Thursday, April 16, 2015

గార్డెన్ కేకు


ఇది నేను పవన్ పుట్టినరోజున చేసిన కేకు. మొదట ఐడియాస్ రాక, అసలు మగవాళ్ళకి నచ్చే విధం గా ఏమి చేయాలో తెలీక చాలానే ఇబ్బంది పడ్డాను. తరువాత తన హాబీస్ కి తగినట్లు ఏమయినా చేయాలి అనిపించి ఆ కోవలో ఆలోచించటం మొదలు పెట్టాను. తను  టెన్నిస్ ఎక్కువ ఆడతారు, దానికి సంబందించినవి, ఇంకా ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం (అందరు మగవాల్లలాగానే) దానికి సంబందించినవి, సరే రీసెంట్ గా దేని మీద ఎక్కువ మనసు పెట్టారో దాని మీద ద్రిష్టి పెడితే కాంటెంపరరీ గా ఉంటుంది అనిపించి, ఈ గార్డెన్ కేకు ని ఎంచుకోటం జరిగినది.

 పోయిన ఏడాది ఆయన చాల బాగా గార్డెనింగ్ అది చేయటం మూలాన సరే అయితే గార్డెన్ థీమ్ తో కేకు ఎందుకు చేయకూడదు అనిపించినది.   ముందు పూల మొక్కలే కానివ్వండి, వెనకాల కూర మొక్కలు కానివ్వండి చాల బాగా చేసారు .  తప్పకుండా తన కృషి మెచ్చుకొనవలసినదె.  రోజు మొత్తం లో సగం పైనే టైం గార్డెనింగ్ కి కేటాయించేవారు. ఇల్లు కట్టుకుని (2013) మొదటి ఏడాది కావటం మూలాన కూడా కొంత టైం ఎక్కువే స్పెండ్ చేయాల్సి వచ్చింది. మట్టి అది కొనటం, పొయ్యటం, పందిళ్ళు వెయ్యటంలాంటివి . సరే ఇక అలా అనుకుని ఆలోచించి ఈ కేకు మొదలు పెట్టాను.
ఈ కేకు కోసం కావాల్సిన పదార్ధాలు:
బేస్ కేకు (మీకు ఇష్టమయిన రెసిపీ ఏదయినా పర్వాలేదు), గ్రీన్ ఫుడ్ కలర్, Vanilla Icing (betty crocker brand), ఎండుకొబ్బరి, Orea Cookies, మార్జిపాన్ (Marzipaan), రెడ్ ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్, StarBurst Candies, Pumpkin candies. 
  ముందు మీకు నచ్చిన రెసిపీ తో ఒక కేకు తయారు చేసి పెట్టుకోవాలి. Vanilla Icing లో గ్రీన్ ఫుడ్ కలర్ వేసి కలిపి, ఆ ఐసింగ్ ని ఈ కేకు పైన పుయ్యాలి. గడ్డి తయారి కోసం ఎండుకొబ్బరి ని ఒక జిప్లోక్ లో తీసుకుని దాంట్లో 2,3 డ్రాప్స్ గ్రీన్ ఫుడ్ color వేసి, జిప్లోక్ మూసి ఆ రంగు కొబ్బరికి అన్టేలాగా కవర్ పైన నుండి రుద్దాలి.
    తరువాత మట్టి కోసం Oreo Cookies ని వాడాను. వాటిని మధ్యకి విరిచి దాంట్లో నుండి క్రీం ని తీసేసి గ్రైండర్ లో వేసి పొడి చెయ్యాలి. లేదా ఇందాక చెప్పిన విధంగానే ఒక జిప్లోక్ లో వేసి చపాతీ కర్ర తీసుకుని పైనుండి బాగా పొడి                అయ్యేదాకా మెదపాలి.

    ఇప్పుడు అక్కడ ఉన్న కూరగాయల కోసం మార్జిపాన్ (బాదాం తో చేసిన పిండి). మన స్వీట్ షాపులలో Cashew sweets వివిధ రకాల shapes లో అమ్ముతున్నారు. అలాంటిదే Europe దేశాలలో మార్జిపాన్  అని బాదం ఇంకా పంచదారతో  చేస్తారు దీన్ని. దీనిని కేకు తయారీలలో వాడతారు. దీనికి expire డేట్ అది ఉంటుంది. చూసుకుని తెచ్చుకోవాలి. దీనితో మనకి కావాల్సిన షేపులు చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కూరగాయలు ఏంటో చూసుకుని వాటికి తగ్గట్లు  రంగులు కలుపుకుని shapes చెసుకోవటమే. మా అమ్మాయి సహాయం దాని ఐడియాస్ నాకు బాగా పని చేసాయి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేయటానికి నాకు ఒక 4,5 గంటలు పట్టింది. ఒక 3,4 రోజుల ముందే కాయగూరలు చేసిపెట్టుకున్నాను. ఆ వారంలో pavan 3,4 రోజులు ఊరు వెళ్ళటం వలన కుడా నాకు ఈజీ గా అనిపించింది (surprise కేకు కావటం వలన ఆయన లేకుండా ప్లాన్ చేసాము).
    ఇక కాయగూరల తయారికి వస్తే, Carrots కోసం మార్జిపాన్ లో కొంత యెర్ర రంగు కలిపి, carrots shape చేసి, తొడిమల కోసం ఆకుపచ్చ రంగు కలిపిన మార్జిపాన్ తీసుకుని తొడిమ చేసి దాని పైన అమర్చాను. 
బంగాళా దుంపల కోసం ఏ రంగు అవసరం పడలేదు.  చిన్నచిన్న ఉండలు తీసుకుని చేయటమే. Raddish కోసం కాస్త తెలుపు, కాస్త ఎరుపు కలిపిన మార్జిపాన్ వాడాను. ఇంకా గుమ్మడి కాయలు డైరెక్ట్ గా హాలోవీన్ సీజన్లో కావటం తో బయట షాపులో candies దొరికాయి. అవే వాడేసాను. సొరకాయ కోసం Starburst క్యాండీ వాడాను. దాన్నిఒక అయిదు సెకండ్స్ మైక్రోవేవ్ చేసి ఆ shape వచ్చేలా చేయటమే. సొర ఇంకా గుమ్మడి తీగల కోసం కుడా candies వాడాను. Tomatoes కి ఎర్రరంగు కలిపిన మార్జిపాన్, ఇంకా వాటి పందిళ్ళకి Pretzel Sticks వాడాను.


      కేకు మొత్తం పూర్తి అయ్యాక, మనకు నచ్చిన రీతిలో కేకును అమర్చటమే. కేకు పైన మట్టిలాగా చేసిన Oreo డస్ట్, ఇంకా గడ్డి కోసం చేసిన ఎండుకొబ్బరి అది పైన నీట్ గా వేసి దాని పైన కూరలు అమర్చటమే. అంతా అయినాక  Lable Maker తో lables అవి చేసి టూత్ పిక్స్ తో వాటిని కావలసిన చోట అమర్చాను.
       మావారి హాబీ కి (గార్డెనింగ్) నా హాబీ (కేకు decoration) ని జోడించి దానికి మా అమ్మాయి సహాయం తో ఇంకా మా అబ్బాయి సహాయంతో (వాడు ఏమి చేయకపోవటమే నాకు పెద్ద సహాయం) (వాడికి ఇంకా నాలుగు సంవస్తరాలు. బుద్దిగా పక్కన కూర్చుని starbust candies ఇంకా చపాతి కర్రతో వాడికి నచ్చిన designs చేస్తూ కూర్చున్నాడు) చేసిన ఈ కేకు నిజంగా నాకు చాలా ప్రత్యేకం.
   చూసి ఎలా ఉందో చెప్పండి, అలాగే రుచి చూడాలి అంటే మాత్రం మీరే చేసుకోవాలన్దోయ్.

  ఈ క్రింది ఫోటోలు చూడండి. కేకు కి కావాల్సిన కాన్దీస్ ఇంకా 4 రోజుల ముందే నేను చేసి పెట్టుకున్న మార్జిపాన్ కాయగూరలు....
 Pumpkin Candies



 తీగలు ఇంకా పాదుల కోసం నేను వాడిన Candies 


   క్యాబేజీ తయారి కోసం ముందు గా పచ్చ రంగు కలిపిన మార్జిపాన్ తో నాలుగు పైన ఫోటో లో చూపిన విధంగా చేసుకోవాలి అలాగే మధ్య భాగం కోసం ఒక చిన్న రంగు కలపని ఉండ చేసుకోవాలి. పూర్తి ఐన క్యాబేజీ మీకు తరువాతి ఫోటో లో కనపడుతుంది.



 బంగాళాదుంపలు, Raddish, Carrots ఇంకా క్యాబేజీ


 తోమతోస్ ఇంకా ఆకులు....
సొరకాయ ఇంకా మొక్కజొన్న కంకుల కోసం ఆరంజ్ ఇంకా పసుపు పచ్చ స్టార్బర్స్ట్candies వాడాను.  వాటిని ఒక 5 సెకండ్స్ ఓవెన్ లో పెడితే కాస్త మెత్త పదతాయి. వాటితో  మనకి ఇష్టమయిన శాపెస్ చేసుకోవటమే.


     ఇక కార్న్ కోసం ఒక టూత్పిక్ ని వాడాను. టూత్ పిక్ కి పచ్చ రంగు స్టార్ట్ బుర్త్స్ట్ ని గుచ్చి, పక్క నుండి ఆకుపచ్చ రంగు కలిపిన మార్జిపాన్ తో కాడ, తొడిమ చేసి అతికించాలి.









   

No comments:

Post a Comment