Friday, November 6, 2015

3 Piece Candle Light Set For Diwali


మొత్తం ప్రాజెక్ట్ కి అయిన ఖర్చు పదమూడు డాలర్లుగ్లూ కి సెపరేట్ బిల్లింగ్ అనుకోండి.

Thursday, April 16, 2015

దివాలి కేకు




ఈ కేకు కి కూడా మార్జిపాన్ ని వాడను దీపావళి Fireworks కోసం. చిచ్చుబుడ్డి, భూచక్రం, కాకరపువ్వొత్తి, దీపాలు, తారాజువ్వలు అన్ని మార్జిపాన్తో చేసినవే. కాకరపువ్వొత్తి కాడ కోసం లాలిపాప్ స్టిక్స్ వాడాను. సీమటపాకాయల క్యాండీ స్త్రింగ్స్ అని దొరుకుతాయి. అవి తెచ్చి కట్ చేసి వాడాను. ఇంకా బోర్డర్స్ లో దివాలి లైట్స్ వైరింగ్ కి కూడా  ఆ క్యాండీ స్త్రింగ్స్ వాడాను. బల్బ్స్ కోసం జెల్లీ బీన్స్ వాడాను. అలానే బ్లూ షుగర్ crystals వాడాను పైన కేకు decoration కోసం.


 మార్జిపాన్ తో చేసిన కాకరపువ్వొత్తులు


 పచ్చభూచక్రం


 రాకెట్స్ ఇంకా తెల్ల రంగు భూచక్రం


 చిచ్చుబుడ్లు



క్యాండీ స్త్రింగ్స్ తో చేసిన సీమటపాకాయలు

Halloween Trick or Treat Bag Cake




ఇది చాలా సింపుల్ కేకు అండి. ఒక స్క్వేర్ కేకు చేయాలి ముందు. దానికి ఆరంజ్ రంగు ఐసింగ్ పూయాలి. ఐసింగ్ లో బ్రౌన్ కలర్ వేసి కళ్ళు, ముక్కు, మూతి పెట్టాలి. బాగ్ కి బోర్డర్స్ కోసం Candy Corns (store bought) వాడాను. బాగ్ Handles కోసం black twizzlers వాడాను. సంచి లో నుండి candies పడిపోతున్నట్లు candies అన్ని ఆ బాగ్ ముందు భాగం లో అతికించటం అంతే. కొన్ని కింద ప్లేట్ లో కూడా పోసి పెట్టాలి, అంటే బాగ్ లోనుండి కిందకి పడుతున్నట్లుగా.

గార్డెన్ కేకు


ఇది నేను పవన్ పుట్టినరోజున చేసిన కేకు. మొదట ఐడియాస్ రాక, అసలు మగవాళ్ళకి నచ్చే విధం గా ఏమి చేయాలో తెలీక చాలానే ఇబ్బంది పడ్డాను. తరువాత తన హాబీస్ కి తగినట్లు ఏమయినా చేయాలి అనిపించి ఆ కోవలో ఆలోచించటం మొదలు పెట్టాను. తను  టెన్నిస్ ఎక్కువ ఆడతారు, దానికి సంబందించినవి, ఇంకా ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం (అందరు మగవాల్లలాగానే) దానికి సంబందించినవి, సరే రీసెంట్ గా దేని మీద ఎక్కువ మనసు పెట్టారో దాని మీద ద్రిష్టి పెడితే కాంటెంపరరీ గా ఉంటుంది అనిపించి, ఈ గార్డెన్ కేకు ని ఎంచుకోటం జరిగినది.

Monday, April 13, 2015

Princess Elsa Cake


ఫ్రోజెన్ ప్రిన్సెస్ ఎల్సాCake:
కేకులు తినటమే కాని ఎప్పుడు బేకింగ్ మీదకి నా మనసు వెళ్ళనే లేదు. కానీ గత రెండు, మూడు ఏళ్ళుగా ఇంట్లోనే నాకు తెలిసిన ఒక సింపుల్ రెసిపీ తో కేకు చేయటం మొదలు పెట్టాను. అది ఎప్పుడు అందరికి బాగా నచ్చుతుంది. మా అమ్మాయి నేను ఎప్పుడు కేకు చేసినా ఐసింగ్ చెయ్యి అంటూ ఉండేది. అంతకంటే టైం వేస్ట్ పని వేరొకటి లేదు అనుకునేదాన్నికాని గత ఏడాదిగా అదే పెద్ద హాబీ అయి కూర్చుంది నాకు ఇప్పుడు. అంటే నా ఉద్దేశం లో ఐసింగ్ ఎలాగు మనము తినని దానికి దాని గురించి ఆలోచించటం ఎందుకు అని.