అమ్మో ఏంటిది అనుకుంటున్నారా? Same feeling నాకు కూడా నేను మొదటి సారి విన్నప్పుడు. కాని చూసాక భలే బాగా అనిపించింది. ఈ ప్రయోగం నా సొంత ప్రయోగం కాదు. పోయిన ఏడాది 'మా' టీవీ లో 'మా వూరి వంట' అమెరికా స్పెషల్స్ లో ఒక ఆవిడా చేసారు. జాగ్రత్తగా నోటు చేసి పెట్టుకున్నాను కాని నేను మాత్రం ఆ ప్రయోగం చేయలేదు. యిది నాకు ఎందుకో కొంచం complicated గా అనిపించింది. యింకా అంత శ్రమ కూడా నామటుకు నాకు అనవసరం అనిపించింది.
Thursday, September 29, 2011
Tuesday, September 20, 2011
ఎంబ్రాయిడరీ చీర
చిన్నప్పటి నుండి కుట్లు అన్నా, అల్లికలు అన్నా నాకు చాలా యిష్టం. మా పైన యింటిలో కుమారి ఆంటీ అని ఒక ఆవిడ వుండేవారు. ఆవిడకి రాని కుట్లు అంటూ లేవేమో అని నా అభిప్రాయం. ఎప్పుడు ఏదో ఒకటి కుడుతూనే వుండేవాళ్ళు. ఎక్కువగా ఆవిడ కచ్‌వర్క్ కుట్టేవాళ్ళు. నాకు అన్ని కుట్లు రావు కాని బేసిక్ కుట్లు కొన్ని వచ్చు. కాని ఆవిడ కుడుతున్నవి అన్ని బాగా ఫాలో అయ్యి చూసేదాన్ని. ఆవిడకి కూడా తెలుసు నాకు వీటి మిద యిష్టం వుంది అని. చదువుకునే రోజులు కదండీ ఎక్కడ కుదురుతుంది మనకి చెప్పండి.... కాని వేసవి సెలవలకి ముందే ఆవిడకి చెప్పిపెట్టేదాన్ని 'ఆంటీ యిసారి డ్రెస్ మీద డిజైన్ వేద్దాము అనుకుంటున్నాను' అనో లేక 'చీర మిద వేయాలి' అనో చెప్పేదాన్ని. ఆవిడ కి నాకు ఏ రంగులు యిష్టమో, ఏ designs యిష్టమో అన్ని తెలుసు. తేలిక అయిన చక్కటి కుట్లు నేర్పేవాళ్ళు. యింక సమ్మర్ అంతా అలా ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసేదాన్ని. కార్బన్ పేపర్ తో ముందుగా డిజైన్‌ను చీర మిద వేసుకుని ఆ తరువాత కుట్టు మొదలు పెట్టేదాన్ని. సాధారణంగా కుట్లు నేర్చుకోవాలి అంటే ఎవరు అయిన నేర్పితే రావాలి. పుస్తకం లో బొమ్మలు వేసి చూపినా అవి అంత క్లియర్ గా వుండవు, అర్ధము కాదు. http://www.needlenthread.com/ అని ఒక వెబ్సైటు వుంది. దానిలో వీడియో సెక్షన్ కు వెళ్లి చూడండి. చాలా బాగా అన్ని కుట్లు ఎలా కుట్టాలో పొందుపరిచి ఉంచారు. మనకు తెలీని చాలా కుట్లు అందులో వున్నాయి. ఒక dictionary లాగా వుంది అది నాకు. కుట్ల పేర్లు మనకి తెలుగులో తెలుసు కాని వాటిని exact గా ఇంగ్లీష్ లో ఎలా అంటారో తెలిదు కాని ఆ వీడియోలు చూస్తే పేర్లు కూడా తెలుస్తాయి. నిజంగా కుట్లు, అల్లికలు, ఆర్ట్‌లు యిష్టం ఉన్నవాళ్ళకి ఈ వెబ్సైటు చాలా ఉపయోగకరం. తప్పకుండా నచ్చితీరుతుంది.
Subscribe to:
Posts (Atom)