అమ్మో ఏంటిది అనుకుంటున్నారా? Same feeling నాకు కూడా నేను మొదటి సారి విన్నప్పుడు. కాని చూసాక భలే బాగా అనిపించింది. ఈ ప్రయోగం నా సొంత ప్రయోగం కాదు. పోయిన ఏడాది 'మా' టీవీ లో 'మా వూరి వంట' అమెరికా స్పెషల్స్ లో ఒక ఆవిడా చేసారు. జాగ్రత్తగా నోటు చేసి పెట్టుకున్నాను కాని నేను మాత్రం ఆ ప్రయోగం చేయలేదు. యిది నాకు ఎందుకో కొంచం complicated గా అనిపించింది. యింకా అంత శ్రమ కూడా నామటుకు నాకు అనవసరం అనిపించింది.
యిది చూసిన మరునాడు, ఆఫీసులో మా కొలీగ్స్ ని వూరికే అడిగాను 'ఫ్రైడ్ ఐస్ క్రీం ' అని ఎప్పుడయినా విన్నారా అని, 'ఓహ్ ఎందుకు తెలిదు మాకు బాగా యిష్టం అది' అని చెప్పటం మొదలెట్టారు. అప్పుడు వెంటనే గూగుల్ లో వెతికాను. అబ్బో అప్పుడు కాని తెలిలా యిది చాలా పెద్ద ఫేమస్ వంటకమని.
vanilla icecream డబ్బా ఒకటి, కోడి గుడ్లు రెండు, డీప్ ఫ్ర్య్ కి సరిపడా నూనె, కార్న్ ఫ్లేక్స్ .
తయారు చేసే విధానం:
1 . ముందు మీకు కావాల్సినంత ఐస్క్రీం ను ఒక ప్లేటులోకి తీసుకోండి. తరువాత దాన్ని అరచేతిలోకి తీసుకుని చిన్నచిన్న బాల్సు మాదిరి చేయండి (చిన్న లడ్డు మాదిరి). మీకు ఎన్ని బాల్సు కావాలో అన్ని చేసి పెట్టుకోండి. తరువాత ఆ బాల్సును ఒక గంట సేపు ఫ్రిజ్జి లో పెట్టండి.
2 . ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్ తీసుకుని బాగా నలిపి పెట్టుకోండి. యిప్పుడు ఫ్రిజ్జి లో నుండి ఐస్క్రీం బాల్సును తీసి, ఈ కార్న్ ఫ్లేక్స్ లో బాగా దొర్లించండి. మొత్తం ఐస్క్రీం కి ఈ కార్న్ ఫ్లేక్స్ బాగా పట్టాలి. యిప్పుడు మళ్ళా ఈ బాల్సును ఒక గంట సేపు ఫిజ్జి లో పెట్టండి.
3 . కోడి గుడ్లు తీసుకుని ఒక గిన్నెలో బాగా గిలకొట్టండి. ఫ్రిజ్జి లో నుండి ఐస్క్రీం బాల్సును తీసి కోడిగుడ్డు సొనలో బాగా ముంచండి. వెంటనే మళ్ళా కార్న్ ఫ్లేక్స్ లో దొర్లించి, మళ్ళా ఒక గంట సేపు ఫ్రిజ్జి లో పెట్టండి.
4 . ఒక గంట తరువాత, బాణలిలో నూనె పోసి(సిమ్ము లో పెట్టండి), ఈ బాల్సుని తిసి, ఒక్కోటి చొప్పున చిల్లుల గరిటలో తీసుకుని, కరెక్టు గా పది నుండి పదిహేను సెకండ్లు మాత్రమే వేయించి, మళ్ళ ఒక గంటసేపు ఫిజ్జి లో పెట్టండి.
5 . గంట తరువాత ఫ్రైడ్ ఐస్క్రీం ను తీసి సర్వింగ్ కప్స్ లో సర్వ్ చెయ్యండి..
సరే దాని రెసిపి యిక్కడ నా బ్లాగు లో రాస్తే, చూసినవాళ్ళు ఏమన్నా ప్రయత్నిస్తారని, చేసి నన్ను మెచ్చుకుంటారు అని నా ఆశ.
ఈ వంట చేయాలి అంటే ఓపిక, సహనం, టైమింగ్, శ్రద్ధ వుండాలి. యిందులో ఏ ఒక్కటి లేకపోయినా అసలు వంటకమే కుదరదు. నేనయితే దీన్ని రుచి చూడను లేదు, అసలు చూడను కూడా లేదు. కాని టీవీ లో చూడగానే యిది ఏదో బాగుంది అనిపించి నోటు చేసుకున్నాను. కింద మీరు చూస్తున్న ఫోటో లోనిది నేను తయారుచేసినది కాదు. ఇంటర్నెట్ లో చూసి డౌన్లోడ్ చేసి దీనిలో మీ అందరికి తెలియడం కోసం పెడుతున్నాను.
కావాల్సిన పదార్దాలు:
తయారు చేసే విధానం:
1 . ముందు మీకు కావాల్సినంత ఐస్క్రీం ను ఒక ప్లేటులోకి తీసుకోండి. తరువాత దాన్ని అరచేతిలోకి తీసుకుని చిన్నచిన్న బాల్సు మాదిరి చేయండి (చిన్న లడ్డు మాదిరి). మీకు ఎన్ని బాల్సు కావాలో అన్ని చేసి పెట్టుకోండి. తరువాత ఆ బాల్సును ఒక గంట సేపు ఫ్రిజ్జి లో పెట్టండి.
2 . ఒక ప్లేటులో కార్న్ ఫ్లేక్స్ తీసుకుని బాగా నలిపి పెట్టుకోండి. యిప్పుడు ఫ్రిజ్జి లో నుండి ఐస్క్రీం బాల్సును తీసి, ఈ కార్న్ ఫ్లేక్స్ లో బాగా దొర్లించండి. మొత్తం ఐస్క్రీం కి ఈ కార్న్ ఫ్లేక్స్ బాగా పట్టాలి. యిప్పుడు మళ్ళా ఈ బాల్సును ఒక గంట సేపు ఫిజ్జి లో పెట్టండి.
3 . కోడి గుడ్లు తీసుకుని ఒక గిన్నెలో బాగా గిలకొట్టండి. ఫ్రిజ్జి లో నుండి ఐస్క్రీం బాల్సును తీసి కోడిగుడ్డు సొనలో బాగా ముంచండి. వెంటనే మళ్ళా కార్న్ ఫ్లేక్స్ లో దొర్లించి, మళ్ళా ఒక గంట సేపు ఫ్రిజ్జి లో పెట్టండి.
4 . ఒక గంట తరువాత, బాణలిలో నూనె పోసి(సిమ్ము లో పెట్టండి), ఈ బాల్సుని తిసి, ఒక్కోటి చొప్పున చిల్లుల గరిటలో తీసుకుని, కరెక్టు గా పది నుండి పదిహేను సెకండ్లు మాత్రమే వేయించి, మళ్ళ ఒక గంటసేపు ఫిజ్జి లో పెట్టండి.
5 . గంట తరువాత ఫ్రైడ్ ఐస్క్రీం ను తీసి సర్వింగ్ కప్స్ లో సర్వ్ చెయ్యండి..
వందన, ఎంత లేదన్నా నాలుగు గంటలైనా పట్టేట్టుంది :) - మాంచి కాలక్షేపం ఒక వీకెండ్ కి.
ReplyDelete