Tuesday, December 14, 2010

చిల్లీ మీల్ మేకర్ (సోయా చంక్స్)

ఏమిటి పేరు వినగానే చిల్లీ చికెను లాగా యీ చిల్లీ మీల్ మేకర్ అనుకుంటున్నారా? యిది చూపులకి, అచ్చం అలాగే వుంటుంది. తినటానికి కూడా అలాగే వున్నది అని తిన్న వాళ్ళు చెప్పారు (నాకు నాన్-వెజ్) రుచి తెలియదు కాబట్టి. ఏది ఏమి అయిన యిది వేజిటేరియను, నాన్-వెజ్ తినేవాళ్ళకి చక్కటి స్నాకు అయిటము అవుతుంది.
ఒక సారి మా collegue ఒక ఆమె నేను vegetarian అని, రుచి చూడమని యిచ్చింది. నేను దాన్ని తినటము, నాకు నచ్చటము, వెంటనే రెసిపి అడిగి తెలుసుకుని నోటు చీసుకోవటం అన్ని వరుసగా అయిపోయాయి. రెసిపి తెలుసు కోవటం అయితే తెలుసుకున్నాను కాని దాన్ని యింటిలో ట్రై చెయ్యటం మాత్రం మొన్నే చేసాను. మాకు తెలిసిన

ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని భోజనానికి పిలిచాము. వాళ్ళు పక్క nonvegetarians . అసలు నాన్-వెజ్ వండకుండా ఒక్క రోజు కూడా వుండరు. వీళ్ళ అభిరుచి కి దగ్గరలో ఏది అయిన వండుదాము అని ఆలోచించా, వెంటనే యిది గుర్తుకు వచ్చింది. యింక ఆలోచించకుండా పని మొదలు పెట్టా.
యిది చాలా ఆరోగ్యకరమైన, తేలిక అయిన, రుచి కరమైన , చాల ఫాస్టు గా అయ్యే స్నాకు అని చెప్పవచ్చు.
కావలసిన పదార్థములు:
1 . 1 ప్యాకెట్ 'Nutrela High Protein Soya Mini Chunks ' (మాములుగా మనకి మార్కెట్టు లో ' soya chunks ', 'soya mini chunks ', ' soya granules' అని మూడు రకాలు దొరుకుతాయి.)
2 . అల్లం వెల్లుల్లి పేస్టు
3 . కారము
4 . పసుపు
5 . ఉప్పు
6 . పచ్చి మిర్చి పొడుగ్గా మధ్యకి కోసినవి
7 . కరివేప ఆకు
8 . నిమ్మ రసం
9 . నూనె
తయారు చేసే విధానము:
ముందుగా సోయా చంకులను కాస్త ఉప్పు వేసి నీళ్ళలో ఒక పొంగు రానివ్వాలి. (సోయా చంకులు ఒక 5 నిముషాలు నానితే చాలు అంటారు. కాని నీను మాత్రము ఎప్పుడు ఒక పొంగు రానిస్తాను. అప్పుడే అవి బాగా ఉడికినట్లు గా అవుతాయి. తరువాత వాటిని ఒక గిన్నెలోకి వాడిచి (నీళ్లు పిండండి) (చేతులు కాల్చుకోకుండా చూసుకోండి) అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మ రసం వేసి బాగా పట్టించి ఒక అర గంట, గంట సేపు అలా వదిలేయండి. తరువాత ఒక బాణలి లో 2 ,3 చెంచాల నూనె వేసి అది కాగాక, అందులో, సన్నగా పొడుగ్గా మధ్యకి తరిగిన పచ్చి మిర్చి ముక్కలు, కరివేప ఆకు వేసి చిట పట లాడాక అందులో యీ చంకులు వేసి కాసేపు తిప్పి, దించేముందు నిమ్మ రసం పిండండి.
తప్పకుండా యిది మీకు నచ్చే healthy స్నాకు అవుతుందని నా అభిప్రాయము. మీ కామెంటులు పోస్టు చేయగలరు.

1 comment: