Tuesday, January 18, 2011

నేనూ నా వినాయకుని కలెక్షను

నాకు యీ హాబీ ఎప్పుడు మొదలు అయిందో తెలియదు కాని, నాకు గుర్తు వుండి, ఒకసారి ఎవరో keyboard కీసులతో బొమ్మలు వేయటం, మంచి మంచి quotations రాయటం చూసి నేను వినాయకుడి బొమ్మని keyboard కీసులతో ఎందుకు ప్రయత్నించకూడదు అని అనిపించి వేయటం ప్రారంభించాను. (తరువాత, వెంకటేశ్వర స్వామి, తాజ్ మహల్, చార్మినార్ వంటివి కూడా వేసాను అనుకోండి.) అప్పుడు తట్టింది యీ ఆలోచన. వినాయకుడి విగ్రహాలు వివిధ రూపాలలో ప్రదర్శింప చేస్తారు ప్రతి ఏడాది. రకరకాల ఆకారాలలో, రకరకాల వస్తువులతో, రకరకాల వస్తువుల మీద, రకరకాల మూర్తుల ఆకారాలలో కొలువు తీరుస్తారు. అలా అలోచించి నేను గూగుల్ లో

వెతకటం ప్రారంబించాను. అలా వెతుకుతూ పోతువుంటే నేను అనుకోనివి, నాకు తట్టనివి, అబ్బో యిలా కూడా ఉంటాయ అనేట్లు వుండేవి కొన్ని యిలా చాల రకాలు దొరికాయి. కొన్ని అయితే నాచురల్ గా ఫారం అయినవి. ఉదాహరణకి టమాట ఆకారం లో, బాప్పాయి ఆకారం లో యిలా అనమాట. యింక వివిధ రకాల లోహాలతో చేసినవి, పదాలతో వినాయకుని ప్రతిమలు, ఆర్టిస్టిక్ స్కేచ్చులతో, డాన్సులు చేస్తూ, వాయిద్య పరికరాలతో, zodiac సయినులతో, ఒకటేమిటి రకరకాల ఫోటోలు దొరికాయి. నాకే గొప్పగా యీ ఆలోచన వచ్చింది అనుకుంటే, నన్ను మించి కొంత మంది అయితే వెబ్ సైట్లు కూడా ఓపెన్ చేసారు. మైక్రోస్కోపిక్ ప్రతిమలు బియ్యం గింజల మీద, పెన్సిలు ములుకు మీద యిలా ఒకటి ఏమిటి ఎవరికి తోచినట్లు వాళ్ళు. పూలతో, పళ్ళతో, కొబ్బరి చిప్పలతో, పప్పులతో, ధాన్యాలతో, మోదకము తో, స్టీలు సామానుతో, ఆకులతో, టూతు పిక్కులతో, వీబూదితో చెప్పాలంటే చాల వున్నాయి. కొంత మంది అయితే ఎంబ్రాయిడరీ డిజయినులు, పూసల తో అల్లికలు, ముగ్గులు, వాలు హాన్గింగులు యిలా వారి వారి ఇష్టాలు బట్టి తయారు చేసినవి అబ్బో చాలా రకాలు వున్నాయి. నేను మూడు ఏళ్ళ బట్టి నా కలెక్షను చేస్తున్నాను. దాదాపు ఒక వెయ్యి కి పైగా యిమేజిలు వున్నాయి నా దగ్గర. నేను కాళీ దొరికినప్పుడల్లా యిలా సర్చి చేస్తూనే వుంటాను. ఎప్పుడో కాని, ప్రతీ సారి ఏదో ఒక కొత్తది దొరుకుతూనే వుంటుంది. మరి ఎక్కువగా ఆలోచించటం వల్లనే ఏమో నేను కడుపుతో వున్నప్పుడు కూడా వినాయకుని అష్టోత్తరం చదువుకున్నాను, మా బాబు పేరు లో కూడా 'సిద్ధి' అనే పేరుని జత పరిచాను. నాకు తెలిసి ఒక్క వినాయకుని విగ్రహం తోనే ఇలాంటి అద్భుతాలు సృష్టించ వచ్చునేమో. Already ఉన్నఇమేజిలను కలెక్టు చేస్తేనే నాకు యింత ఆనందము వుంటే, అసలు ఆలోచనలు వచ్చిన వారికి, తయారు చేసిన వారికి, వాటిని సేకరించి నెట్టు లో పెట్టినవారికి నా జోహారు.
వినాయకుడు మా కుటుంబమును అన్ని విధములుగా కాపాడును గాక. జై గణేష్ జీ

3 comments:

  1. కాస్త మీ కలెక్షన్ ఫోటోలు పెట్టండి...

    ReplyDelete
  2. www.myganeshacollection.blogspot.com chudu. yidi naa ganesh exclusive photos blogspot. Yinka velallo vunnayi upload cheyataniki diff vi. stay tuned....

    ReplyDelete