అన్నప్రాసన అయిన తరువాత నుండి నెమ్మదిగా దీన్నిపెట్ట వచ్చు. యిది శుభ్రం గా యింటి లోనే తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థములు:
1 కప్పు బియ్యము, 1 / 2 కప్పు కంది పప్పు, 1 / 2 కప్పు మినప పప్పు, 1 / 2 కప్పు సెనగ పప్పు, 1 / 4 కప్పు పెసర పప్పు. పెసర పప్పు ఎక్కువ వాడితే గాసు వస్తుంది అని అంటారు. అందుకు అది ఒక పావు కప్పు చాలు.
తయారు చేయు విధానము:
అన్నిటినీ విడి విడి గా బాండి లో దోరగా వేయించి పెట్టుకోవాలి. యిప్పుడు మిక్సి లో అన్నిటినీ పోసి బరక గా గ్రైన్డు చేయాలి.( మెత్తగా మాత్రము చేయకూడదు). (మెత్తగా చేస్తే వండేటప్పుడు ముద్దలు ముద్దలు గా వస్తుంది.). దీన్నిజల్లెడ పట్టించి ఒక డబ్బాలో పోసుకుని నిలవ చేసుకోవచ్చు.
వండే విధానము:
ఒక గిన్నెలో ఒక చెంచా, పైన చెప్పిన పౌడర్ వేసి దానికి తగ్గ నీరు పోసి pressure cook చేయండి. (మీ పాపాయి వయసుని బట్టి quantity పెంచవచ్చు.) నీరు కూడా మీ పాపాయి కి ఎంత జారుడుగా కావాలో అంత చూసుని పోయండి. (ఎక్కువ నీరు పోసినా మరీ జావ అవుతుంది). ఒకటి రెండు రోజులు అయితే మీకే లెక్క తెలిసిపోతుంది. వండేటప్పుడు ఒక రోజు పాల కూర ఆకులు ఒకటో రెండో, ఒక రోజు క్యారెట్టు ముక్కలు, ఒక రోజు peas , ఇలా వివిధ రకాల కూర ముక్కలు వేసి వండండి. కావాలి అంటే కాస్త ఉప్పు జోడించవచ్చు. యిది వారి వారి యిష్టం.
తప్పకుండా యిది పాపాయి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది. యిది మా అమ్మ మా చిన్నప్పుడు మాకు పెట్టిన అమ్రుతాహారము అని చెప్పాలి. నేను యిది మా అమ్మాయికి 3 , 4 నెలలు పెట్టాను. తరువాత మెల్లగా అన్నము అదీ మొదలు పెట్టవచ్చు. యిప్పుడు మరల మా అబ్బాయికి అన్నప్రాసన అయ్యాక మొదలు పెట్ట వలసిన సమయము వచ్చినది.

No comments:
Post a Comment