Tuesday, August 9, 2011

కీ బోర్డ్ కీస్ తో సృజనాత్మకత

ఇంటర్నెట్టు లో చాటింగ్ అది చేస్తున్నప్పుడు emoticons (emotional icons)  ని సందర్భం బట్టి ఉపయోగించటం, ఎవరన్నా పంపినా వాటిని ఎంజాయ్ చెయ్యటం నాకు ఎందుకో చాలా యిష్టం. 
 యాహూ messenger లోని emoticons చాలా నచ్చుతాయి నాకు. ఎవరినన్నా ఏడిపిస్తూ మాట్లాడేటప్పుడు 'కన్నుకొట్టే ' icon , 'యిది రహస్యం' అని చెప్పటానికి ఒకటిఇలాగ మన emotions కి
Ganesh made with Keyboard keys

 
అనుగుణంగా భలే డిజైన్ చేసి ఉంచారు. మొదట్లో అవి ఎలా వున్నాయో as it is గా అలా send చేసేదాన్నితరువాత తెలిసింది కీ బోర్డు లో ఉన్న కీస్ ద్వారా అవి డిజైన్ చేసారు



Balaji Made with Keyboard keys
అని.  అలానే మెయిల్స్ లో వాటిల్లో ' :)' అని పెడితే 'నవ్వు మొహంఅని, ':-c ' అంటే 'కాల్ మీ' అని యిలా అన్నికీ బోర్డు కీస్ తోనే చేయబడినవి అని అర్ధం అయింది. యింక అలా ఆలోచిస్తూ వుంటే ఒక ఐడియా వచ్చింది నాకు. కీ బోర్డు కీస్ ను వాడుతూ సరదాగా కొన్ని బొమ్మలు సృష్టిస్తే ఎలా వుంటుంది అనిపించింది. ఆలోచన రావటం ఆలస్యం యింక మొదలు పెట్టా.
Lord Venkateswara Swamy Made with Keyboard symbols
                             నా అనుభావపూర్వంకం గా నేను తెలుసుకున్నది ఏమిటి అంటే ఎక్కువగా మనం ఉపయోగించే కీస్ '(',  ')',  '/', '\',  '|' యివియింక మిగతా కేరెక్టర్ కీస్ మన అవసరాన్నిబట్టి వుంటుంది అంతేఅల్ఫాబేట్ కేరెక్టర్స్, నంబరు కేరెక్టర్స్ వాడకం తక్కువ అనే చెప్పాలి.
Charminar made with Keyboard keys
                
                                            
                            నా సృజనాత్మకతను యోగించి సృష్టించినవి కొన్ని యిందులో పొందుపరుస్తున్నాను. మొదటగా నేను వేసినది నాకు యిష్టం అయిన దైవం వినాయకుడిది. తరువాత వెంకటేశ్వరస్వామి వేసాను. (వేసాను అనాలో, లేక గీశాను అనాలో, లేక కొత్త పదం వేరే ఏమి అయిన సృష్టించాలో తెలియటం లేదు). యింకా తరువాత 'తాజ్ మహల్', 'చార్మినార్' యిలా కొన్ని రకాలు వేసాను.
TajMahal made with Keyboard symbols

                              చూసి ఎలా వున్నాయో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయగలరు. పోస్టు ని ఎప్పటికప్పుడు update చేస్తూ వుంటాను కొత్త ప్రయోగము చేసినప్పుడల్లా.


4 comments:

  1. చాలా బావున్నాయి.
    మీశీర్షిక తెలుగులో రాస్తే చక్కగా ఉంటుంది.

    ReplyDelete
  2. నేను రాసిన వ్యాసం అలాంటిది అండి. అచ్చ తెలుగు లో 'internet ', 'emoticons' లాంటి పదాలు ఎలా వాడాలో నాకు తెలియదు. గూగుల్ లో వాటికి అచ్చ తెలుగు అర్ధం వెతికి రాసినా, చదివే వాళ్లకి అర్ధం కాదు.
    నా బొమ్మలు బాగా వున్నాయి అని చెప్పినందుకు థాంక్స్.

    ReplyDelete
  3. hi!Vandana

    Nee patience, interest and creativity.........really appreciated. Congratulations.

    ReplyDelete