Saturday, April 30, 2011

స్పెల్లింగు గారడీ

అదేదో సినిమాలో నటుడు నరేష్ ఒక ఇంటర్వ్యూ కి వెళతాడు. ఇంటర్వ్యూ చేసే అతను 'coffee ' స్పెల్లింగు చెప్పు నాయనా ' అంటాడు. వీడికి వుద్యోగం చేయటం అస్సలు యిష్టం వుండదు. ఎలాగోలా తప్పు చెప్పి వుద్యోగం రాకుండా ఉండేటట్లు చేసుకోవాలని వీడి తాపత్రయం. అలా ఆలోచించి కాఫీ స్పెల్లిన్గును 'kauphy ' అని చెప్తాడు. ఆ సన్నివేసం గుర్తుకు వచ్చినప్పుడల్లా నవ్వుకునేవాళ్ళం. 
అసలు ఒక్క అక్షరం కూడా కలవకుండా భలేగా చెప్పాడు అని. యింతకి ఉపోద్గాతం ఎందుకు చెప్తున్నాను అంటే మా అమ్మాయి కూడా ప్రస్తుతం అదే చేస్తోంది కాబట్టి. అది ప్రస్తుతం kindergarten లో వుంది. వాళ్ళ టీచర్ pronounciation ఎలా వుంటే అలా స్పెల్ చేయాలి అని చెప్పిందిట. తప్పు అయినా ' no need to worry 
 

Tuesday, April 19, 2011

స్నేహం - సహాయం

చిన్నప్పటి స్నేహాలు వేరు. పెరిగి పెద్దయ్యాక ఏర్పడే స్నేహాలు వేరుచిన్నప్పటి స్నేహాలలో చనువు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కొట్టుకున్నా మళ్ళా కలవటానికి  మొహమాటం అడ్డురాదు, ego లు అడ్డురావుపెద్ద అయ్యాక ఏర్పడే స్నేహాలలో artificiality ఎక్కువ. యిది నా అనుభవం. అందరి అనుభవాలు నాలాగే ఉంటాయని నేను చెప్పలేను. ఎవరి అనుభవం వారిదినా మటుకు నేను తప్పకుండా అందరితో మనస్పూర్తిగా స్నేహం గానే వుంటానుకాని అవతలి వాళ్ళు అలాగే వుంటారు అని  మనం ఎలా చెప్పగలం. కొద్ది రోజులు స్నేహం చేస్తేనే కదా  లోతు తెలిసేది