Friday, February 24, 2012

షాట్ గ్లాస్ కలెక్షను


కాదేది కవిత కి అనర్హం అన్నట్లు నా దృష్టిలో కాదేది కలెక్షను కు అనర్దం. మనము ఏది కల్లెక్టు చేస్తే అదే ఒక హాబీ. మొదలు పెట్టేటప్పుడు యిది అని అనుకుని మొదలు పెట్టలేదు కాని అదే ఒక పెద్ద హాబీ అయి కూర్చుంది నాకు. నాకు స్టాంపు కలెక్షను హాబీ, నా దగ్గర వివిధ దేశాల కరెన్సీ బిల్లులు వున్నాయి అని జనాలు అనటం మీరు వినే వుంటారు.  అది ఒకప్పటి సంగతి. యిప్పటి నా సంగతి చదవండి....
 

                  2004 లో మేము ఫ్లోరిడ ట్రిప్ లో భాగంగా Orlando , Keywest అని రెండు ప్రదేశాలకు వెళ్ళాముసరే  ప్రదేశాలన్నీ చూసాక Gifts Shops లో మంచి sovenier  కోసం వెతకటం ప్రారంభించానువాటికి కొదవేంటి చెప్పండి రకరకాలు వుంటాయిమనము కొనాలే కాని వెల కూడా అలాగే వుంటుంది అనుకోండిఅలా వెతుకుతూ వుంటే ఒక చోట 'Keywest ' అని పేరుతో రాసి ఉన్న చిన్న గ్లాసు కనపడ్డదిభలే ముద్దు గా అనిపించిందిఅసలు నాకు అది ఏమిటో, దేనికి వాడతారో కూడా తెలియదుమా ఆయన్ని అడిగానుఅది liquor అది తాగటానికి కొలతగా వాడుతారు అని చెప్పారు. ఓహో

అనుకున్నాను, కాని దాన్ని చూడగానే నచ్చేసి కొనేసాను. ట్రిప్పు లోనే ఓర్లాండో లో ' Universal Studios' కి వెళ్ళినప్పుడు  అక్కడ షాపు లో కూడా యిలాగే ‘Universal Studios, Florida’  అన్న పేరుతో ఉన్న గ్లాసు చూసి అనుకున్నాను 'ఓహో యిలా ప్రతి చోట, ప్రదేశానికి సంబంధించిన గ్లాసులు వుంటాయి కాబోలు' అని. అప్పుడు అనిపించింది నాకు 'ఎందుకు నేను యి గ్లాసులని కల్లెక్టు చేయకూడదు ' అని.  అది మొదలు ఎక్కడికి వెళ్ళినా వాటికి సంబందించిన గ్లాసులు కొనటం ప్రారంభించాను. ముందు అయితే నేను చూసిన, వెళ్ళిన ప్రదేశాలకి సంబందించిన గ్లాసులు  మాత్రమె కోనేదాన్ని. తరువాత అమెరికా లో నేను తిరిగిన రాష్ట్రాల  గ్లాసులు కొనాలి అని.... యిలా పెంచుకుంటూ పోయానుయిప్పుడు అయితే యిక నేను చూడని ప్రదేశాలకు సంబందించినవి కూడా నా కలేక్షనులో చేరుతున్నాయిఎప్పటికి అయినా ప్రదేశాలు చూడలేకపోతానా అని నా ఆశ
           ఆ మధ్య మా ఆఫీసులో ఒకతను స్కాట్లాండ్ వెళ్తుంటే 'ఒక గ్లాసు తెచ్చిపెట్టు బాబు' అని అడిగాను, తెచ్చిపెట్టాడు. అలాగే ఒక ఆయన స్పైన్ వెళ్ళాడు. 'బాబ్బాబు' అన్నాను. 'విత్ ప్లెజర్' అన్నాడువేరొక అతను carabian కి cruise లో వెళ్ళాడు. 'ఒరేయ్ నాయనా అక్కడ నువ్వు ఎన్ని islands చూస్తే అన్ని పట్టుకోచ్చేయ్యరా' అన్నా. మొత్తం 6 తెచ్చాడు(అంటే వాడు 6 దీవులు చూసాడు అని అర్ధం).  అలాగే egypt  ,   తైవాన్  నుండి కొన్ని చేరాయి నా కలేక్షనులో.
మధ్యన మా వారు                ఎక్కువగా  clients places కి వెళ్ళటం మూలాన నా కలేక్షనులో కౌంట్ త్వరగా పెరుగుతోందిపోయిన వారమే ఆయన Portarico , కరేబియన్ దీవులకు వెళ్ళటంఅక్కడ గ్లాసులు తేవటం కూడా జరిగిందికొత్తది కల్లెక్టు చేసినప్పుడల్లా అనుకుంటా ఎప్పటికి అయినా యీ ప్రాంతం చూడకపోతాన అని. మన చేతిలో లేదు కదా ఏదిను....

           యిక పోతే యి షాట్ గ్లాస్ లు పెట్టుకోటానికి డిస్ప్లే కేసులు  గురించి మాట్లాడటానికి వస్తే అవి కొనే కంటే, ఒక చిన్న సైజు ట్రిప్పు ప్లాన్ చేయవచ్చు అనిపిస్తోంది. మెల్లగా ఒకటి చూసి కొని వీటిని డిస్ప్లే లో పెట్టాలి. దాని మీదే వర్కౌట్ చేస్తున్నా....






3 comments:

  1. షాట్ గ్లాస్ కలెక్షను-ఆసక్తికరమైన హాబీ. ఆ ప్రదేశాల, రాష్ట్రాల, దేశాల గురించిన అవగాహన పెరిగుతుంది. మన మానసిక ప్రపంచ అవధులను పెంచుతుంది. Shot glass display case కొనటమో, తయారు చేయటమో,ఏదైనా బాగుంటుంది. కాకపోతే ఊరుమారాల్సివస్తే, వీటిని జాగ్రత్తగా కొత్త ఊరుకి చేర్చటం అదనపు పని అవగలదు.ఈ word Verification వలన మీకు వచ్చే వ్యాఖ్యలు తగ్గుతాయి.

    ReplyDelete
  2. బాగుంది వందన. అన్నీ 'మందు'పు గ్లాసులే కదా. మందపువి కూడా. పగలకపోవచ్చు ప్రయాణంలో. అమెరికా లో నువ్వు సేకరించగలిగే గ్లాసులకి అంతు లేదేమో - యాభై రాష్ట్రాలు, రాష్ట్రానికి ఇరవై కి తక్కువ కాకుండా పర్యాటక స్థలాలు, ఒక్కో చోట ఐదారు కి తక్కువ కాకుండా గిఫ్ట్ షాపులు. మన ఇళ్ళు నిండిపోతాయేమో కాని, వీటికి అంతు లేదు.

    ReplyDelete
  3. భాస్కరరావు గారు,
    అవునండి యిది ఆసక్తి కరమయిన హాబియే. డిస్ప్లే కేసు గురించే ఆలోచించాలి అంది. ప్రస్తుతానికి temporary ఒకటి వుంది. కాని చూడాలి.
    రామశాస్త్రి గారు,
    shotglass అంటేనే మందు గ్లాసు కదండీ :) మీరన్నట్టు అన్ని మందపువే. మేము ఊరు మారినప్పుడు ఒక్కోటి ఒక్కో మందపాటి కాగితం లో చుట్టి, అన్ని bubble wrap లో చుట్టి బాగానే తెచ్చాము. అప్పుడు ఏమి విరగలేదు కాని, మొన్న లాస్య హడావిడిలో ఒకటి విరగాకోట్టింది. కాని అదృష్టం porterico వి రెండు వుండటం తో దానికి ఎక్కువ తిట్లు పడలేదు.

    ReplyDelete