Authentic food లో ఇండియన్, mexican తరువాత నేను వేసే ఓటు Thai ఫుడ్ కే. తరువాతే chineese అయినా, అమెరికన్ అయినా లేక ఇటాలియన్ అయినా. Vegetarians కి అక్కడ పెద్ద choice అంటూ ఏమి వుండదు. నా మటుకు నాకు ఉన్న ఒకే ఛాయస్.... Thai Vegetable Basil Fried Rice . సాధారణం గా ఈ
chineese , Thai Vegetable Fried Rice లలో ఎగ్, ఫిష్ సాస్ , Oyester సాస్ తప్పకుండా వేస్తారు మనం వద్దు అని చెప్పకపోతే తప్ప . నా మటుకు నేను మాత్రం వెళ్ళగానే 'విత్ నో ఎగ్, నో ఫిష్ సాస్ , నో Oyester సాస్ అని తప్పకుండా చెప్తాను. సరే యిక నాకు నచ్చిన ingrediants తో నేను ట్రై చేసిన Thai Vegetable Basil Fried Rice కి సంబందించిన విషయానికి వస్తే.... ( కావలసి వస్తే పైన నేను 'నో' అని చెప్పబడిన వాటితో కూడా మీరు మీ వెర్షన్ రెసిపి ట్రై చేసుకోవచ్చు. )
chineese , Thai Vegetable Fried Rice లలో ఎగ్, ఫిష్ సాస్ , Oyester సాస్ తప్పకుండా వేస్తారు మనం వద్దు అని చెప్పకపోతే తప్ప . నా మటుకు నేను మాత్రం వెళ్ళగానే 'విత్ నో ఎగ్, నో ఫిష్ సాస్ , నో Oyester సాస్ అని తప్పకుండా చెప్తాను. సరే యిక నాకు నచ్చిన ingrediants తో నేను ట్రై చేసిన Thai Vegetable Basil Fried Rice కి సంబందించిన విషయానికి వస్తే.... ( కావలసి వస్తే పైన నేను 'నో' అని చెప్పబడిన వాటితో కూడా మీరు మీ వెర్షన్ రెసిపి ట్రై చేసుకోవచ్చు. )
కావాల్సిన పదార్దాలు:
సోనమసూరి బియ్యం రెండు కప్పులు, బెల్ పెప్పర్ (గ్రీన్, రెడ్, ఎల్లో) మూడు రంగులలో తీసుకుంటే చూడటానికి అందం గా కనపడుతుంది, Thai Basil leaves (యిది ఒక bunch పడుతుంది. మామూలు అమెరికన్ గ్రోసెరీ లో కంటే కొరియన్ లేదా chineese గ్రోసెరీ లో బాగా దొరుకుతుంది.)
నువ్వుల నూనె (ఈ రెసిపి కి తప్పకుండా నువ్వల నూనె వాడి తీరాలి), రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ (ఎండుమిర్చి ఒకసారి వేయించి మిక్సీ కొడితే సరిపోతుంది. లేదా ఎప్పుడయినా పిజ్జా హట్ కి వెళ్ళినప్పుడు ఒక నాలుగు రెడ్ పెప్పర్ పాకెట్స్ తీసుకొచ్చి స్టోరు చేసుకున్నట్లు అయితే యింట్లో కోరు పెట్టె బాధ తప్పుతుంది. నేను అయితే అదే చేస్తాను, మీకు అదే చేయమని చెప్తాను), పచ్చి మిర్చి మూడు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు, ఉప్పు తగినంత, అజినమోతో చిటికెడు, సోయా సాస్ తగినంత.తయారు చేసే విధానం:
1 . ముందుగా ఒకటికి రెండు చొప్పున నీరు పోసి అన్నం ఉడికించి పెట్టుకోవాలి.
2 . ఒక చిన్నపాటి రోకలి తీసుకుని వెల్లుల్లి, పచ్చి మిర్చి ముక్కలను బాగా దంచి పెట్టుకోవాలి.
3. వెడల్పాటి పాన్ తీసుకుని, అందులో మూడు చెంచాల నువ్వుల నూనె వేసి, అది కాగాక, పచ్చిమిర్చివెల్లుల్లి దంచిన మిశ్రమం వేసి, అది వేగాక రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ వేసి కాసేపు వేగనివ్వాలి. ఈ పాటికే మీకు Thai వాసనలు వచ్చేస్తుంటాయి.
4 . ఇప్పుడు సన్నగా, పొడుగ్గా తరిగిన బెల్ పెప్పర్ ముక్కలు వేసి ఫ్ర్య్ చేయాలి. యిక్కడ గుర్తు పెట్టుకోదగిన విషయం ఏమిటి అంటే.... ముక్కలు పచ్చి వాసన పోయి క్రిస్పి గా తయారు అవుతే చాలు, బాగా వేగనక్కరలేదు.
5 . ఇందులో కాస్త ఉప్పు, అజినమోతో వేసి బాగా కలిపి, తరువాత మూడు చెంచాల సోయా సాస్ వేసి కలపాలి.
6 . దీనిలో తరిగిన basil ఆకులను వేసి బాగా కలిపి, ఉడికించిన అన్నం కూడా వేసి బాగా కలపాలి.
7 . చివరగా ఒక సారి ఉప్పు, సోయా సాస్, నూనె చూసుకుని తక్కువ అయితే మరల కొంచం వేసి కలుపుకోవాలి. కారం తక్కువ అయింది అనిపిస్తే రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ దానిపై చల్లుకోవచ్చు.
ఇది మీరు వేడి వేడి గా తింటేనే ఆ రుచి ఎంజాయ్ చేయగలరు. చాలా తేలికగా చేసుకోవచ్చు. అన్నం వండి పెట్టుకుంటే, ప్రాసెస్ చాలా సులభం. వీటికి కావాల్సిన వస్తువులు కూడా తక్కువే. యిందులో ప్రత్యేకం గా గుడ్డు, ఉల్లిపాయ కావాలి అనుకునేవారు విడిగా పాన్ తీసుకుని అందులో ఒక రెండు చెంచాల నూనె పోసి, కాగాక, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లి పాయ ముక్కలు వేసి ఫ్ర్య్ చేసి, ఒక గుడ్డు దానిలో కొట్టి, కాస్త ఉప్పు చల్లి, ఫ్రైడ్ రైస్ లో కలిపితే ఆ flavour డిఫరెంట్ గా వుంటుంది. అలాగే మన ఇష్టాన్నిబట్టి brocali కూడా వాడుకోవచ్చు. brocali ముక్కలను ఒకసారి కడిగి మైక్రో వేవ్ ఓవెన్ లో ఒక అయిదు నిమిషాలు వుంచి అప్పుడు కూర ముక్కలతో సహా వేయిస్తే సరిపోతుంది. ఉల్లిపాయ యింక గుడ్డు మాత్రం కూర ముక్కలతో పాటు కాకుండా విడిగా చేస్తేనే బాగుంటుంది.
తప్పకుండా ఈ రెసిపి మీరు మీ ఇంట్లో నే ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
i just tried it vandana. baga vachindi. thanks for the recipe.
ReplyDeleteThank you andi Anonymous garu :)
ReplyDelete