Tuesday, May 24, 2011
Tuesday, May 10, 2011
ఆరోగ్యం గా బరువు తగ్గటం ఎలా?
ఆ మధ్య రెండు మూడేళ్ళ క్రితం ఎందుకో డాక్టర్ దగ్గరికి వెళ్తే cholestrol (triglyceroids ) సంఖ్య చాలా ఎక్కువ వున్నట్లు చెప్పారు. అప్పటిదాకా అసలు cholestrol అంటే ఏమిటి, triglyceroids అంటే ఏంటి, అసలు వినటమే కాని వాటి గురించిన జ్ఞానం లేదు. 'నువ్వు బరువు తగ్గాలి, అన్నం తగ్గించాలి' లాంటివి చాలా చెప్పింది మా డాక్టర్. excercises వగయిరా లు చేయాలి అని కూడా చెప్పింది. అప్పటిదాకా excercises కాని dieting లు కాని చేసి ఎరుగను. అప్పుడు యిక కూర్చుని అసలు ఈ cholestrol ఏంటి, వాకింగ్ ఏంటి, ఎలా తగ్గించాలి అని రకరకాలుగా గూగుల్ లో వెతికాను. చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. అంతా కూడా excercises , వాకింగ్ చెయ్యమని చెప్పటమే. 'ఆ ఒక్కటి అడక్కు' టైపు నేను excercises విషయంలో. మా ఆయనకీ, నాకు ఎప్పుడు అక్కడే గొడవ. 'అస్సలు ఒంటిని కష్ట పెట్టవు' అంటూ మొదలు పెడతారు. నాకేమో ఈ excercises అవి చేస్తుంటే తెగ టైము వేస్టు చేస్తున్న ఫీలింగు. బోలెడు పని పెట్టుకుని యివి చెయ్యటం కూడా రోజు కుదరదు (కుదుర్చుకుంటే తప్పకుండా కుదురుతుంది). సరే అలా ఆలోచిస్తూ వుంటే dieting చేస్తే ఎలా వుంటుంది అనిపించింది. కాని ఆ విషయానికి వస్తే నేను వుపవాసలకు పూర్తి వ్యతిరేకిని. అసలు ఆగుదాము అన్నాఆగలేను ఆకలికి. Exercises చెయ్యక, dieting చెయ్యక, మరి ఏమిటి చెయ్యటం? అప్పుడు తట్టింది నాకు.. తినే ఆహారం లో కాలోరీ కౌంటు తక్కువ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది కదా అని.
Subscribe to:
Posts (Atom)