Monday, June 20, 2011

గోధుమ రవ్వ బిసిబెలబాత్

కావలసిన పదార్ధాలు:

గోధుమరవ్వ ఒక కప్పుకందిపప్పు అర కప్పు, కారెట్ ముక్కలు గుప్పెడు, బీట్ రూట్ ముక్కలు గుప్పెడుబటానీలు గుప్పెడు, బంగాళ దుంప ఒకటి, ఉల్లి పాయ ఒకటి, టొమాటో ఒకటి, పచ్చిమిర్చి రెండు, బీన్స్ గుప్పెడు, ఉప్పు, నూనె, బిసిబెలబాత్ పొడిచెంచాలు, కరివేపాకు ఒక రెబ్బ ,వెల్లుల్లి రెబ్బ ఒకటిఆవాలు 1 /4 స్పూను మినపప్పు 1 /4 స్పూను, నూనె రెండు స్పూనులు , పసుపు చిటికెడు, చింతపండు కొంచం, ఎండు మిర్చి రెండు.  


తయారు చేసే విధానం:
రవ్వ, కందిపప్పుఅన్ని కూరగాయ ముక్కలు కలిపి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసి కుక్కరులో ఉడికించాలి. తరువాత ఒక బాణలిలో ఉడికించిన మిశ్రమం వేసి, కొద్దిగా చింత పండు పులుసు, పసుపు, ఉప్పురెండు చెంచాల బిసిబెళ బాత్ పొడి వేసి, కొద్దిగా నీరు పోసి  బాగా తిప్పాలి. విడిగా బాణలి లో రెండు లేక మూడు చెంచాల నూనె పోసి అందులో ఆవాలుమినపప్పుకరివేపాకుఎండు మిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు దంచి వేసి పోపు పెట్టి అందులో వెయ్యాలి.  అంతే నోరు ఊరించే రవ్వ బిసిబెలబాత్ తయార్దీనికి combination అప్పడం లేదా బూంది. 

2 comments:

  1. చదువుతుంటేనే నోరు ఊరుతోంది. చేసి చూస్తాను.

    శాంతి.

    ReplyDelete