Monday, February 24, 2014

Plastic Canvas Box Pattern


ప్లాస్టిక్ కాన్వాస్ తో వస్తువులు చేయటం గురించి చాలా కాలం నుండే నాకు ఐడియా ఉన్నది కాని ఎప్పుడు ప్రయత్నించే సమయం రాలేదు ఎప్పుడు చేయను లెదు. Cross Stich  తో పువ్వులు అవి కుట్టటమే  కానీ ప్రయత్నం ఎప్పుడు చెయ్యలెదు. అలా Cross Stitch designs ఎన్నో కుట్టి వాటిని ఫ్రేములకి కట్టించటం , గోడకి తగిలించటం, తీయటం అన్ని అయ్యాయి. ఈసారి ఇంటికి ఉపయోగపడేది ఏమయినా చేయాలి అనిపించింది. అలానే త్వరగా కూడా అవ్వాలి అని అనిపించటం తో ఇక ప్లాస్టిక్ కాన్వాస్ ప్రాజెక్ట్స్ అని మన గూగులమ్మ ని అడిగితే చాలానే చెప్పింది. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రాజెక్ట్ చేయటం జరిగినది.
మా అమ్మాయి హస్తం కుడా ఉందండోయ్ ఈ ప్రిపరేషన్లో . అసలు దానికి ఇంట్రెస్ట్ కలిగించే ప్రయత్నం లో నే మొదలు పెట్టటం జరిగింది.  థాంక్స్ to  మై daughter Lasya :)



ప్లాస్టిక్ కాన్వాస్ ని ఉపయోగించి బాక్స్ ఎలా తయారు చేయటం అనేది ఎలాగో photos  లో చూపిస్తూ మీకు క్లియర్ గా explain చేయటానికి ప్రయత్నం చేసాను . కానీ  అసలు మొదలు పెట్టే ముందు ఒక్కో ఫోటో తీసుకుంటూ వెళ్ళాక మళ్ళా మార్పులూ చేర్పులు చాలానే చేయటం జరిగింది ( మొదటి ప్రాజెక్ట్ కదండీ ఎక్స్పీరియన్స్ తక్కువ) అందుకు ఫోటోలను  మీరు ఐడియా కి తీసుకోండి కానీ రాసిన instructions ni డైరెక్ట్ గా ఫాలో అవ్వచ్చు. Exact గా అలాగే ఫాలో అవ్వాలి అని లెదు. నేను ఇచ్చే dimensions తోటే చెయ్యాలని లేనే లెదు. దానికి తగ్గట్టు మార్పులు మీరు చెసుకొవచ్చు. ఇది కేవలం ఐడియా కోసమే
నేను చేసిన బాక్స్ కి కావాల్సిన వస్తువులు:
1. అయిదు 7 కౌంట్ ప్లాస్టిక్ కాన్వాస్ షీట్స్ (70X90) కౌంట్
2. సూది
3. మీ డిజైన్ కి కావాల్సిన రంగు wools
4. కత్తెర

బాక్స్ ప్రిపరేషన్ ని ముందుగా రెండు భాగాలుగా విభచించుదాముఒకటి Base అంటే డబ్బా ప్రిపరేషన్ (కింద భాగం) రెండు Lid అంటే మూత ప్రిపరేషన్ (పై భాగం)

Base ప్రిపరేషన్ కి మొత్తం అయిదు ముక్కలు కావాలి cutting కి. దీనికి మొత్తం మీకు 3 ప్లాస్టిక్ కాన్వాస్ లు పడతాయి అలాగే Lid ప్రిపరేషన్ కి కూడా అయిదు ముక్కలు కావాలి దానికి మీకు 2 ప్లాస్టిక్ కాన్వాస్ లు పడతాయి.

Base కి అయిదు భాగాలూ అన్నాను కదా. ఒకటి కింద Base కి, మిగతా నాలుగు, నాలుగు sides కి. Rectangle బాక్స్ చేస్తే length sizes ఎక్కువ ఉంటాయి, breadth సైజు తక్కువ ఉంటాయి. అలాగే  స్క్వేర్ బాక్స్ చేస్తే అన్ని sizes ఒకేలాగా ఉంటాయి. నేను rectangle బాక్స్ చేశాను కాబట్టి length అండ్ breadth డిఫరెంట్ sizes ఉన్నాయి.
కొలతలు:
ఎప్పుడు కూడా కొలతలు నేను WXH lone ఇవ్వటం జరుగుతుంది.  (width X height)

Bottom or Base:
Base : 68X88 అంటే అడ్డం 68 holes అలాగే నిలువు 88 holes లెక్కపెట్టుకుని కాన్వాస్ ని కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన ముక్కలన్నీ నేను చెప్పిన కొలతలతో holes లెక్కపెట్టుకుని కట్ చేసుకోవాలి.
Length: 88X33 ( measurement తో రెండు pieces కట్ చెయ్యాలి
Breadth: 68X33  ( measurement తో రెండు pieces కట్ చెయ్యాలి)
 Base Length Pieces



 Base Breadth Pieces


    Base Piece

Lid:
Base :70X92
Length : 92X8  ( measurement తో రెండు pieces కట్ చెయ్యాలి)
Breadth: 68X8  ( measurement తో రెండు pieces కట్ చెయ్యాలి)

Base Preparation:
Bottom base ఎప్పుడు కిందకే వుంటుంది కాబట్టి దానికి డిజైన్ అంటూ ఏమి ప్రత్యేకంగా వేయనవసరం లేదు. అలాగే ఖాళీగా షీట్ ని వదిలి వెయ్యఛు. అది మీ ఇష్టం. మిగతా అన్ని అంటే 4 ముక్కలకు మీకు ఇష్టమయిన డిజైన్లు చూసుకుని కుట్టుకోవాలి .దానికి కావాల్సిన కుట్లు మీరు గూగుల్ లో ఎక్కడయినా చూసి నేర్చుకుని  కుట్టుకోవచ్చునా డిజైన్ కుట్టాలి అంటే చాల సింపుల్. Photos లో దగ్గరగా చూస్తే మీకు ఎలా కుట్టాలి అనే విషయం బాగానే అర్ధం అవుతుంది.
     Bottom base అలాగ వదిలి వేసి, Length అండ్ breadth ముక్కలకు designs వేసి పెట్టుకుని ఉండండిఇప్పుడు ఇక వాటిని attach చేసే ప్రక్రియ. కింద చూపించిన ఫోటో లో చూస్తే రెండు ముక్కలు ఎలా attach చేయాలో మీకు అర్ధం అవుతుంది దానిని విప్ stitch  అంటారు. Youtube కి వెళ్లి 'how to join 2 plastic canvas pieces' అని టైపు చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్ధం అవుతుంది . అలా నాలుగు pieces Base కి attach చేసాక మీకు బాక్స్ shape వస్థున్ది.   పైన Edges  ని కూడా ఫినిష్ చెయాలి. దానికి కూడా మీరు విప్ stitch  నే  వాడవచ్చు.
 యిది ఒక లెంగ్త్ piece డిజైన్ అంతా కుట్టిన తరువాత


కుట్టు ఎలా కుట్టాలో ఈ ఫోటో చూస్తే మీకు ardam అవుతుంది


విప్ స్టిచ్ ఎలా కుట్టాలో  కింద రెండు ఫోటోలలో చూడవచ్చు.



విప్ స్టిచ్ తో బాసే ముక్కలన్నీ అతికించినాక  photo లో చూపించినట్లు వస్తుంది


కార్నర్లు attach చేసాక  విధంగా ఉంటుంది

  edges ఫినిష్ చేసాక  విధముగా ఉంటుంది


Lid ప్రిపరేషన్:
Lid ఎప్పుడు కూడా Base కంటే కొంచం పెద్దగా ఉండాలి. అంటే Bottom  పైన lid పెట్టాలి అంటే exact సైజు  పట్టదు కదా. దీనికోసం మీరు Base ఎంత సైజు తీసుకున్నారో నాలుగు వైపులా ఒక కౌంట్ సైజు ఎక్కువ ఉండాలి.
Bottom  Base : 68X88   Lid Base :70X92 రెండు చూస్తే difference  మీకు అర్ధం అవుతుంది.

లిడ్ మొత్తం కుట్టాక లెంత్  సైడ్ ముక్క

లిడ్ మొత్తం కుట్టాక breadth  సైడ్ ముక్క

లిడ్ మొత్తం కుట్టాక టాప్ ముక్క

Lid లో మిగతా నాలుగు ముక్కలు అంత పెద్దవిగా ఉండనక్కరలేదు వాటిని పైన చెప్పిన సైజు లో కట్ చేసి డిజైన్ తో కుట్టుకోండి. తరువాత Bottom లాగానే దీన్నికూడా Whip Stitch తో attach చేసి corner  కూడా attach చేసి, చివరలు ఫినిష్ చేయాలి .


లిడ్ మొత్తం కుట్టాక

అంతే మీ డబ్బా Ready.
ఫోటోలు exact గా ఫాలో అయితే మీకు ఐడియా వస్తుంది. నచ్చిన సైజు లో ఐడియా ని బట్టి  cutting చెసుకొవాలి. Exact గా ఇది అని ఏమి లెదు. కాకపోతే కొంచం స్టడీ చేయనిది మాత్రం అర్ధం కాదు. నేను ఒక ప్రాజెక్ట్ చూసి మొదలి పెట్టి, దానికి చాలా మార్పులు చేర్పులు చేసి, ఒక చోట కాన్వాస్ సైజు సరిపోకపోతే వేరే Piece అతికించి అతికించటానికి ఒక stitch నేర్చుకుని మొత్తానికి  ఫైనల్ గా complete చేశా. అంటే ఏమన్నా తేడా జరిగినా వేరే piece అతికించటానికి కూడా stitch ఉందన్న మాట  :) . 

కింద ఫోటోలలో చూస్తే రెండు ముక్కలు ఎలా అతికించినానో అర్ధం అవుతుంది 


2 comments:

  1. సింపుల్ గా బాగుంది వందన! కలర్ కాంబినేషన్ కూడా బాగుంది.

    ReplyDelete
  2. thanks santhi. yippudu veredi chesthunna. clear gane vundi antava rasindi. ante chusi chesetatlu

    ReplyDelete