Tuesday, May 24, 2011

గోధుమరవ్వ పొంగలి

కావలసిన పదార్దములు: గోధుమ రవ్వ 1 కప్పుపెసరపప్పు 1 / 2 కప్పు, అల్లం చిన్న ముక్కకరివేపాకునూనెఉప్పుపాలుమిరియాలు 1 / 2 స్పూనుజీల కర్ర  1 / 2 స్పూను, ఆవాలు 1 / 2 స్పూను, పాల కూర 1 / 2 కట్ట లేదా 1 / 4 కట్ట
 





తయారుచేసే విధానం: ముందుగా గోధుమరవ్వ, పెసరపప్పు ను బాగా కడిగి కుక్కరు లోకప్పుల నీళ్ళు పోసి వుడికించండి. విడిగా బాణలిలో 2 లేక 3 చెంచాల నూనె వేసి కాగాక, జీల కర్ర, ఆవాలు, అల్లం, వేసి వేయించండి. యిప్పుడు సన్నగా తరిగిన పాలకూరను వేసి బాగా వేయించండి. తరువాత అందులో ఉడికించిన గోధుమ రవ్వ మిశ్రమం, ఉప్పుమిరియాలు (యివి దంచి వేసినా పర్లేదు లేదా అలాగే వేసినా రుచిగానే వుంటుంది), కొంచం కొంచం పాలు పోస్తూ వుడికించండి. మాములుగా పొంగలి మనకు కొంచం జారుడుగానే వుంటుంది (చల్లారాక గట్టి పడుతుంది), consistency  వచ్చే లాగా పాలు పోస్తూ దగ్గర వుండి తిప్పుతూ వుండాలి. చివరలో రెండు చెంచాల నెయ్యి వేస్తే చాలా రుచి గా వుంటుంది. కాకపోతే మనం డైట్ అంటున్నాము కనుక నేతిని మరచిపోండి. అంతే నోరు ఊరించే గోధుమ రవ్వ పొంగలి సిద్ధంయిందులో నంచుకోటానికి వంకాయ పచ్చడి, టమేట పచ్చడి బాగుంటాయి.  

No comments:

Post a Comment