Monday, April 13, 2015

Princess Elsa Cake


ఫ్రోజెన్ ప్రిన్సెస్ ఎల్సాCake:
కేకులు తినటమే కాని ఎప్పుడు బేకింగ్ మీదకి నా మనసు వెళ్ళనే లేదు. కానీ గత రెండు, మూడు ఏళ్ళుగా ఇంట్లోనే నాకు తెలిసిన ఒక సింపుల్ రెసిపీ తో కేకు చేయటం మొదలు పెట్టాను. అది ఎప్పుడు అందరికి బాగా నచ్చుతుంది. మా అమ్మాయి నేను ఎప్పుడు కేకు చేసినా ఐసింగ్ చెయ్యి అంటూ ఉండేది. అంతకంటే టైం వేస్ట్ పని వేరొకటి లేదు అనుకునేదాన్నికాని గత ఏడాదిగా అదే పెద్ద హాబీ అయి కూర్చుంది నాకు ఇప్పుడు. అంటే నా ఉద్దేశం లో ఐసింగ్ ఎలాగు మనము తినని దానికి దాని గురించి ఆలోచించటం ఎందుకు అని.


కాని ఈసారి మా అమ్మాయి పుట్టిన రోజుకి ఏదన్నా స్పెషల్ గా చేయాలి అనిపించింది. చాలా ఆలోచించాను. చాలానే ఐడియాస్ వచ్చాయిఇంటర్నెట్ లో ఎన్నో వెతికాను. అసలు ఐసింగ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. google లో వెతగ్గా వెతగ్గా ఒక వీడియో దొరికింది. 'ఫ్రోజెన్ ప్రిన్సెస్ కేకు'. చూస్తే తేలిక గానే అనిపించింది. ఇంక ఎలాగు కేకు చేస్తున్నాము కదా అని పార్టీ థీమ్ కూడా మొత్తం అదే పెట్టేసానుఅసలు రీసన్ అది కాదు లెండి.... మా అమ్మాయికి ఫ్రోజెన్ ప్రిన్సెస్ Elsa అంటే చాలా ఇష్టం.
కేకు రెసిపీ కోసం మీరు మీకు నచ్చిన రెసిపీ ఏదయినా తీసుకోవచ్చు.    
కేకు design కోసం కావాల్సిన పదార్ధాలు:
1. 8X4 కేకు పాన్
2. pyrex గ్లాస్ బౌల్ లేదా ఏదయినా బౌల్ శాపే లో ఉండే బేకింగ్ పాన్  3. ప్రిన్సెస్ Elsaa బొమ్మ 
4. Blue కలర్ ఐసింగ్ (నేను Walmart లో Betty Crocker బ్రాండ్ వాళ్ళది Vanilla Frosting 3 boxes తీసుకున్నాను.)
5. రాయల్ బ్లూ కలర్
6. బ్లూ క్యాండీ పెరల్స్
7. బ్లూ షుగర్ క్రిస్టల్స్
నాకు మొదటి సారి ఐసింగ్ చేయటం వలన అసలు ఏవి ఎందుకు   వాడాలో ఎలా వాడాలో కూడా తెలీదు. మొదలు అయితే పెట్టాను.కాని actual గా వీడియో లో చూపించినట్లు రాలేదు. నేను చేసిన తప్పులు, దాన్ని ఎలా సవరించుకున్నానో, మీరు ఎలా చెయ్యాలో దానికి టిప్స్ చెప్పదలుచుకున్నాను.
అసలంటూ బేకింగ్ అండ్ ఐసింగ్ ఐడియా ఉన్నవాళ్ళకి వీడియో చూస్తే ఈజీ గా చెయ్యచు. ఐడియా లేని నేనే మొదలు పెట్టాను అంటే చూడండి. కానీ మొదలు అంటూ పెట్టాక ఇది అంత తేలిక పని కాదు అనిపించింది. ఎలాగోలా పని అయితే పూర్తి అయింది.అందరు చాలా బాగా మెచ్చుకున్నారు కూడానూ....
సరే యిక తయారి విధానం:
1. మొదటగా దీనికి 3 కేకులు కావాలి. మీకు వచ్చిన రెసిపీతోనే 3 కేక్స్ తయారు చెయ్యండి.రెండు కేక్స్ 8X4 వి రౌండ్ గా చెయ్యాలి. మూడోది pyrex బౌల్ (డోమ్ shapeలో ఉన్నది) (గౌన్ shape రావటం కోసం డోమ్ shape ఉన్నబౌల్ వాడటం జరిగినది.) కింద రెండు రౌండ్ shape కేకులు ఒకదాని మీద ఒకటి అమర్చి, దాని పైన డోమ్ shape కేకు బోర్లించి పెట్టాలి. ఇలా పెట్టటం వల్ల గౌన్ shape వస్తుందిమొదటి సారి బేకింగ్ వలన, ఎక్కువ knowledge లేక చాలానే తప్పులు జరిగాయి. అవి ఏమిటో చెప్పి, వాటిని ఎలా అదిక్రమించానో, ఇక ముందు కేకు బేక్ చేసేవాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ఎలా జాగ్రత పడాలో, తప్పు చేసినా ఎలా సవరించుకోవాలో చెప్పటం కోసమే blog.
మొదటి కేకు బేక్ చేసాక, పాన్ నుండి సరిగ్గా ఊడి రాలెదు.అతుక్కుపోయి  వచ్చిందిమొదటికేకు. ఎక్స్పీరియన్స్ తో రెండో కేక్ బేక్ చేసేముందు, బేకింగ్ పేపర్ వేసి బేక్ చెసాను. చక్కగా బేకింగ్ పాన్ లో ఇది వేసి చేస్తే కేక్ దానంతట అదే ఊడి వచ్చినది  - 
ఇక బౌల్ shape కేకు - ఇది చేయటం అనుకున్నంత తేలిక కాదు. రౌండ్ కేకు కి 40 నిమిషాలు చాలు. కాని బౌల్ shape చేయటానికి  50-60 నిమిషాలు పట్టింది. అంచుల దగ్గర చివర్లలో బాగా చక్కగా బేక్ అయింది కాని, మధ్యలో మాత్రం వుడకలేదు. ఇలా జరగకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు తీసుకుంటే సరి. మొదటిది మామూలు కేక్ కన్నా కాస్త ఎక్కువ సేపు బెక్ చేస్తే సరిపొతుంది. ఇంకా కేక్ బెక్ చేసేముందు, పిండి మధ్యలో Heating Core (మన స్టీల్ గ్లాస్ లాగా ఉంటుంది) పెడితే సరిపోతుంది. చక్కగా ఉడుకుతుంది. నేనయితే అది వాడలేదు. అంతా అయ్యాక ఎక్కడో చదివాను. ఎలాగు కేక్ కి మధ్య భాగం తీసివెయ్యాలి కాబట్టి, వుడకకపోయినా పెద్దగా భయపడాల్సిన పనిలేదు.
ఇప్పుడు గుండ్రటి కుకీ కట్టర్ ఒకటి తీసుకుని ప్రతి కేకు మధ్య భాగం లో పెట్టి కట్ చెయ్యాలి. మూడు కేక్స్ కి అలాగే చెయ్యలిమూడు కేక్స్ చల్లారాక ముందు ఫస్ట్ రౌండ్ కేకు పెట్టి దాని పైన రెండవ రౌండ్ కేక్, దాని పైన బౌల్ shape కేక్ ని బోర్లించి పెట్టాలి.

5. ఇప్పుడు మీకు Shape Gown లాగా వస్తుంది. ఎల్సా బొమ్మని తీసుకుని  దాన్నిజాగ్రత్తగా మూడు కేక్స్ మధ్యలో పెట్టాలి. ఇప్పుడు మీకు గౌన్ వేసుకున్న ఎల్సా బొమ్మ తయారు అవుతుంది.
6. ఇక ఐసింగ్ కోసం Betty Crocker Vanilla Icing ని 2 1/2 టిన్నులు ఒక పెద్ద బౌల్ లో తీసుకోండి . కొంచం ఎక్కువ తీసుకుంటేనే బెటర్. లేదా ఐసింగ్ తక్కువ అయితే మళ్ళా రంగు కలిపినప్పుడు కలర్ మాచింగ్ కి ప్రాబ్లం రావచ్చుఇప్పుడు మీరు ఎంచుకున్న రాయల్ బ్లూ ని కొద్దికొద్దిగా వేస్తూ మీకు కావలసిన రంగు వచ్చేంతవరకు కలపాలిముందే ఎక్కువ రంగు వెయ్యకూడదు.
7. ఇప్పుడు కేకుల మీద ఐసింగ్ జాగ్రతగా పుయ్యాలి పని అంత తేలిక ఏమి కాదండీ ప్రాక్టీసు తోనే వస్తుంది. అంతా ఈవెన్ గా పూసాక, ఒక 15 నిమిషాలు ఫ్రీజర్లో పెట్టి తియ్యాలి. ఐసింగ్ కాస్త గట్టి పడ్డాక రెండో కోటింగ్ వేయటానికి వీలుగా ఉంటుంది. రెండో కోటింగ్ కూడా జాగ్రత్తగా వెయ్యాలి.
   కేకులు ఒకదాని పైన ఒకటి పెట్టినప్పుడు ఎగుడుదిగుళ్ళు వచ్చినట్లయితే కుకీ కట్టర్ తో కట్ చేసిన కేకును మెదిపి, గ్యాప్లలో కూరి పైన మరో ఐసింగ్ లేయర్ వేస్తే సరి.    ఐసింగ్ పైన  ఇప్పుడు కావాల్సిన డిజైన్ వేసుకుని క్యాండీ పెరల్స్, రైటింగ్ కలర్స్ , బ్లూ షుగర్ క్రిస్టల్స్ తో అలంకరించాలి. మీ క్రియేటివిటీ కి పని యిది. కేక్ అంతా అయ్యాక, ఫ్రిజ్జిలో పెడితే ఫ్రెష్ గా ఉంటుంది.  పార్టీ కి ఒక గంట ముందు కేకును బయట పెడితే చాలు.
  ఇది నా లైఫ్ లో మొదటి ఐసింగ్ కేక్ అవటం వలన నాకు అంత సులభం ఏమి అనిపించలెదు. అందుకని నేను చేసిన తప్పులు మీరు చేయకుండా ఉండటం కోసం బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను.
బేక్ అండ్ ఎంజాయ్



No comments:

Post a Comment