Saturday, April 30, 2011

స్పెల్లింగు గారడీ

అదేదో సినిమాలో నటుడు నరేష్ ఒక ఇంటర్వ్యూ కి వెళతాడు. ఇంటర్వ్యూ చేసే అతను 'coffee ' స్పెల్లింగు చెప్పు నాయనా ' అంటాడు. వీడికి వుద్యోగం చేయటం అస్సలు యిష్టం వుండదు. ఎలాగోలా తప్పు చెప్పి వుద్యోగం రాకుండా ఉండేటట్లు చేసుకోవాలని వీడి తాపత్రయం. అలా ఆలోచించి కాఫీ స్పెల్లిన్గును 'kauphy ' అని చెప్తాడు. ఆ సన్నివేసం గుర్తుకు వచ్చినప్పుడల్లా నవ్వుకునేవాళ్ళం. 
అసలు ఒక్క అక్షరం కూడా కలవకుండా భలేగా చెప్పాడు అని. యింతకి ఉపోద్గాతం ఎందుకు చెప్తున్నాను అంటే మా అమ్మాయి కూడా ప్రస్తుతం అదే చేస్తోంది కాబట్టి. అది ప్రస్తుతం kindergarten లో వుంది. వాళ్ళ టీచర్ pronounciation ఎలా వుంటే అలా స్పెల్ చేయాలి అని చెప్పిందిట. తప్పు అయినా ' no need to worry 
 
 కంటిన్యూ' అందిట. యిక చూడండి. యిక్కడ అమెరికన్స్ వర్డ్స్ ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో దాన్ని బట్టి స్పెల్లింగ్స్ చెప్తున్నది. నాకు అయితే ఆశ్చర్యానికి అంతులేదనుకోండి . గొప్పతనం ఏమిటి అంటే తప్పుచేప్పినప్పుడు నేను 'యిది తప్పు' అన్నాను అనుకోండి  'thats ok అమ్మ ఎలా అన్నాస్పెల్ చేయచ్చు మా టీచర్ చెప్పింది' అంటుంది. కాని మనం చెప్పిన కరెక్ట్ స్పెల్లింగు గుర్తు పెట్టుకుని మళ్ళా మనం అడిగినప్పుడు కరెక్ట్ స్పెల్లిన్గే చెప్తుందిదాని ఆలోచనకి, మెమరీ కి మాత్రం నా జోహారు. అది తప్పు చెప్పిన ప్రతి పదము ఆలోచిమ్చేలాగే వుంటుంది (నరేష్ చెప్పినట్లు ). మధ్య మా యింట్లో యిదే కొనసాగుతోంది. 'లాస్య (మా అమ్మాయి పేరు) గేమ్' అంటాను. 'రెడీ అమ్మ' అంటుంది. యింక మొదలు. మొదట, ముందు రోజు తప్పు చెప్పినవి అడుగుతాను అవి ఆలోచించుకుని నెమ్మదిగా కర్రెక్టు చెప్తుంది (కొన్నితప్పే చెప్తుంది లెండి). యింక తరువాత కొత్తవాటితో మొదలు పెడతాము. యిది ముఖ్యం గా అన్నం తినేటప్పుడు మా గేమ్ అనమాట. యీ రకం గా అన్నం తినటం అనే పెద్ద పని హ్యాపీ గా పూర్తి అవుతుంది, నాలుగు కొత్త ఇంగ్లీషు పదాలు  నేర్చుకున్నట్లు అవుతుంది.
               అలా సరదాగా సాగే మా గేమ్ లో కొన్ని సరదా కబుర్లు అందరితో పంచుకోదలుచుకున్నాను. చూసి నవ్వుకోండి.
                    ఒకసారి ''Biryani ' స్పెల్లింగు చెప్పు' అన్నా, దానికి తెలుసు అది కష్టమయిన పదం అని, తెలివిగా నేను 'Rice ' స్పెల్లింగు చెప్తాను అంది. నేను 'అది, యిది ఒకటి ఎలాగా అవుతుంది' అన్నా, 'రెండు ఒకటేఅది చెప్తే యిది చెప్పకర్లా' అంటోందియింక నేను ఊరుకోకుండా బలవంత పెట్టేసరికి దానికి తప్పదు అని అర్ధం అయి యిక మొదలెట్టింది మెల్లగాఅది ఒక్కో అక్షరం ఆలోచించుకుంటూ చెప్తుంటే నిజం గా నాకే ఆశ్చర్యం వేసిందిచివరికి అది చెప్పింది ఏమిటో తెలుసా 'bereani '.  అసలు 'y ' అక్షరమే వాడకుండా భలే చెప్పింది.
               నాకు బాగా గుర్తు దాని చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ నాన్నని 'Knife ' స్పెల్లింగు అడిగింది. ఈయన చెప్పారు. దానికి చాలా కోపం వచ్చింది. 'నేను అడిగితే తప్పు చెప్తావా' అంటూ ఒకటే ఏడుపు. 'నేను తప్పు చెప్పలేదు నాన్నా కరెక్టే చెప్పాను' అంటే అసలు వింటే కదా ఏడుపు, ఇదెక్కడి గొడవరా నాయనా 'యీ స్పెల్లింగు ఎవడు కనిపెట్టాడురా' అని అనుకున్నాము. అప్పుడు దానికి ఈ 'silent letter ' అనే కాన్సెప్టు గురించి చెప్పాము. యిప్పుడు ఏదన్నా స్పెల్లింగులు చెప్తూ పొరపాటున ఏది అయిన అనవసరమయిన అక్షరం చెప్పింది అనుకోండి 'అదేంటే అక్షరం ఎందుకు వచ్చింది మధ్యలో ' అన్నాము అనుకోండి 'ఓహ్ అది silent ' అంటుంది. చూడండి యిప్పటి కాలం పిల్లల తెలివి.
              వేరే సందర్భం లో ఈయన ''picture ' స్పెల్లింగ్ చెప్పు' అన్నారు. 'pick ' అంటూ మొదలు పెట్టింది. మేము నవ్వుతూ వుండటం చూసి దానికి అర్ధం అయింది ' వీళ్ళు నన్ను ఆటపట్టిస్తున్నారు' అని యింక ఆపేసింది. మా అమ్మాయి చిన్నప్పటి నుండి 'ఇడ్లీ ' ని 'ఇగ్లి' అనేది అదేంటో. సరే 'idly ' స్పెల్లింగు చెప్పవే అంటే, అది చెప్పింది ఏమిటో ఊహించండి? ఊహకి కూడా అందని ఆ స్పెల్లింగు చూసి ఏమి చెయ్యాలో తోచక కాసేపు అలాగే ఉండిపోయాను. యింతకి ఏమిటో తెలుసా అది చెప్పినది 'egle '.           

మా అమ్మాయి చెప్పిన కొన్ని సరదా స్పెల్లింగులు ....
 onien - onion
 waring - wearing
 cald - called
 peers  - pears  ingreends - ingrediants
 frends - friends
 hort - heart
resepe - receipe
stul - stool
bereani - biryani
chendana - chandana
pick - picture
skeleten - skeleton
taval - towel
tung - tounge
butyfull - beautifull
egle - idly

 యింకా ఏమన్నాకొత్తవి వస్తే తప్పకుండా యీ పోస్టులో update చేస్తాను.

1 comment:

  1. Laasya is too cute..Naaku matram picha happy ga undi..ninnu ikkada choosi...ennirojulayindi kada manamu assalu matladaka...

    Hope all is well....

    ReplyDelete