Monday, November 7, 2011

చిట్కా లిస్టు 4

1. బిస్కట్టులు నిలవ చేసే డబ్బాలో అడుగున ఒక blotting పేపరు వేస్తే, బిస్కట్టులు తాజాగా వుంటాయి.
2.      అరటిపండును చిదిమి కాలిన గాయాలకు రాస్తే కూలింగ్ ఎఫ్ఫెక్ట్ యిస్తుంది.
3.      1 pinch chewing tobacco , ఒక చుక్క నీళ్ళు కలిపి, తేనెటీగ కాని తేలు కాని కుట్టిన ప్రదేశం లో వెంటనే కనుక పెట్టి, బ్యాండ్ ఎయిడ్ తో కవర్ చేస్తే, నొప్పి కొద్ది నిమిషాలలో తగ్గిపోతుంది.
4.      Celery ని అల్యుమినియము ఫాయిలు లో చుట్టి ఫ్రిజ్జి లో పెడితే ఎక్కువ రోజులు వుంటుంది.
5.      వంటగది మూలలలోఇంకా బొద్దింకలు తిరిగే చోట కాస్త బోరిక్ పౌడరు చల్లితే వాటి బెడద తీరుతుంది.
      6.   Dry Fruits తేలికగా కోయాలి అంటే ఒక అర గంట పాటు వాటిని ఫ్రిజ్జి లో పెట్టి, తరువాత వేడి కత్తితో (వేడి నీళ్ళలో ముంచిన కత్తికోస్తే తేలికగా, వేగంగా కోయవచ్చు.
      7.   చపాతీ పీటకి పిండి అత్తుక్కుని తీయటానికి రాకుండా వుంటే కాసేపు ఫ్రిజ్జి లో పెట్టి తియ్యండి.
     8. గుడ్డు తాజాదో కాదో తెలుసుకోవాలి అంటే చల్లటి ఉప్పు కలిపిన నీటిలో వేసి చూడండి. అది మునిగితే తాజాది అని  అర్ధం పైకి తేలితే పాతది, పాడు అయినది అని అర్ధం.

      9. ఇడ్లీదోశలు పిండి పులవకుండా వుండాలి అంటే పిండి పైన ఒక తమలపాకు వేసి చూడండి.
    10. పళ్ళు త్వరగా పండాలి అంటే, ఒక న్యూస్ పేపరులో చుట్టి వెచ్చని ప్రదేశం లో రెండు,మూడు రోజులపాటు వుంచండి. అందులో నుండి వెలువడే Ethylene గ్యాస్ పళ్ళను పండేలా చేస్తుంది.
     11. నిమ్మకాయ గట్టిగా వుంటే ఒక 5 -10 నిమిషాలు గోరువెచ్చని నీటిలో వుంచి అప్పుడు నిమ్మ రసం తీయండి.
     12. నెమలి ఈకను వేలాడ కడితే, బల్లులు మీ యింటి నుండి పారిపోతాయి.
     13. పాలు అడుగంటకుండా వుండాలి అంటే మరిగేటప్పుడు ఒక స్పూను ను అందులో వేసి సిమ్ము లో పెట్టాలి.
     14. పాలు మరిగేటప్పుడు ఒక అరస్పూను sodium bicarbonate వేస్తే పాలు ఫ్రిజ్జి లో పెట్టకపోయినా కూడా పాడు కావు.
     15. Mixer/Grinder బ్లేడులు పదునుగా వుండాలి అంటే నెల కి ఒకసారి ఉప్పు వేసి grind చేస్తూ వుంటే సరిపోతుంది.
     16. కొన్ని పచ్చకర్పూరం బిళ్ళలు ఒక కప్పు నీళ్ళలో వేసి దోమలు వున్న చోట కానిబెడ్ రూము లో మీ మంచం దగ్గర కాని పెడితే దోమలు పారిపోతాయి.      17. ఉల్లిపాయను ఒక్కోటి విడివిడిగా న్యూస్ పేపరులో చుట్టిచీకటిగా, చల్లగా వున్న ప్రదేశం లో పెడితే చాలా కాలం తాజాగా వుంటాయి
     18. పనీర్ ను blotting paper లో చుట్టి ఫ్రిజ్జి లో పెడితే ఫ్రెష్ గా వుంటుంది
     19. అప్పడాలు పోలితిన్ షీట్ లో పెట్టి, పప్పు డబ్బాలలో కాని బియ్యం నిలవ చేసే డబ్బాలో కానీ పెడితే అవి ఎండిపోకుండా, విరగకుండా వుంటాయి.
     20. మొక్క జొన్న గింజలను ఫ్రీజేర్ లో పెట్టి, అలా చల్లగా ఉండగానే వేయిస్తే పాప్ కార్న్ పెద్దగా బాగా వస్తుంది.
     21. ఉప్పును ఫ్రీజేర్  లోపల భాగం లో రుద్దినట్లు అయితే ఐసు ఎక్కువ కట్టకుండా అరికట్టవచ్చు.  
     22. 1kg బియ్యానికి 5 grams పుదినా ఆకులు వేస్తే పురుగు పట్టదు. లేదా ఒక పేపరు ప్యాకెట్ లో కొంత బొరిక్  పౌడర్ వేసి బియ్యం డబ్బాలో వేసినా పురుగు పట్టదు.
    23. మరుగుతున్న నీళ్ళలో 5-10 minutes టొమాటోలు వేస్తే తోలు తీయటం తేలిక అవుతుంది
    24. బాగా పండిన టొమాటో లను ఉప్పు వేసిన చల్లని నీళ్ళలో ఒక రాత్రి మొత్తం ఉంచితే అవి తాజాగా అవుతాయి.
     25. సింకు బ్లాక్ అయితే 1/2 cup sodium bicarbonate ను ఒక కప్పు వెనిగర్ తో కలిపి సింకు లో పోసి, తరువాత ఒక కప్పు నీళ్ళు పోయండి. ఒక గంట తరువాత మీ drain pipe తెరుచుకుంటుంది.  
     26. వేప ఆకులు కాని, పసుపు కొమ్ముల ముక్కలు కాని, వెల్లుల్లి రెబ్బలు కాని, ఎండు మిరప కాయలు కాని బియ్యం, పప్పు నిలవ చేసే డబ్బాలో వేస్తే పురుగులు దరి చేరవు.     27. టీ, కాఫీ మరకలు పోవాలి అంటే, మరకలను ఉప్పు తో రుద్ది కడిగితే ఫలితం వుంటుంది.
     28. ఒక కప్పు ఉప్పు, ఒక కప్పు బేకింగ్  సోడా ను సింకు లో వేసి తరువాత మరిగేనీళ్ళు  పోస్తే drain శుభ్రం అవుతుంది.
     29.. గుడ్డు నేల మీద పడి పగిలితే, దాని మీద ఉప్పు చల్లి ఒక రెండు నిమిషాలు వదిలి, తరువాత tissue పేపర్ తో తుడిస్తే సరిపోతుంది.      30. ఉప్పు నీళ్ళతో గాజు సామానులు కడిగితే బాగా  మెరుస్తాయి.
     31. జీలకర్ర, లవంగాలు యిలా ఏది అయిన దినుసులు పౌడర్ చేసే ముందు కాస్త వేయించి పొడి చేస్తే తొందరగా, చక్కగా పొడి అవుతాయి.
     32. చపాతి పిండి పొడిగా అవ్వకుండా వుండాలి అంటే పిండి మీద తడి గుడ్డ పెడితే సరి.
     33. పనసకాయ కోసేటప్పుడు చేతికి నూనె రాసుకుని కోస్తే ఆ జిగురు చేతికి అంటదు.
     34.. అరకప్పు నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం పిండి పుక్కిలిస్తే నోటి దుర్వాసనలు రావు.
     35. తులసిరసం లో తేనె కలిపి తీసుకుంటే దగ్గుకి తక్షణ ఉపశమనం చేకూరుతుంది
     36. సెనగపిండి లో రెండు చెంచాల నెయ్యి వేస్తే మెరపకాయ బజ్జీలు కరకరలాడుతూ రుచిగా వుంటాయి.   
     37. కార్పెట్ మిద మొక్కజొన్న పిండి చల్లి తరువాత వేక్క్యూము క్లీనేర్ తో సుభ్రపరుస్తే కొత్తదానిలా కనిపిస్తుంది.  
     38.  సగ్గుబియ్యం వడియాలు పెట్టేటప్పుడు సగ్గుబియ్యం ఉడికాక అందులో కొంచం మజ్జిగ కలపండి. వడియాలు తెల్లగా వస్తాయి మంచి రుచిగానూ వుంటాయి.
     39. కర్పూరం నిలవ చేసే డబ్బాలో మిరియాలు వేసి ఉంచితే కర్పూరం త్వరగా కరిగి పోకుండా వుంటుంది.
     40. రెండు చెంచాల సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు నాననిచ్చితరువాత ఒక అయిదు నిమిషాలు ఉడికించి అందులో కాస్త పంచదార, ఉప్పు వేసుకుని కొన్ని రోజుల పాటు తీసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది.
     41. తేనె చిక్కపడితే సీసా ని వేడి నీటిలో వుంచి చూడండి
   42. గోరింటాకు మరకలు పడిన బట్టలను పాలలో నానపెట్టి ఉతికితే మరకలు యిట్టే మాయమవుతాయి.  
43.  బాగాపండిన అరటి పండు గుజ్జును పాదాలకు మర్దనా చేసి ఒక అరగంట అయ్యాక కడిగివెయ్యాలిరోజు యిలా చేస్తూ వుంటే కాళ్ళ పగుళ్ళు తగ్గుముఖం పడతాయి.
      44. రోజు రాత్రి పూట పాదాలను బాగా కడిగితడి తువాలు తో తుడిచి వంట నూనె రాస్తే మరునాటికి పాదాలు మృదువుగా తయారు అవుతాయి.
      45. గులాబి నీళ్ళు, glycerine సమ పాళ్ళలో తీసుకుని కాళ్ళ పగుళ్ళకి ఒక పదిహేను రోజులు రాస్తే, కాళ్ళ పగుళ్ళ సమస్య తీరుతుంది.  
     46. కొబ్బరి నూనెలో రెండు కర్పూరం బిళ్ళలను అరగదీసి తలకు పట్టిస్తే పేల సమస్య తీరుతుంది.
     47. చపాతీలు రెండు రోజుల వరకు పాడుకాకుండా వుండాలి అంటే పిండి ని నీళ్ళకి బదులు కొబ్బరి నీళ్ళు పోసి కలపండి.
     48. పెరుగు పావుగంట లో తోడుకోవాలి  అంటేగోరువెచ్చని పాలలో తోడు వేసి  గిన్నె పైన మూత పెట్టి కుక్కరు లో అడుగున నీరు పోసి  గిన్నెను దాని లో పెట్టి మూతపెట్టి ఒక whistle రానివ్వాలియిలా చేస్తా పావు గంట లో పెరుగు  తోడుకుంటుంది.  
     49. అన్నం వండేటప్పుడుబియ్యం లో ఒక చిన్న దాల్చిన చక్క ముక్క వేసి వండినట్లు అయితేషుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ లో వుంటాయిట.          50. Instant Lemonade కావాలి అంటే, ముందుగా నిమ్మ రసం తీసి, అందులో షుగర్, ఉప్పు వేసి కలిపి, ఐస్ cubes లో పోసి వుంచినట్లయితే, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.

2 comments: