanu kada, danilo try cheyachu. india nundi kooda thepinchukovachu, adi yeppudu riske avuthundi. chusukondi. Intial struggle thappakunda vuntundi. kundilu konatam, matti poyatam, vithanam naatatam kaani modalu pettaka opika,aa oopu ade vasthundi. start cheyandi. yippatiki late miru munde start chesi vundalsindi. Happy Gardening

    ReplyDelete