Thursday, April 26, 2012

క్యాబేజీ పచ్చడి ; దొండకాయ పచ్చడి


రోటి పచ్చడి గురించి గూగుల్ లో వెతికినా అన్నిటికి దాదాపు రెండే పద్దతులు కొద్దిగా అటు యిటు తేడా తో. ఒకటి.... కూరగాయ అయితే చేద్దాము అనుకుంటున్నామో దాన్ని పచ్చిమిర్చి తో మగ్గపెట్టి, కాస్త చింతపండు, జీలకర్ర, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సి కొట్టి పోపు పెట్టటం. రెండు.... పోపుసామానులు సెనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు ఎండుమిర్చి వేయించి, మగ్గినముక్కలతో మిక్సి కొట్టి కొత్తిమీర వెయ్యటం రెండు రకాలు అన్ని కూరలతో చేయటం మాములుగా అందరు చేస్తూనే వుంటారు.
 
కాని కింద నేను చెప్పే పద్ధతి వీటికి కొంచం విరుద్దం. ప్రయత్నించి చూడండి.
                  మామూలుగా క్యాబేజీ కూర వండినప్పుడు పూటకి తిని మరుసటి పూటకి అంటే ఎవ్వరు ముట్టుకోరు. పిల్లలయితే అసలు చెప్పనే అక్కరలేదు. అది అలా ఫ్రిజ్జి లో ఒక రెండు, మూడు రోజులు మూలిగి వెనక్కి వెళుతుంది. అలా అని ఒక చిన్న క్యాబేజీ తీసుకుని తరిగినా,  తరుగు బాగానే వస్తుందిఅప్పుడు కూర తో పాటు కాస్త తరుగుని పచ్చడికి ఉపయోగించి చూడండివెరైటీ గాను వుంటుందిరుచి గాను వుంటుంది.
కావాల్సిన పదార్దాలు:
రెండు గుప్పెళ్ళు క్యాబేజీ తరుగు, మంచి నాటు టొమాటో ఒకటి, పచ్చి మిర్చి రెండు లేక మూడు, చింతపండు కొంచం, ఉప్పు, జీలకర్రఎండు మిర్చి, పొట్టు మినపప్పు, ఆవాలు, కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు (optional ) , నూనె, పసుపు.
తయారు చేసే విధానం:
ముందుగా క్యాబేజీ తురుమును ఒక గిన్నెలోకి తీసుకుని దానికి కాస్త పసుపుఉప్పు చేర్చికాసిన్ని నీళ్ళు వూరికే అలా చిలకరించి బాగా పిసికి పక్కన ఒక పదిహేనుయిరవయి నిమిషాలు పెట్టండి.
యిప్పుడు ఒక బాణలిలో ఒక రెండు మూడు చెంచాల నూనె వేసికాగాక టొమాటో ముక్కలుపచ్చిమిర్చి వేసి  మూత పెట్టి మగ్గించండితరువాత మిక్సి లో  టొమాటో మిశ్రమంఅర చెంచ జీలకర్రకాస్త చింతపండుతగినంత ఉప్పు వేసి మిక్సి పట్టండి. (ఉప్పు చూసుకుని వెయ్యండిక్యాబేజీ లో ఉప్పు ఆల్రెడీ వేశాము) (టొమాటో పచ్చడి బాగా పలుచగా ఉండేటట్లు కాకుండా కొంచం చిక్కగా ఉండేటట్లు చూడండి). యిప్పుడు క్యాబేజీ ముక్కలు ఉన్నబౌల్ తీసుకుని యి టొమాటో పచ్చడి దాంట్లో ఒక స్పూను వెయ్యండియిక్కడ గుర్తు పెట్టుకోవాలసినది ఏమిటి అంటే టొమాటో పచ్చడి లో క్యాబేజీ ముక్కలు తగులుతూ వుండకూడదు. క్యాబేజీ ముక్కలకి టొమాటోపచ్చడి అంటుకుని వుండాలి. అంటే పచ్చడి ఎక్కువ వుండకూడదుఅందుకే ముందు ముక్కలలో ఒక చెంచా పచ్చడి వేసి బాగా కలిపి కావలసి వస్తే యింకాస్త వేయాలి.
                         యిప్పుడు యిక పోపు కోసం బాణలిలో నూనె వేసి ఆవాలుఎండుమిర్చి ముక్కలుపొట్టుమినపప్పుయింగువకరివేపాకు వేసి పచ్చడి లో వేయటమేచివరగా కొత్తిమీర చల్లితే క్యాబేజీ పచ్చడి is ready to taste. యింగువవెల్లుల్లి  రెండిటిలో ఏది కావాలి అంటే అది వేసుకోవచ్చు పోపులో.
యిది దాదాపు మనకు సలాడ్ లాంటిదే. నూనె తక్కువ వేసి టొమాటో పచ్చడి చేస్తే చక్కటి ఆరోగ్యవంతమయిన డైట్ చపాతిలోకి, అన్నంలోకి తినటానికి తయార్

                      అచ్చం గా యిదే పద్దతిలో దొండకాయ కూడా వేసి చెయ్యవచ్చుకాని దానికి, ముందు ఉప్పు వేసి వూరబెట్టాలసిన అవసరం లేదుఅచ్చం గా ముక్కలు వేసేసుకోవచ్చు. ముక్కలు మాత్రం చాలా చిన్నవిగా తరగాలి. క్యాబేజీ పచ్చడి కి అయితే టొమాటో పచ్చడి కొంచం తక్కువే పడుతుంది. దొండకాయకి మాత్రం కాస్త పచ్చడి ఎక్కువగా ఉంటేనే రుచి. క్యాబేజీ తరిగినప్పుడే కాసిన్ని దొండకాయలు తరిగి పెట్టుకుంటే రెండు పచ్చళ్ళు ఒకేసారి చేసుకోవచ్చు.  యింట్లో ఒకటి రెండు టొమాటోలు, కాసిన్ని  పచ్చిమిర్చి వుంటే చాలుపచ్చి కూరలు వంటికి మంచివి అంటున్నారు కదండి, అలా అని అవి కొరుక్కు తినెయ్యలేము కదాఏదో నోటికి నచ్చేలాచపాతిఅన్నం లో కూడా కలుపుకుని తినేలా  రెండు ప్రయత్నించి చూడండి.
                          





2 comments:

  1. Vandana, nuvvu Detroit vacchinappudu chesina Mango pacchadi recipe kuuda post cheyyava.

    ReplyDelete
  2. oh ya. kani adi variety pachadi kade :) anyway aa recipe niku mail chesthanu personal ga

    ReplyDelete