Tuesday, February 14, 2012

చంకి వర్కు చీర

 
 
 మధ్య మూడు ఏళ్ళ క్రితం మా స్నేహితురాలితో మంచి రంగు ఉన్నచీర ఒకటి తీసుకోమని చెప్పానుఅలాగే నాకు కుట్లు యిష్టం కాబట్టికాడ కుట్టు లేదా గొలుసు కుట్ట్లతో కూడిన ఒక మంచి డిజైన్ ను దానిమీద వేయించమని అడిగానుతను అలానే గొలుసు కుట్టు, కాడ కుట్ల తో కూడిన పూల కొమ్మల డిజైన్ ను వేయించింది చీర మీదమొత్తం పదకొండు కొమ్మలు వచ్చాయి చీరమీదగొలుసుకుట్టు తోనే అందులో చమ్కీలురాళ్ళుపూసలు కుట్టేలాగా వుంది  డిజైన్రంగు కూడా నాకు లేని రంగు తీసుకుంది. మంచి సంపెంగ పూవు రంగు అది. మా అమ్మా వాళ్ళు అమెరికా వచ్చేటప్పుడు తీసుకుని వచ్చారు. అది చూడగానే నాకు భలే నచ్చేసింది. మా అమ్మాయి, మా ఆయన అప్పుడే ఒక నెల రోజుల కోసం ఇండియా వెళ్ళటం జరిగింది. అదే అదను అనుకుని యిక యుద్ద ప్రాతిపదికన కుట్టటం ప్రారంభించానుఎట్టకేలకు ఒక కొమ్మ మాత్రం కుట్టగలిగాను. అంతే వాళ్ళు తిరిగి రావటం, దాన్ని మూల పెట్టటం జరిగిపోయాయి. మరలా మా అమ్మా వాళ్ళు ఒక రెండు ఏళ్ళకి అమెరికా వచ్చారు. యింకా చీర అలాగే వుండటం చూసి, నాకు చెప్పను కూడా చెప్పకుండా తన suitcase లో పెట్టేసుకుంది మా అమ్మ. నేను ఇండియా వెళ్ళాక అప్పుడు చెప్పింది 'నీకు ఎలాగూ కుట్టటం అవ్వదు అని నేనే తెచ్చేశాను ' అని. ఎవరో ఒకావిడ చేత పన్నెండు వందలకి మొత్తం కుట్టిచ్చేసింది. కుట్టటానికి ఒక్క కొమ్మే కుట్టినా ఎందుకో చీర మొత్తం నేనే కుట్టిన ఫీలింగ్  నాకు.
                       కింద చూపిన చీర, డిజైన్ ను చూడండి. కొమ్మలన్నిగొలుసు కుట్టు తో కుట్టానుమధ్య మధ్య , యింకా కాడ చివరన చేమ్కీలు వేసానుదారం కుడా బంగారం, ఎరుపు ఉన్నరెండు రంగులతో జత కలిపినది వాడానుపూల కోసం తెలుపు రంగు పూసలు వాడాను. యింకా పువ్వు మధ్య పెట్టటానికి ఎరుపు రంగు రాళ్ళు వాడాను.


No comments:

Post a Comment