కాదేది కవిత కి అనర్హం అన్నట్లు నా దృష్టిలో కాదేది కలెక్షను కు అనర్దం. మనము ఏది కల్లెక్టు చేస్తే అదే ఒక హాబీ. మొదలు పెట్టేటప్పుడు యిది అని అనుకుని మొదలు పెట్టలేదు కాని అదే ఒక పెద్ద హాబీ అయి కూర్చుంది నాకు. ‘నాకు స్టాంపు కలెక్షను హాబీ, నా దగ్గర వివిధ దేశాల కరెన్సీ బిల్లులు వున్నాయి’ అని జనాలు అనటం మీరు వినే వుంటారు. అది ఒకప్పటి సంగతి. యిప్పటి నా సంగతి చదవండి....
Friday, February 24, 2012
షాట్ గ్లాస్ కలెక్షను
కాదేది కవిత కి అనర్హం అన్నట్లు నా దృష్టిలో కాదేది కలెక్షను కు అనర్దం. మనము ఏది కల్లెక్టు చేస్తే అదే ఒక హాబీ. మొదలు పెట్టేటప్పుడు యిది అని అనుకుని మొదలు పెట్టలేదు కాని అదే ఒక పెద్ద హాబీ అయి కూర్చుంది నాకు. ‘నాకు స్టాంపు కలెక్షను హాబీ, నా దగ్గర వివిధ దేశాల కరెన్సీ బిల్లులు వున్నాయి’ అని జనాలు అనటం మీరు వినే వుంటారు. అది ఒకప్పటి సంగతి. యిప్పటి నా సంగతి చదవండి....
Tuesday, February 14, 2012
చంకి వర్కు చీర
ఆ మధ్య మూడు ఏళ్ళ క్రితం మా స్నేహితురాలితో మంచి రంగు ఉన్నచీర ఒకటి తీసుకోమని చెప్పాను. అలాగే నాకు కుట్లు యిష్టం కాబట్టి, కాడ కుట్టు లేదా గొలుసు కుట్ట్లతో కూడిన ఒక మంచి డిజైన్ ను దానిమీద వేయించమని అడిగాను. తను అలానే గొలుసు కుట్టు, కాడ కుట్ల తో కూడిన పూల కొమ్మల డిజైన్ ను వేయించింది చీర మీద. మొత్తం పదకొండు కొమ్మలు వచ్చాయి చీరమీద. గొలుసుకుట్టు తోనే అందులో చమ్కీలు, రాళ్ళు, పూసలు కుట్టేలాగా వుంది ఆ డిజైన్. రంగు కూడా నాకు లేని రంగు తీసుకుంది. మంచి సంపెంగ పూవు రంగు అది. మా అమ్మా వాళ్ళు అమెరికా వచ్చేటప్పుడు తీసుకుని వచ్చారు. అది చూడగానే నాకు భలే నచ్చేసింది. మా అమ్మాయి, మా ఆయన అప్పుడే ఒక నెల రోజుల కోసం ఇండియా వెళ్ళటం జరిగింది. అదే అదను అనుకుని యిక యుద్ద ప్రాతిపదికన కుట్టటం ప్రారంభించాను. ఎట్టకేలకు ఒక కొమ్మ మాత్రం కుట్టగలిగాను. అంతే వాళ్ళు తిరిగి రావటం, దాన్ని మూల పెట్టటం జరిగిపోయాయి. మరలా మా అమ్మా వాళ్ళు ఒక రెండు ఏళ్ళకి అమెరికా వచ్చారు. యింకా ఆ చీర అలాగే వుండటం చూసి, నాకు చెప్పను కూడా చెప్పకుండా తన suitcase లో పెట్టేసుకుంది మా అమ్మ. నేను ఇండియా వెళ్ళాక అప్పుడు చెప్పింది 'నీకు ఎలాగూ కుట్టటం అవ్వదు అని నేనే తెచ్చేశాను ' అని. ఎవరో ఒకావిడ చేత పన్నెండు వందలకి మొత్తం కుట్టిచ్చేసింది. కుట్టటానికి ఒక్క కొమ్మే కుట్టినా ఎందుకో ఆ చీర మొత్తం నేనే కుట్టిన ఫీలింగ్ నాకు.
Subscribe to:
Posts (Atom)