Friday, September 7, 2012

Beware of these people and Be away to these people



 ఎప్పుడూ మంచి వ్యక్తుల గురించే కాకుండా అప్పుడప్పుడూ మన చుట్టూ వుండే యితర వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోకపోతే మనం లోకం పోకడ తెలియక, ఒకవేళ అలాంటి అనుభవం ఏమన్నా వచ్చినప్పుడు ఏమి సమాధానాలు చెప్పాలో తెలియక బాధ పడేకంటే ముందుగానే prepared గా ఉండమని చెప్పటానికి నా అనుభవం లో జరిగినవి కొన్ని మీ ముందు ఉంచుదామని నా ప్రయత్నం.

         కొంతమంది కి వూరికే పక్కన వాళ్ళని చూసి వ్యంగ్యం గా మాట్లాడటం, వాళ్ళని చూసి నవ్వటంవెకిలి వేషాలు వేయటం ఇలాంటివి చేయటం చాలా యిష్టం. అలాంటివాటి లోనే వాళ్ళ ఆనందాన్ని వెతుక్కుంటారుఅలాంటివి కొన్ని ఈమధ్య నాకు ఎదురు అయినవి మీ ముందు ఉంచుతున్నాను.


(1) మా వారు ఆఫీసు లో అవార్డు విన్ అయి దానిలో భాగం గా Poterico వెళ్ళటం జరిగిందికంపెనీ వారు విన్ అయిన వారికివారి spouse కి మాత్రమె sponsorship యిచ్చారు. పిల్లలు నాట్ allowed అని చెప్పటం తో (మాకు చిన్నపిల్లలు కావటం తో) అసలు ఏమి చేయాలో తెలియని సందిగ్దం లో పడ్డాం. యిద్దరు ముగ్గురు స్నేహితులు పాపం వాళ్ళ దగ్గర పిల్లలని ఉంచుకుంటాము అని ఆఫర్ యిచ్చినా మొదట ఉంచుదాము అనిపించినా తరువాత పని చేయలేదుఆయన  ఒక్కరు వెళ్లి వచ్చారు. యిక మొదలు చూడండి.....'అదేంటి మీరు పిల్లలని వదిలి వెళ్దాము అనుకున్నారా?, అలా ఎలా వెళ్తారు?' అని ప్రశ్నలు.  సరే వెళ్ళలేదు అని తెలిసాక 'మిమ్మల్ని వదిలి ఆయన ఒక్కరే ఎలా వెళ్లారు? 'అమ్మో మా ఆయన అయితే అలా చేయరు' అంటూ దీర్గాలు. నేను వెంటనే అన్నాను ‘మీ కంపెనీ లో యిలా అవార్డ్స్ ఇవ్వరా లేక మీ ఆయనకి రాలేదా?  మీ ఆయనకు రాలేదు కదా అందుకే నీకా సమస్య రాలేదు లే’ అని. బేసిక్ గా వీళ్ళు మేము ఎవ్వరము వెళ్ళకుండా ఉండి ఉంటే హ్యాపీ గా వుండేవారు. అసలు అవార్డు రాకపోతే యింకా హ్యాపీ అనుకోండి :)

(2) ఉద్యోగ రిత్య మావారికి నెలలో ఒకటి, రెండుసార్లు ఊర్లు తిరగటం అలవాటు. సోమవారం meetings ఉంటే, వెళ్ళే చోట చుట్టాలు కానీ, స్నేహితులు కానీ ఉంటే వీకెండ్ అక్కడే గడిపేట్టు ప్లాన్  చేస్తారుఇక  'మీ ఆయన అలా  మిమ్మల్ని వదిలి వీకెండ్ ఎలా వెళ్తారు? సోమవారమే వెళ్లి వచ్చేయచ్చు కదా? ' అంటూ అండి. వాళ్ళని ఏమన్నా సహాయం అడిగామ ఎందుకండి అనవసరపు ఆరాలు?

(3) మా బాబు పుట్టాక వాడికి ఏడాదిన్నర వచ్చేదాకా మా అత్తగారు, అమ్మ ఒకళ్ళ తరువాత ఒకళ్ళు వచ్చి ఉండటం జరిగింది . ఇక చూసుకోండి ' మీకయితే ఎవరో ఒకళ్ళు వస్తారుఏడాదిన్నర పాటు మీరు ఆలోచించుకోకుండా, మాకు ఎవ్వరు రారు అంటూ దీర్గాలు.... ఈ బాపతే వచ్చిన వాళ్ళవాళ్ళని వీసాలు expire అయినా సంవత్సరం పాటు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. మరి మాటో?

(4మా మేనేజర్ క్రిస్మస్ పార్టీ కి కిడ్స్ నాట్ allowed అని చెప్పటం తో నేను మా వారు మాత్రమే పార్టీ కి వెళ్ళాం ( మా అత్తగారి దగ్గర పిల్లలను వదిలి) పార్టీ కూడా కేవలం రెండు గంటలు మాత్రమే.  'పిల్లలని వదిలి ఎలా వెళ్లారు? అమ్మో మేము అయితే అస్సలు వెళ్ళం' అంటూ మళ్ళా మొదలు. నేను వెంటనే అన్నా 'ఉద్యోగానికి పిల్లలని వదిలి ఎలా వెళ్తున్నావు అని' అది వేరు ఇది వేరు . మహాతల్లె చంటిపిల్లని వాళ్ళ ఆయన దగ్గర వదిలి మూడు వారాలు ఉద్యోగం కోసం వేరే ఊరు వెళ్లి ఉంది మరి మాటో అదే అడిగితే అది ఉద్యోగంట ' తన దాక వస్తే ఏది అయినా చెప్తారు ఏది అయినా నడుస్తుంది ఏదో సామెత చెప్పినట్లు....' అదే మనము పిల్లను వదిలి వేరే ఊరు వెళ్ళామా అంతే మీకు బోర్డు తగిలించేస్తారు పిల్లలని చూసుకోలేని తల్లిగా యింకా ఏమన్నా ఉంటే అది కూడా

    (5ఇక బేబీ సిట్టింగ్ దగ్గర అండి....దీనికి అసలు అంతం లేదురోజు ఏదో ఒకటి.... ' మీ అబ్బాయిని ఎక్కడ పెట్టారుఎంతఅమ్మో మేము అక్కడ పెట్టం. ఎంత మంది ఉంటారు అక్కడ? మేము అంత మంది ఉంటే పెట్టంమా బేబీ కి attention  కావాలి. మాకు అయితే ఇంటికి వస్తేనే బెటర్అయినా అంత మందిని ఎలా చూస్తారు?' అని. ఎవడు పెట్టమన్నాడు వాళ్ళని మేమేమి అనలేదు కదా నీకు కావాల్సిన చోటే పెట్టుకో, లేకపోతే ఇంటికే తెప్పించుకో ఎవడు కాదన్నాడు. అంతే కాని నేను ఎక్కడ పెడితే నీకేంటి? అక్కడ మేము పిల్లలని గాలికి వదిలి వేసినట్లు మాట్లాడటం. ఇంతా చేస్తే కనీసం ముగ్గురు పిల్లలు కూడా ఉండకూడదు అట. మరి బయట డే కేర్ లో ఒక్కో మనిషి దగ్గర ఏవరేజ్ న ఎనిమిది మంది దాకా ఉంటారు. అంటే బయట పెట్టేవాళ్ళు అంతా అసలు పిల్లలని కేర్ చెయ్యరు అనా లేక యింట్లో స్పెషల్ గా పెడితేనే వాళ్ళు బాగా చూసుకుంటారు అనా? నీ ఆలోచనలు నీకు ఉండవచ్చు. తప్పేమీ లేదు. నీ పిల్లలు నీ కేరింగ్ అది నీ యిష్టం. నీ మనసులో నువ్వు వెయ్యి అనుకో వేరే వాళ్ళ గురించి, అంతే కాని వేరే వాళ్ళ దగ్గరకు వచ్చి అందులోను ఇలాంటి సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడటం ఎంతవరకు సమంజసం చెప్పండి? చదువు ఉద్యోగం, డబ్బు సంపాదించటానికి మాత్రమే కాదండి, కూసింత జ్ఞానం, బుద్ది కూడా నేర్పాలి.  
      
            ఒకటి అండి మాట్లాడేటప్పుడు మెదడు కంటే నాలుక ముందు మాట్లాడకూడదు. మాట్లాడేముందు ఎలా మాట్లాడాలి, మనము మాట్లాడే దానిలో సెన్స్ వుందా, మనం మాట్లాడే మాటలు పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయా లేదా అనేవి మనం గ్రహించుకూవాలిమనం ఏమి చిన్న పిల్లలం కాదు కదండీ టక్కున అనేయటానికి. దేశాలు దాటి వచ్చి ఉద్యోగాలు కూడా చేస్తున్నాము. మాత్రం తెలిదా అంటే తెలుసు కావాలనే అలా అంటారు. సో వాళ్ళకి తెలియచెప్పాల్సిన బాధ్యత మనమీదే ఉంది. atleast మనలని మనం కాపాడుకోవటం కోసమో లేక వారు మనమీదకు రాకుండా చేయటం కోసమన్నా మనం వాళ్లకు తెలియచెప్పాల్సిన
 అవసరం ఉంది. వాళ్ళు అన్న మాటలే మనము మార్చకుండా అలా వాళ్ళనే సమయం వచ్చినప్పుడు తిప్పి అడిగితే వాళ్ళ reaction చూడాలి. తప్పకుండ అర్ధం అవుతుంది పైన. నేను అడిగి చూసాను కూడా.

             మనుషుల ఫీలింగ్స్, వాళ్ళ nature కూడా చూసి మాట్లాడాలి. ఏది ఏమి అయిన భరించటం, మొహమాట పడి వాళ్ళు అడిగే వెకిలి ప్రశ్నలకి డిఫెన్సు లోకి వెళ్లి సమాధానం చెప్పి encourage చేయటం లాంటి వి మానుకుని గట్టిగ తిప్పి పెట్టటం, లేదా నాకు నచ్చలేదు అనిచెప్పటం, అసలు అన్నిటికన్నా ఉత్తమం వాళ్ళ దగ్గరకు వెళ్లకపోవటం. కొన్నాళ్ళకు వాళ్ళే గ్రహిస్తారు. మాటలు తగ్గిన పర్లేదు మన మనసులు ప్రశాంతంగా వుండాలి. అలాంటి వాళ్ళ స్నేహం ఎందుకండి. ఊరికే బాగుండదు యిరుగు పొరుగు అని మనమే కాదు వాళ్ళు అనుకోవాలి. మారి మంచిగా మారార మంచిది లేదా మాటలు తగ్గాయా మరి మంచిది. శుభం కార్డు వేసేసుకోవచ్చు వాళ్ళ తో....

            చివరగా నా సలహా ఏమిటి అంటే మిమ్మల్ని ఎవరయినా ఇలా యిబ్బందికరమయిన
మీకు నచ్చని ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాళ్ళను ఎంకరేజి చేస్తూ మొహమాటం తో ఓపికగా సమాధానాలు చెప్పి వారిని ఇంకా ప్రశ్నలు అడిగేలా ఛాన్స్ ఇవ్వకుండా ఆది లోనే తున్చేయటం మంచిది. వీటి వల్ల ఊరికే మనసు పాడు అవటం తప్ప ఏమి ఉండదు. లేదా చివరికి మాటలు కట్ అవ్వటం దాక కూడా వెళ్ళవచ్చుఇవి ఏవి జరగకుండా ఉండాలి అంటే ముందే వారికి 'పర్సనల్ విషయాలు ఎందుకులెండి' అనో లేక మీకు సమాధానం చెప్పే తెలివి తేటలు ఉంటే రివర్స్ లో వాళ్ళు మళ్ళ ప్రశ్నలు అడగకుండా ఎలా తిప్పి పెట్టాలో నేర్చుకోవటం లాంటివి చేయండి. వాళ్ల ప్రశ్నలు మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఇది నా స్వానుభవం. నేను నేర్చుకున్న గుణపాఠం. మీరు తప్పు చేయకుండా చూసుకోండి.




2 comments:

  1. hey vandana, pleasantly surprised to see you here,,Lasya and Mihir picture choosi..are maa vandana ne anukunnanau .Very nice..I check them once in a while..I am very fascinated to write but I never started...

    You are writing very nice...keep it up and all the best...

    ReplyDelete
  2. Hi Vandana,
    Mee blog chadiva .. antha naku kallaku kattinattu kanipinchindi. Thanks for this blog. nenu kuda chala nerchukovali, ela nenu vetakarapu manushulanu reverse lo punch ivvala ani

    take care
    bye
    Kameswari Ch

    ReplyDelete