చిన్నప్పటి స్నేహాలు వేరు. పెరిగి పెద్దయ్యాక ఏర్పడే స్నేహాలు వేరు. చిన్నప్పటి స్నేహాలలో చనువు ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కొట్టుకున్నా మళ్ళా కలవటానికి మొహమాటం అడ్డురాదు, ego లు అడ్డురావు. పెద్ద అయ్యాక ఏర్పడే స్నేహాలలో artificiality ఎక్కువ. యిది నా అనుభవం. అందరి అనుభవాలు నాలాగే ఉంటాయని నేను చెప్పలేను. ఎవరి అనుభవం వారిది. నా మటుకు నేను తప్పకుండా అందరితో మనస్పూర్తిగా స్నేహం గానే వుంటాను. కాని అవతలి వాళ్ళు అలాగే వుంటారు అని మనం ఎలా చెప్పగలం. కొద్ది రోజులు స్నేహం చేస్తేనే కదా ఆ లోతు తెలిసేది.
స్నేహాలు, సహాయాలు అందరికి అవసరం. 'మాకు ఎవరి సహాయము అవసరం లేదు' అంటే మాత్రం వాళ్ళు తప్పకుండా అబద్దం చెప్తున్నట్టే. ఎంతటి వారికయినా, ముఖ్యం గా యిలా అమెరికా లాంటి దూరప్రదేశాలకు వచ్చినప్పుడు మన వాళ్ళ అవసరాలు, తోడు ఎంతయినా అవసరం వుంటుంది. ఏదో కాలక్షేపానికి వీకెండ్స్ లో కలవటం, పార్టీలు చేసుకోవటం, కిట్టి పార్టీలు చేసుకోటం, గేములు ఆడటం తప్ప ఎంత మంది మనస్పూర్తిగా స్నేహం గా వున్నారో చెప్పండి. అసలు నిజమయిన అవసరం వచ్చినప్పుడు 'అమ్మో వాళ్ళు ఏమి అనుకుంటారో, అడగచ్చో అడగకూడదో' అని మనలను మనం ప్రశ్నించుకునే స్నేహం మాత్రం నాకు వద్దు. ఏ నిమిషము అయినా, ఎంత రాత్రి అయిన వాళ్ళ తలుపు తట్టే లాంటి మనుషులు కావాలి. అలా అని వాళ్ళ privacy లో కి మనము వెళ్ళాము అని అనుకుంటే ఎలా? ఏ అర్ధరాత్రో అవసరం అయింది, ఏమి చేస్తామండి? 'అమ్మో వాళ్ళకు చేస్తే తిట్టుకుంటారు ఏమో, పోనీ వీళ్ళకు చేద్దామా' అని అనుకున్నాము అంటే అది నిజమయిన స్నేహం ఎలా అవుతుంది? తప్పకుండా పక్క వాళ్ళ privacy ని గౌరవించాలి. కాని అవసరం అయినప్పుడు ఆ అడిగే చనువు నీకు వుండాలి , నీ స్నేహితులూ యివ్వాలి అదే నిజమయిన స్నేహం అంటాను.
తప్పకుండా ఒకటి మాత్రం చెప్పగలను. నేను అమెరికా వచ్చిన కొత్తలో లాగా యిప్పుడు లేను. మునుపు అందరిని నా వాళ్ళు అనుకునేదాన్ని. వాళ్ళు నా యింటికి ఎప్పుడు వచ్చినా 'ఎనీ టైం యు ఆర్ వెల్కం ' అనేటట్లు వుండేదాన్ని. అందరూ అలా వుండరు. యిప్పుడు నేను మారాను. నా పరిదిని నేను గీసుకున్నాను. నా లిమిట్స్ తెలుసుకున్నాను. కాని మనసులో ఏదో బాధ. ‘ఏంటి నేను కూడా ఇలాగా?’ అని.
'అందరూ' అనే పదం వాడేటప్పుడు చాలా కచ్చితం గా వుండాలి. 'చాలా మటుకు అందరు' అని వాడితే అది బాగుంటుంది. చాలా మటుకు అన్ని ఇలాంటి స్నేహాలే ఎదురు అయ్యాయి నాకు. కాని దానికి భిన్నం గా యిద్దరి స్నేహం లభించింది. తప్పకుండా అది మీ అందరితో పంచుకోవటం కోసం, వాళ్ళ మీద నాకు వున్న స్నేహాన్ని తెలియపరచటం కోసం యీ వ్యాసాన్ని మొదలెట్టాను.
మేము dayton లో వున్నప్పుడు ఒకావిడ పరిచయం అయింది. తనకి, నాకు స్నేహం ఒక ఏడాది అని చెప్పవచ్చు. యీ ఏడాదిలో తను, నేను ఎంత దగ్గర అయ్యాము అంటే, ప్రతిది నేను మనసు విప్పి తనతో చెప్పుకోగలిగేదాన్ని, నాకు ఏదైనా అవసరమై సాయం కోరాల్సి వచ్చినప్పుడు నేను అడగక ముందే తనే చేసేది (ఏమి ఆశించకుండా. యిది తప్పకుండ చెప్పవలసినది). ఒక్కోసారి పిల్లలని అన్ని చోట్లకి తీసుకు వెళ్ళటం కుదరదు. ఇండియా లో అయితే మన పక్క యింటి వాళ్లనో లేక కింద యింటి వాళ్లనో 'కాస్త మా పిల్లలని ఒక గంట సేపు చూస్తారా?' అని అడిగే చనువు వుంటుంది. కాని యిక్కడ యీ అమెరికా మహా దేశము లో ముందు అసలు మనం అడగటానికి కూడా చాన్సు యివ్వరు.( అందరిని అనటం తప్పు లెండి, చాలా మటుకు అని నా ఉద్దేశం). అలాంటిది తను ముందే చెప్పేది 'మీరు బైటకి వెళ్తూ వుంటే చెప్పండి, మీ అమ్మాయి మా యింట్లో వుంటుంది' అనేది. ఎపుడు అయిన వాళ్ళ యింటికి వెళ్తే భోజనాల వేళకి వాళ్ళ పిల్లలకి అన్నం కలుపుతూ మా అమ్మాయికి కూడా కలిపి పెట్టేసేది (అప్పుడు నేను కడుపుతో వున్నాను, అందుకు తను నాకు శ్రమ తగ్గించే ఉద్దేశం తో అలా చేసేది.) తను నాకేదో చేసింది అని కాదు, కాని అసలు అలా ఎంతమందిని చూస్తున్నాము యివాళ?
యింక మా బాబు పుట్టినప్పుడు, మా ఆయనతో సహా మా అత్తగారు, మా అమ్మాయి 'నయాగర ఫాల్స్' కి వెళ్ళటం జరిగింది. అప్పుడు వాడు నెల గుడ్డు. నేను ఒక్కత్తినే వాడితో. కింద పెడితే ఎడిచేవాడు. నాకు ఒక్క నిమిషం వాడిని వదిలి ఉండటానికి అవ్వలేదు. అన్నం వండటం మాట దేవుడు ఎరుగు, అసలు కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా చాలా కష్టం అయిపోయింది. అప్పుడు తనే వంటలు చేసి తెచ్చి, నేను తినే దాక వాడిని పట్టుకుని, నా స్నానం అది అయ్యాక వెళ్ళేది. ‘ఆ యిలా ఎంత మంది చేయరు ఏంటి’ అని మీరు అనుకోవచ్చు నిజమే చేస్తారు కాని నీ గురించి ఆలోచించి 'చేయనా? ఏదయినా కావాల్సి వస్తే అడుగు?' అని అడగకుండా, తనంతట తను బాధ్యతా గా చేయటము అనేది తప్పకుండా గొప్ప లక్షణం. మేము తరువాత వూరు మారాము. మామూలుగా ఊళ్ళు మారాక ఒకటి రెండు సార్లు ఫోనులు అవి చేసుకుంటాము, తరువాత కొంత తగ్గుతుంది. లేదా మనం చేస్తే కాలు రిటర్న్ చేయటమో చేస్తారు. అలా కాకుండా అసలు రిటర్న్ ఆశించకుండా అడపా దడపా తనే చేసేది. మాములుగా ఎవరన్నా మనకు ఫోను చేసారు అనుకోండి, మనం యింటిలో లేకపోతే ఆ కాలు మిస్ అవుతాము కదా! అప్పుడు నేను అయితే తప్పకుండ కాల్ రిటర్న్ చేసి 'వాయిస్ మెయిల్' పెడతాను. తరువాత వాళ్ళు మళ్ళా ఎప్పుడన్నా చేస్తే సరి, లేదా యింక నేను దానిని అంత పట్టించుకోను 'చేసాము కదా' అన్న ఉద్దేశం లోనే వుంటాను. కాని తను అలా కాదు ఎన్ని సార్లు అయిన చేస్తుంది. యివి అన్ని చాలా చిన్నవిగానే కనిపిస్తాయి, కాని వీటిలో చాలా అర్ధం వుంది. Friendship కి బాగా విలువ యిచ్చే మనిషి. అలాంటి వాళ్ళు నిజం గా యిప్పుడు దొరకటం చాలా కష్టం. నాకు తన స్నేహం దొరికినందుకు చాలా ఆనందపడుతూనే, యింత త్వరగా దూరం అయినందుకు (మేము వూరు మారాము అని చెప్పను కదా!) బాధ పడుతున్నా . అయిన తనలాంటి వాళ్ళకి స్నేహం దూరాలతో పని లేదు లెండి.
మంచి స్నేహితులు తప్పకుండా దొరుకుతారు అని మళ్ళా రుజువు అయ్యింది మేము అట్లాంటా వచ్చాక. మా ఎదురి యింట్లో ఒక తమిళ ఆవిడ పరిచయం అయింది. వాళ్ళ అబ్బాయి, మా అమ్మాయి (వాడు ఒక రెండు ఏళ్ళు పెద్దవాడు అయినా) మంచి స్నేహితులు. బాగా ఆడుకుంటారు. ఆవిడకి మా అమ్మాయి అంటే చాలా యిష్టం. ఆ మధ్య ఎప్పుడో మా అమ్మాయి స్కూల్ కి బ్రేక్ వస్తే దాన్ని ఎక్కడ పెట్టాలో అర్ధం కాలేదు (వారం రోజులకి డే కేర్ లో పెట్టలేము కదా), నేను అడగకుండానే మాతోపాటే మీ అమ్మాయి, అనుకుంటూ తను వర్క్ ఫ్రం హోం చేసుకుంటూనే (వాళ్ళ అమ్మగారు వున్నారు అనుకోండి) మా అమ్మాయిని చూసింది. నా పిల్లలని చూసారు అని చెప్పటం కాదు, అసలు ఆ చనువు, అది కలిసిపోవటం, సహాయానికి ముందుకి రావటం అది నేను చెప్పటం. తనకి నాకు పరిచయం ఒక ఆరు నెలలు అని చెప్పచ్చు. నాకు ఏదయినా అవసరం అయితే 'సుధా వుంది కదండీ' అని నేను ధేర్యం గా చెప్పగలను మా ఆయనతో. బాధాకరం ఏమిటి అంటే తను కూడా త్వరలో డిట్రాయిట్ వెళ్ళిపోతోంది.
వీళ్ళ యిద్దరి, యింకా కొంతమంది స్నేహాల వాళ్ళ నేను మళ్ళా పాత వందనను అయ్యాను. తప్పకుండా నేను నేను గా ఉండటానికి ప్రయత్నిస్తాను. Atleast నాతో అలాగా ఉన్నవాళ్ళ తో అయినా వుంటాను.
అయితే స్నేహం సహాయానికేనా? అంటే మాత్రం అది తప్పు. కాని స్నేహం సహాయానికి కూడా అనేది కర్రెక్టు అని నా అభిప్రాయం. తప్పకుండా మంచి స్నేహితులు దొరుకుతారు, వుంటారు అని నమ్మకం కుదిరింది నాకు యిప్పుడు. వీళ్ళలాంటి స్నేహితులు యింకా ఎంత మందో దొరకాలని, అలాగే నేను కొంతమంది కి అయినా మంచి స్నేహాన్ని పంచాలని, అవసరాలకు సహాయపడాలని ఆసిస్తూ....
మీకు ఇలాగే మంచి స్నేహితులు దొరకాలని మా ఆకాంక్ష. ఈ లోకంలో స్నేహం విలువలు పెంచే స్నేహితులు తక్కువ అయినా ఇంకా ఉన్నారు అని మీ అనుభవంతో తెలియజెప్పారు.
ReplyDeleteu are soooo lucky
ReplyDeleteమీకు మంచి స్నేహితులు దొరికినందులకు మీరు నిజముగా అదృష్టవంతులండీ! ఈరోజుల్లో ఇలాంటివారు దొరకడం చాలా తక్కువే! "అవసరార్థ స్నేహాలు" కాకుండా నిజమైన స్నేహాలు మీకు ఎల్లప్పుడూ ఇలాగే దొరకాలని కోరుకుంటున్నాను..
ReplyDeleteఅలాగే చిన్ని సూచన - వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి.
చాలా థాంక్స్ అండి. స్నేహితుల వల్ల బాధ పడకపోయినా సంతోషించిన క్షణాలు చాలా తక్కువే నాకు. మనసువిప్పి మాట్లాడుకునేవాళ్ళు, నా వాళ్ళు అనుకునేవాళ్లు. నాకు చనువు యిచ్చే వాళ్ళు చాలా తక్కువ. చాలా జాగ్రతగా అలోచించి మాట్లాడటం, చనువు లేకపోవటం, artificial గా తప్పనిసరిగా మాట్లాడటం అయితే వాళ్ళని స్నేహితులు అని మాత్రం తప్పకుండా అనకర్లేదు. తెలిసిన వాళ్ళో, పక్క వాళ్ళు అనో అంటే చాలు. స్నేహితులని కలవాలి అని మన మనసుకి అనిపించాలి. వాళ్ళతో అన్ని షేర్ చేసుకోవాలని అనిపించాలి. అలా నాకు అనిపించిన వారి గురించి నా బ్లాగు లో తప్పకుండా రాయాలి అనిపించింది.
ReplyDeleteవర్డ్ సెర్చ్ అని రాసారు. నాకు అర్ధం కాలేదు అండి అది ఏంటో. 'సెర్చ్' అని పెట్టాను పైన దాని గురించి చెప్తున్నారా? దానివల్ల నష్టాలు ఏమన్నా ఉన్నాయా?
chaalaa baagundhi aa cheppatam
ReplyDeletenice vandana...nenu dayton and duluth vachinapudu your hospitality is great... i always remember your help and your vantalu :)
ReplyDeletemiss u
Kameswari