ఆ మధ్య రెండు మూడేళ్ళ క్రితం ఎందుకో డాక్టర్ దగ్గరికి వెళ్తే cholestrol (triglyceroids ) సంఖ్య చాలా ఎక్కువ వున్నట్లు చెప్పారు. అప్పటిదాకా అసలు cholestrol అంటే ఏమిటి, triglyceroids అంటే ఏంటి, అసలు వినటమే కాని వాటి గురించిన జ్ఞానం లేదు. 'నువ్వు బరువు తగ్గాలి, అన్నం తగ్గించాలి' లాంటివి చాలా చెప్పింది మా డాక్టర్. excercises వగయిరా లు చేయాలి అని కూడా చెప్పింది. అప్పటిదాకా excercises కాని dieting లు కాని చేసి ఎరుగను. అప్పుడు యిక కూర్చుని అసలు ఈ cholestrol ఏంటి, వాకింగ్ ఏంటి, ఎలా తగ్గించాలి అని రకరకాలుగా గూగుల్ లో వెతికాను. చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. అంతా కూడా excercises , వాకింగ్ చెయ్యమని చెప్పటమే. 'ఆ ఒక్కటి అడక్కు' టైపు నేను excercises విషయంలో. మా ఆయనకీ, నాకు ఎప్పుడు అక్కడే గొడవ. 'అస్సలు ఒంటిని కష్ట పెట్టవు' అంటూ మొదలు పెడతారు. నాకేమో ఈ excercises అవి చేస్తుంటే తెగ టైము వేస్టు చేస్తున్న ఫీలింగు. బోలెడు పని పెట్టుకుని యివి చెయ్యటం కూడా రోజు కుదరదు (కుదుర్చుకుంటే తప్పకుండా కుదురుతుంది). సరే అలా ఆలోచిస్తూ వుంటే dieting చేస్తే ఎలా వుంటుంది అనిపించింది. కాని ఆ విషయానికి వస్తే నేను వుపవాసలకు పూర్తి వ్యతిరేకిని. అసలు ఆగుదాము అన్నాఆగలేను ఆకలికి. Exercises చెయ్యక, dieting చెయ్యక, మరి ఏమిటి చెయ్యటం? అప్పుడు తట్టింది నాకు.. తినే ఆహారం లో కాలోరీ కౌంటు తక్కువ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది కదా అని.
ముఖ్యం గా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ భాగం అన్నానికే ప్రాధాన్యత. అన్నం తినటం వల్ల కూడా కాలోరీస్ బాగా ఎక్కువ పెరుగుతాయి. అన్నానికి బదులు ఏది రిప్లేసు చెయ్యాలి అని ఆలోచిస్తే ముందుగా చపాతి యో లేక పరాట యో గుర్తుకు వస్తాయి. పరాటాలలో మనకు చాలా రకాలు వున్నాయి. మేతి పరాట అని, ఉల్లి పరాట అని. అలా రోజుకో రకం చేసుకుని తినచ్చు. కాని నేను పెద్దగా చపాతి ఫ్యాన్ ని కాను. రోజు అదే తినలేను. అందులోను చపాతీ ఫిల్లింగ్ కాదు. సరే యిక మరి ఏమి చేయాలి? గోధుమ రవ్వ తట్టింది మదిలో. మా నాయనమ్మ నాకు బాగా గుర్తు గోధుమ అన్నం తినేది. అంటే గోధుమనే నీళ్ళతో వండి మామూలుగా కూర, పప్పు, చారు యిలా అన్ని అందులో కలుపుకుని తినేది అనమాట. అంటే మనం అన్నానికి బదులు గోధుమని రిప్లేసు చేస్తున్నాము అంతే.
ముఖ్యం గా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ భాగం అన్నానికే ప్రాధాన్యత. అన్నం తినటం వల్ల కూడా కాలోరీస్ బాగా ఎక్కువ పెరుగుతాయి. అన్నానికి బదులు ఏది రిప్లేసు చెయ్యాలి అని ఆలోచిస్తే ముందుగా చపాతి యో లేక పరాట యో గుర్తుకు వస్తాయి. పరాటాలలో మనకు చాలా రకాలు వున్నాయి. మేతి పరాట అని, ఉల్లి పరాట అని. అలా రోజుకో రకం చేసుకుని తినచ్చు. కాని నేను పెద్దగా చపాతి ఫ్యాన్ ని కాను. రోజు అదే తినలేను. అందులోను చపాతీ ఫిల్లింగ్ కాదు. సరే యిక మరి ఏమి చేయాలి? గోధుమ రవ్వ తట్టింది మదిలో. మా నాయనమ్మ నాకు బాగా గుర్తు గోధుమ అన్నం తినేది. అంటే గోధుమనే నీళ్ళతో వండి మామూలుగా కూర, పప్పు, చారు యిలా అన్ని అందులో కలుపుకుని తినేది అనమాట. అంటే మనం అన్నానికి బదులు గోధుమని రిప్లేసు చేస్తున్నాము అంతే.
ముఖ్యం గా యిందులో తెలుసుకోవాలసినవి మూడు వున్నాయి. ఒకటి గోధుమరవ్వ తినటము వల్ల కాలోరీ కౌంట్ కాస్త తగ్గుతుంది. రెండు గోధుమ అన్నము అంత రుచి వుండదు కాబట్టి కాస్త తక్కువే తింటాము. మూడు, అన్నము గ్లూకోసు కింద మారటానికి చాలా తక్కువ సమయము పడుతుంది గోధుమ ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆ విధం గా కూడాను మనకు గోధుమ మంచిది. యిలా నా పరిశోధన కొనసాగాక యింక మొదలు పెట్టా నా dieting. ఒక మూడు నెలల పాటు చేసాను. మొత్తం వారం లో అయిదు రోజులు అసలు అన్నం ముట్టుకోలేదు. మొత్తం గోధుమ అన్నమే. దాంట్లోనే కూర, పప్పు, పెరుగు ను. యింక వీకెండ్స్ అసలు మొహమాటం లేకుండా అన్ని తినేదాన్ని. పార్టీ ఫుడ్ వదిలేదాన్ని కాదు. మిగతా రోజుల్లో నూనె అనేది అసలు పోపు లో కూడా అరకొర . Deep Fries మొత్తానికే మానేసాను. కేకులు, స్వీట్లు అస్సలు వాటి వంకే చూడలేదు. మొత్తం మూడు నెలలలో దాదాపు ఒక ఎనిమిది పౌండ్లు పైనే తగ్గాను. అసలు నన్ను చూసిన వాళ్ళు తెగ ఆశ్చర్య పోయారు. అంత ఎందుకు అసలు ఎప్పుడు ఏమి అనని మా ఆయనే 'ఏంటి వందన నువ్వు యిలా తగ్గి పోయావు' అని అడిగారు. అసలు మొహం లో కూడాను చాలా మార్పు వచ్చింది. మీరు complete dieting చేసే వాళ్ళని చూడండి, మొహాలు పీక్కుని పోయి వుంటారు. అసలు చూడటానికి కూడాను బాగోదు. నేను dieting చేసాను అని చెప్పట్లేదు యిక్కడ. కాలోరీస్ చూసుకుని కడుపునిండా తిన్నాను. దానితో healthy గానే వున్నాను.
అలా నేను dieting చేసిన రోజుల్లో కొన్ని వంటలు కనిపెట్టాను రుచికరంగా తినటానికి. ఏమి అంటే dieting ను ఎంజాయ్ చెయ్యాలి అని నా ఉద్దేశము. కడుపు కాల్చుకుంటే ఎంజాయ్ ఏమి చేస్తాము చెప్పండి?
రోజు గోధుమఅన్నం తినాలన్నా కష్టమే, అసలు లంచ్ టైము లో బాక్స్ తెరవాలి అంటేనే ముందు కష్టం అనిపించేది. అప్పుడు తట్టింది ఐడియా, బియ్యం తో చేసినట్లే గోధుమతో వెరయిటీలు ట్రై చేస్తే ఎలా వుంటుంది అని కొన్ని ప్రయోగాలు చేసాను. కుదిరాయి. బాగా కుదిరినవి మీతో పంచుకుందాము అనే ఉద్దేశము తో ఈ పోస్టు మొదలు పెట్టాను. అలాగే సోయా చంక్స్ తో, Olive , Avacado తో కొన్ని ట్రై చేసాను. అన్ని చాలా బాగా కుదిరాయి. అలా కుదిరినవి మీ అందరితే షేర్ చేస్తే మీరు కూడా కొత్త రకం వంట తెలుసుకోవటమే కాకుండా యిలా డైట్ లో కూడా ఉపయోగపడుతుందని నా ఆశ. యింకా ముందు ముందు యిలా ఏ కొత్త రకం ప్రయోగించినా అది తప్పకుండా (బాగా కుదిరితే) పోస్టు చేస్తాను. ' Healthy Receipes ' అనే సెక్షన్ లోకి వెళ్లి చూసి ప్రయత్నించి చూడండి. మీ అభిప్రాయాలను తెలపండి.
మా ఇంట్లో చపాతీలతో నల్ల సెనగలు లేదా రాజమ బీన్స్, ఇంకా తెల్ల సెనగలు (చానా) తో కలిపి చేసుకొనే కూర బాగా నడుస్తుంది. పర్సనల్ ఛాయస్ ఏమో తెలియదు కాని, అందులో ఒక అర బంగాళా దుంప వేస్తె వారం ఏడు రోజులూ ఆ కూర తినొచ్చు అనిపిస్తుంది :).
ReplyDeleteరాజ్మా, నల్ల శెనగల లో బోలెడంత ఫైబెర్ ఉంటుంది, కార్బ్స్ కూడా తక్కువ అని తెలిసిన ఇండియన్ డాక్టర్స్ చెప్పారు.
(కామెంట్స్ కి వర్డ్ వెరిఫికేషన్ తీసేసి moderation పెడితే బాగుంటుందేమో చూడండి).
As long as you choose whole grains, rice and wheat have similar profiles with just a few differences.
ReplyDeleteBoth rice and wheat have equal caloric value, you can maintain your weight by regulating the portion size. You can easily go ahead and relish your rice and roti, provided you remain disciplined in the amounts you eat.
http://en.wikipedia.org/wiki/Rice#Comparison_of_rice_to_other_major_staple_foods