Black heads అనేది చాలా కామన్ సమస్య అయిపోయింది ఈ రోజుల్లో. మార్కెట్లలో వీటి విముక్తి కోసం చాలానే వస్తున్నాయి. కొన్ని పని చేస్తాయి, కొన్ని చేయవు. అది కూడా కాకుండా అవి చాలా ఖరీదు కూడా. ముఖ్యం గా Biore బ్రాండ్ strips చాలా వాడకం లో ఉన్నవే అయినా చాలా expensive అవి.
చిన్న బాక్స్ మీకు పది డాలర్ల దాక పడుతుంది.
అందులో ఒక పది స్త్రిప్స్ దాక వుంటాయి. అంటే Average న ఒక స్ట్రిప్ మీకు ఒక డాలరు పడుతుంది. అదీ కాక ముక్కుకి కింద భాగం లో పెట్టటానికి ఆ స్ట్రిప్ అంత తేలికగా పని చేయదు.
దీనికి ఒక సులువయిన మార్గం అలాగే డబ్బు తక్కువ అయ్యే మార్గం ఒకటి తెలుసుకున్నాను. దీనికి మనం మాములుగా జెల్లీ చేసుకోటానికి వాడే gelatin పౌడర్, పాలు వుంటే చాలు. నేను అయితే Knox బ్రాండ్ వాడతాను. ఇది మీకు ఏ అమెరికన్ స్టోర్స్ లో అయినా దొరుకుతుంది. ఏ gelatin బ్రాండ్ అయిన ఉపయోగించవచ్చు. మొత్తం బాక్స్ డాలరు కన్నా వుండదు. మహా అయితే రెండు డాలర్లు.మామూలుగా ఒక knox gelatin బాక్స్ లో ఒక నాలుగు లేక అయిదు పాకెట్స్ ఉంటాయి. ఒక ప్యాకెట్ మీకు దాదాపు పదిహీను నుండి ఇరవయి సార్ల దాకా రావచ్చు (ఒక ముక్కుకే వాడితే) ఇంకా ఎక్కువ సార్లు కూడా రావచ్చు. అలా ఒక బాక్స్ మీకు 60 కంటే ఎక్కువ సర్లే రావచ్చు (సుమారుగా చెప్తున్నాను. కొంతమంది ఎక్కువ వాడచ్చు) అదే మీరు బయట కొన్న
strips వాడితే ప్రతి సారి స్ట్రిప్ స్ట్రిప్ చొప్పున యాభై డాలర్ల దాకా అవుతుంది. చూస్కోండి మరి. డాలర్ ఎక్కడ? యాభయ్ డాలర్లు ఎక్కడ?
దీనికి కావలసిన పదార్దాలు ఒక పావు స్పూను gelatin పౌడర్, పావు చెంచ పాలు మాత్రమే. ఇక చేయవలసిన విధానం కి వస్తే ఇది చాలా సులభం కూడా. ఒక చిన్న ప్లేటు తీసుకుని అందులో పావు చెంచా కన్నా కాస్త తక్కువ గెలతిన్ పౌడర్ వేసి అందులో నాలుగు చుక్కలు పాలు పోసి కలపాలి. దీన్నిఒక పది సెకండ్స్ మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టాలి. అది ఎలా వుండాలి అంటే కాస్త పేస్టు consistency లో వుండాలి. కలిపి మీరు ఎక్కడ అయితే పెట్టాలి అనుకున్నారో అక్కడ అప్లై చేస్తే చాలు. ఉదాహరణకి ముక్కు మొత్తం, ముక్కు కింద భాగం అలా అనమాట. అప్లై చేసాక అది ఎండిపోఎదాక ఉంచాలి. ఒక పావుగంట నుండి యిరవయి నిమిషాలు పట్టవచ్చు. బాగా ఎండినాక, జాగ్రత్తగా ఆ లేయర్ ని చేతితో పీకాలి. అంతే మీ బ్లాకుహెడ్స్ ఆ పీల్ చేసిన దాని మీద చూడవచ్చు మీరు.
యిది ఎంతో సులభమయిన, convinient యింకా ఎపుడు కావాలి అంటే అప్పుడు చేసుకొనే సులువయిన పద్ధతి. ప్రయత్నించి చూడండి. ఒక్కసారి ప్యాకెట్ కొనుక్కుని పెట్టుకుంటే మీకు చాల సార్లు వస్తుంది.
Whenever I see panasakura, I remember u. In college, u brought this in ur lunch box. In bangalore, every vegetable shop will sell this. I will try receipe..., :)
ReplyDeletevijaya ni comment panasapottu kura postu lo rayalemo :)
ReplyDelete